Previous Page Next Page 
ఉద్యోగం పేజి 11

- కొన్నాళ్ళపాటు  'ఆలోచింప' జేసిన  ' ఆ సుందర శివరావు భార్యేనా ఈమె?  లేకపోతే- అదే పాటని  నామనసుకి నచ్చే రీతిని అంత చక్కగానూ ఎలా పాడగలదు? ఎలా పాడుతుందసలు?
నేనీ  గదిలోచేరి  యిన్ని రోజులైనా,ఒక్కరోజు గూడా సుందర శిరరావు కన్పించలేదు' శ్రీధరరావుగారికీ, నేనూహిస్తున్న ఈసత్యవతికీ సంబంధమేమిటో తెలీదు. వో వేళ పరిస్థితిలు అనుకూలించక సుదంరశివరావు సత్యవతిలా పెడ్లాడలేకపోయేడా?- ఏమో- అదీ జరిగుండవచ్చు. ఈ ప్రేమ కథలు ఒక్కోమాటు బదీయమైపోగలవు.
దొడ్లో అలికిడైనట్టు గమనించేను. కిటికీ గుండా ఆత్రంగా చూసేను. మెరపుతీగలాటిపడుచు తెల్లని బట్టల్లో మరింత మెరిసిపోతోంది. సన్నజాజులు అతిన  నాజూగ్గా కోసుకొంటోంది. నూటికి నూరుపాళ్ళు సత్యవతి! నమ్మకంగా సాక్షాత్తు ఆవిడే!
అకస్మాత్తుగా ఆమె నా కిటికీవేపు చూసింది గబిక్కిన అక్కడ్నించి  లేచివొచ్చి హోల్డాలుమిద కూర్చున్నాను. సుందరశివరావు గుర్తుకొచ్చేడు. అంతగా ప్రేమించిన  అతను సత్యవతి  నెందుకు పెళ్ళి చేసుకోలేదు?
సత్యవతితో ఉత్తర ప్రత్యుత్తరాలునాకు అంతగా లేవు అతను నాగార్జునసాగర్ లో పన్జేస్తున్నాడు. వెంటనే అతనికో ఉత్తరం రాశాను.
" ఈమిషయంలో కూతూహలం పొరపాటుకాదేమో సత్యం!నా మనసుకున్చచిన మనుషుల్లో వాళ్ళిద్దరూవున్నారు గనక యింతగా రాయడమవుతోంది. నిజమే. నీతో తిరిగి నన్నాళ్ళూ వాళ్ళవిషయం ముచ్చటించలేదు.అంతమాత్రం చేత నేనువాళ్ళని మరిచిపోయేనని అనుకోవద్దు.
రాత్రి నాకునచ్చిన పాట విన్నాను.అదేపాటని కొన్నేళ్ళక్రితం నీతో పాటు సుందరశివరావు పార్టీ కొచ్చి నప్పుడు విన్నాను ఆనాడు నా పరవశత్వాన్ని మందలించావు గూడాను. కానీ సత్యం - ఆపాటంటె నాకెంతో యిష్టము. నేనిప్పుడిక్కడ కవిత్వమేదో రాయబోతున్నానని ఖంగారు పడకు. నీ  అభిరుచి నాకు తెలుసు. నీతో అడ్జెస్టు కావడమూ తెలుసు.
సత్యవతి ఆపాటపాడింది. మి సుందశివరావు ఆ రోజుల్లో ఆపిల్ల ని తప్ప మరెవ్వరినీ పెళ్ళిచేసుకోనని మనందరికీ చెప్పేడు. బహూశ నీ కిది గుర్తుంటుందనుకుంటాను. రాత్రి అదేపాట  వినిపించగానే సత్యవతి జ్ఞాపకమొచ్చింది.ఆతర్వాత నేనిక్కడ సత్యవతిని చూసేను. ఇన్ని రోజులైంది. ఇప్పటి కొచ్చి చెప్పలేనుగానీ, సుందరశివరావు మాటతప్పి మరో పిల్ల నెవర్నైనా పెళ్ళాడాడోమోనని పిస్తుంది. ఇది కేవలం ఒక అనుమానం.
నీకు వాళ్ళిద్దరివిషయమేదైనా తెలుస్తే వెంటనేజవాబు వ్రాయి. ఏంతోచక రాసిన ఉత్తరమని కొట్టిపారేయకు . నీ జాబుకోసం ఎదురుచూస్తూంటాను..."
ఉత్తరాన్ని పూర్తిచేసి, ఆవేళే  పోస్టుచేయడానికి బయటువెళ్ళేను. పోస్టు చేసి  తిరిగి గదికొస్తుండగా, నా గది ముందు పారూ, బుజ్జీ యిద్దరూ కర్రల్తో  కత్తియుద్ధం చేస్తూన్నారు. వాళ్లనిచూస్తూ అక్కడే నించుండిపోయేను.
రాను రాను  ఆ యుద్ధం మంచిరక్తిగా తయారవుతోంది. పార్ధుడు చాలా తమాషాగా కర్రతిప్పేస్తూన్న్నాడు.  బుజ్జి దొంగదెబ్బ తీసేందుకు ఎదురుచూస్తున్నట్టుంది. వాడప్పుడే బిక్కమొహంపెట్టి దొంగచూపులు చస్తున్నాడు రాస్కెల్!
తృటిలో పార్ధుడి కాలిమిద బుజ్జిగాడు కొట్టేవాడేను. వెంటనే వాళ్ళిద్దరి మధ్య కీ వెళ్ళి, బుజ్జి  ప్రయత్నాన్ని వారించి, న్యాయంగా పోరాడమని హెచ్చరించేను. పార్ఢుడు ఉత్సాహంగా తలూపేడు  గానీ, బుజ్జిమాత్రం నావేపు మిర్రున చూసేడు.    
డాబా తాలూకు పనిలేని ఆడకూతురు మరో  మగరాజుతో క్రింద ఈ ధర్మయుద్ధాన్ని చాలా యిదిగా చూస్తూన్నట్టు గమనించి గబగబా నా గదిలోకి ఒచ్చేను.
బయటమళ్ళీయుద్ధంప్రారంభమయింది.ఈతడవకొంచెంజోరుగాసాగుతోంది.యుద్ధంసినీమాల్లో లాగా పార్ధుడు  తన యెడం చేతిని ఎత్తిపెట్టి కుడిచేత్తో కర్రని మహా సరదాగా తిప్పేస్తూన్నాడు.
సరిగ్గా అదే సమయంలో ఓ  లావుపాటి ఆడమనిషి అక్కడికొచ్చింది. సాగుతూన్న యుద్ధం టక్కున ఆగిపోయింది. అక్కడ్నుంచి ఆవిడ గొంతుచించుకోడం మొదలైంది.
"అయ్యో,అయ్యో , నీ కళ్ళు నెత్తిమిద కొచ్చేయట్రా పారూ! నీ చేతులు విరిగిపోనూ- చిన్న వెధవన్చేసి నీ యిష్టమొచ్చినట్టు కొట్టేస్తూన్నావుట్రా!  నిన్న ని  ఏం ప్రయోజనం, చెట్టంత ఎదిగి ఈ అఘయయిత్వాన్ని చూస్తూన్న వాళ్ళననాలి. కడుపుకి కంటే తెలుస్తుందికానీ, ఎంత మొత్తుకుంటే ఏంప్రయోజనం...? ....నీ కెన్నిసార్లు చెప్పాలిరా మడ్డి వెధవా, ఈరౌడీ ఆటలాడొద్దని. ఇంకా  యిక్కడే నించున్నావేరా? కదులు" అన్చెప్పి బుజ్జిచెవిపుచ్చుకు బరబరా లాక్కుపోయిందావిడ.
పార్ధుడు బిక్కమొహంతో , నేలమిద కాలుతో రాస్తూ నించున్నాడు.    
డాబామీదున్న ఆవిడ, అతన్తోసహా- తుపాకిగుండు తగిలిన పిట్టల్లా రివ్వున డాబాదిగేశారు.
"కడుపుక్కంటే తెలుస్తుంది గానీ- "
నాకూ బాధనిపించింది.ఎలాగేతేనేం ఈ భూమ్మిద  ఈవిడొక్కర్తే కనిపార్సేస్తున్నారు కాబోలు. నాకూ బాధనిపించింది.ఎలాగైతేనేం ఈ భూమ్మిద ఈవిడొక్కరే కనిపారేస్తున్నారు కాబోలు బిడ్డల్ని! పిల్ల లిద్దరూ ముచ్చటగా ఆడుకుంటున్నారని చూడ్డంగానీ, మాకు  పిల్ల ల్లేరని కాదుగా. ఆ డాబావాళ్ళ సంగతేమిటో తెలీదు గానీ, కొన్నిరోజుల్లో నేనూ తండ్రినికాబోతున్నాను.
"అమ్మా! తల్లీ! నువ్వేమో ఆగదిదాటి   ఒక్కడుగు ఇటురావు. మి పార్ధుడేమో ఇక్కడ పసిపిల్ల వాడ్నిష్టమొచ్చినట్టు కొట్టిపారేస్తూన్నాడు. అదేమంటే మిడిగుడ్లు పెట్టుకుమింగేస్తున్నాడు. రా!వచ్చి వాడిఅతారాన్ని చూడు ఏ గాలికి బతుకుతే మాకేమన్నట్టు కూర్చుంటే నష్టమెవ్వరికి?"
ఆవిడింకా అరుస్తూనే వున్నది.
రాతిర పక్కవాటాలోంచి మెల్లిగా మాటలు వినిపించేయి. పార్ధుడికి బుద్ధిచెబుతోంది సత్యవతి.
" అల్లరిగా తిరక్కూడదు నువ్వు. బాగా మాటలు   వినిపించేయి. పార్ధుడికి బుద్దిచెబుతోంది సత్యవతి.
"అల్లరిగా తిరక్కూడదు  నువ్వు. బాగా చదువుకోవాలి. పదిమందిలోనూ మంచి అనిపించుకోవాలి. నువ్వు  నా మాట వినకపోతే నా కేడుపొస్తుంది పారూ చెప్పు.... అమ్మయేడు స్తే నీకు బాగుంటుందా?"
వెంటనే శ్రీమతి గుర్తుకొచ్చింది నాకు. ఆమధ్య వారం రోజులపాటు విపరీతమైన దగ్గుతో బాధపడిపోయేను. అది కేవలం సిగరెట్లు అతిగా కాల్చడం వలనని మా ఆవిడ నింద! రెండురోజులు చెప్పిచూచింది. ఆరెండురోజులూ కావాలని చెప్పి మరింత ఎక్కువగా కాల్చాను.అప్పుడన్నది, కళ్ళినిండా నీళ్లు నింపుకుని;
"కనీసం నా ముందైనా సిగరెట్లు కాల్చకండి. మి దగ్గుచూస్తూంటే భయమేస్తోంది. దానిక్కారణాన్ని పదే పదే గుర్తుచేసి నన్ను బాధపెట్టకండి. నేను బాధపడటం మి కిస్టమైతే మరి నేనేం చెప్పలేనంతె!"
శ్రీమతి గుర్తుకు రావడంతో సిగరెట్టు కాల్చాలనిపించింది. సిగరెట్టు ముట్టించి పొగ వదిలేను . ఇక్కడొక మాట మనవి చేయాలి. నేను కలల్లో కొంచెం సరదాగా తిరిగేమనిషిని ఈ అలవాటిప్పటిదికాదు. చాలా మంది నన్నీ విషయంలో ఎగతాళి చేసేవారు గూడాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS