Previous Page Next Page 
ఉద్యోగం పేజి 13

సత్యం దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. క్షేమసమాచారం వగైరా మినహాయించి ఆ ఉత్తరంలో నాక్కావలసిన విషయాలు యివి.
".... ఇక్కడ నీకోకధ చెప్తాను. దాన్ని నీగుండెల్లో దాచేసుకో. నేను సత్యవతిని ప్రేమించానని చెబుతే నమ్మవేమోగాని నేను ప్రేమించినమాట నిజం. అయితే ఆసత్యవతికి డబ్బుకావాలి. హోదాగల ఒక మొగుడు కావాలి.
సత్యవతిని  చదివించింది  సుందరశివరావు.అందుచేత విధవయ్యింది. సుందరశివరావుకి గుండెడబ్బుంది. నాలుగేళ్ళక్రితం సుందరశివరావు ఆజబ్బు మింగేసింది: మొన్నీ మధ్యనే సత్యవతి పుట్టింటి కెళ్ళిపోయిందని తెలిసింది. వెళ్ళే ప్పుడు  అత్తవారింట చిన్నసైజు యుద్ధం చేసిందట,అయ్యా! ఇదీ కథ.
సత్యవతికి పెళ్ళయ్యేంతవరకూ నా ప్రేమని దాచుకున్నారా రావ్! ఆమె మొగుడు పోయింతర్వాత ఆమెనే మరిచిపోయాను. నీఉత్తరం నాకు చాలా గుర్తుచేస్తోంది. అందుచేత చదివి  దాన్ని చించవతల పారేశాను. ఇకముందు సత్యవతి విషయమైన నువ్వు నాకు ఉత్తరాలు రాయక. ఇది నా రిక్వెస్టు,సత్యం."
సాయంత్రం గదికి వెళ్ళగానే పార్ధుని చూశాను. కావాలనిచెప్పి నాగదిలోకి పిలిచాను. రెండు చాకలెట్లు వాడిచేతిలో పెట్టాను. వాటిని దూరంగావుంచి అన్నాడు.
" తప్పు, నేను తినకూడదు.అమ్మపిన్ని తిడుతుంది."
" ఎందుకనిట?"
" మిరిచ్చిందేమి తినగూడదు."
" ఫర్లేదు తిను. మి అమ్మపిన్నికి నేను చెబ్తాగాని తిను."
భయంగా తీసుకున్నాడు.
" మి అమ్మగారి పేరేమిటోయ్?"
" సత్యవతమ్మ"
" మరి మి నాన్నగారిపేరు?"
" లేరుగా."
" పేరేమిటి?"
" సుందరంగారు చాలా మంచివారు. మా చిన్నాన్నా మంచివాడే. అమ్మపిన్నికి  అమ్మంటే యిష్టంలేదు. నన్ను తిడుతుంది. బాబ్జీ కి అమ్మ నాన్న ఏవైనాతెస్తే దాన్లోని నాకస్సలే పెట్టదు."
"  బాబ్జీ ఎవరు?"
" అమ్మ పిన్ని కొడుకు."
" చూడు పారూ! మి అమ్మా నువ్వు ఎంచక్కా మి చిన్నాన్నదగ్గరి కెళ్ళిపోగూడదూ?"
" మా అమ్మ రాదు."
" ఎందుకనట?"
" మా అమ్మ వాళ్ళందర్తో పోట్లాడేసిందిగా అందుకు."
పక్కవాటోలోంచి  'పారూ'  అని కేక వినిపించింది. పార్ధుడు మిగిలిన చాక్లెట్ నోట్లో వేసుకుని పరపరమిలి మూతి ముడుచుకుంటూ అన్నాడు.
"అమ్మపిన్ని పిలుస్తోంది."
"వెళ్ళిరా అప్పుడప్పూ వొస్తుండు."
పార్ధుడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వేపు చూస్తూ నించున్నాను నాగదిగుమ్మందగ్గిర. డాబామిద వాళ్ళిద్దరూ నా వేపూ , పార్ధుడివేపూ చూస్తున్నారు. ధైర్యం చేసి నేనింకా అక్కడే నించున్నాను డాబామిద నించున్నాయన నన్ను చేత్తో పిలిచాడు . వెళ్ళేందుకు ముందు  సందేహించేను.
" రండి మాస్టారు! మిముందే మెట్లున్నాయి రండి"
చొక్కా వేసుకుని వెళ్ళాను. నేను మెట్లెక్కుతూండగా, ఆవిడ కిందికి దిగింది. ఆయనొక్కడే డాబామిద ఉన్నాడు. నన్ను సాదరంగా ఆహ్వానించాడు,  తనముందున్న పేముకుర్చీ చూపించాడు. కూర్చున్నాను.  అంతవరకూ మోగుతోన్న ట్రాన్సిస్టర్ని ఆఫ్ చేసి వో వారగాపెట్టి అనానాడు:
"నా పేరు ముకుందరావు. పోస్టల్ డిపార్టమెంటులో పన్చేస్తున్నాను."
నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
" మికు వీళ్ళందరితో మునుపు పరిచయం వుందా?"
" పార్ధుడి నాన్నగారు నాక్కొచెం  తెలుసు. మేమంతా కలసి చదువుకున్నాం."
అలాచెప్పండి సుందరరావు మాకు దూరపుబంధవు. మొన్న మిరూ విన్నారుగా ఆ కామాక్షమ్మగారు మిమ్మల్ని ఎంతలేసి మాటలన్నరో.మాకు పిల్లలులేరంటే అది మాఖర్మ! కానీ పిల్లల్ని పిల్లలుగా చూచేగుణం మాకుంది. కడుపుకి కంటేమాత్రం రాక్షసత్వం  మంచిదా?"
ముకుందరావు ఇచ్చిన సిగరెట్టు ముట్టించుకుంటూ మౌనం వహించాను.
వీళ్ళందరికథ చెప్పాలని నాకేమాత్రం లేదు. అవుతే మికూ పార్డుడంటే యిష్టంగనక వాళ్ళకథ చెప్తాను.చెప్పేదాండి.
"చెప్పండి."
" సుందరశివారావు అంతస్తేమిటో మికూ తెలుసుననుకుంటాను వాళ్ళింట్లో బంగారం భోంచేస్తారన్నా  అతిశయోక్తి కాదేమో .అలాంటియింట పుట్టిన పార్ధుడు యిక్కడింత హీనంగా బతుకుతూంటే మనసున్న మనిషెవ్వడూ  సహించలేడు.అంతమాత్రంచేత వాళ్ళ సొంతవిషయాల్లో జోక్యం కల్పించుకోడమూ మంచిదికాదనుకోండి. కానీ, జాలనేదివుంటుందికదా! ఇది ఆకామాక్షమ్మగారికి గిట్టదు. ఆవిడమాట శ్రీధరరావుకి వేదవాక్కు."
ఇంకా ఏంచెప్పేవాడో తెలీదుగాని మధ్యలో నేనో ప్రశ్న వేశాను.
" అవునూ. సత్యవతి వాళ్ళ త్తమామల్తో పోట్లాడి ఒచ్చేసిందటగా . ఇక్కడికొచ్చి ఈలేనితనాన్ని భరించడానికేనా వాళ్ళతో పోట్లాడింది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS