"సుమతి మీ సిస్టర్రా!"
'అందుకని దాని ప్రైవేట్ ఎఫైల్స్ లో జోక్యం చేసుకోమంటావా / నావల్ల కాదది. "సుమతీ! నువ్వు చిరంజీవిని ప్రేమించడం మానేసి సీతపతినే ప్రేమించమ్మా!' అని చెప్పేందు కిదేమైనా కూరగాయల వ్యవహారమా / ప్రేమరా ప్రేమ! ప్రేమనేది జీవితంలో ఒకే ఒక మాటు, ఒకే ఒకడి పైన కలుగుతుంది. అంతేగాని, రోజుకో రకంగా రోజుకో మనిషి మీద కలగదు. తెలుసా?" అన్నాడు సత్యం ఆవేశంగా. సీతాపతి పెళపెళా నవ్వేశాడు. ఆ నవ్వుని మరి కొంత సేపు పోడిగెంచేడు. నవ్వు ఆగిపోవటంతోటే అతని మొహం ఎర్రబడి వుంది. హోటల్లో వున్న సంగతి మరిచి చాలా రోషంగా అన్నాడు సీతాపతి."
"ఏం చెప్పావురా సత్తిగా ఒరేయ్. నువ్వు మరిచి పోయావో, లేక నటిస్తున్నావోగాని మీ సుమతి మొట్ట మొదట ప్రసాదం గాణ్ణి ప్రేమించింది. నీకూ తెలుసా విషయం. పైగా, అది మామూలుగా ప్రేమించలేదురా. ఘాటుగా ప్రేమించింది. వాడు, ఆ ప్రసాదం గాడు సాధు జంతువు గనక చేతులు కట్టుక్కూచున్నాడు గానీ , అదే మరో రౌడీ వెధవై వుంటే - ఆ పరిచయంతో సుమతికి పుట్టిన చైల్డ్ కి తండ్రై పోయేవాడు. చూస్తుండు. చిరంజీవిగాడు ఆ హోదాకి పెళ్ళి కాకముందే చేరుకోకపోతే నన్ను పేరుతొ పిలవకు!"
సత్యం చివాలున లేచి నుంచున్నాడు. గుప్పెట బిగించేడు గాని, మళ్ళా వెంటనే తెరిచేడు. గట్టిగా అరవబోయేడు గాని, సంభాళించుకోన్నాడు. కానీ, అతి నెమ్మదిగా మాట్లాడినా, చాలా కటువుగానే అన్నాడు.
'అంత మాట విని , నువ్వు గనక బతికి పోయేవు. అదే మాట మరో వెధవ ఎవడైనా అని వుంటే వొళ్లు చీరేసి వుందును. సుమతి నాకు సిస్టరన్న సంగతి మరిచిపో. ఒక ఆడపిల్ల గురించి చెడుగా మాట్లాడకు. నీ కసేమిటో నాకు తెల్సున్రా! ఎవడో నిన్ను ఛీ కొట్టాడని వాడిమీద నీ మంటని దమ్ము లేక మరో మనిషికి అంట గడుతున్నావ్. జాగ్రత్త! ఇంకెప్పుడూ సుమతి ప్రేమ విషయం నా దగ్గిర మాటాడకు. అసలీవాళనుంచి నాతొ ఏమీ మాటాడకు. గుడ్ బై వెళ్ళొస్తా!"
సత్యం వెళ్ళిపోతుండగా , సీతాపతి లోలోన కోపంతో మండిపోయేడు!
"వీడుత్త గంగిగోవు! సుమతికి అన్న వీడు. సుమతిని చెడగొట్టి పొరపాటయింది సత్తిగా క్షమించమని వేడుకుంటే వీడిక నోరెత్తడు. ఇంతటి మంచి ముండవాడని దగ్గిరేట్టుకుని బంగారం లాంటి అవకాశాన్ని చిరంజీవి కోదిలేసిన పూలున్నేను. నాకై నేను ప్రెసిడెంట్ గా పోటీ చేసి వున్నా బాగుండి పోను. ఇటీజ్ టూ లెట్ నౌ! ఇప్పుడెన్నను కున్నా ప్రయోజనం లేదు. జరిగేదేదో జరక్కమానదు. మన జాగ్రత్తలో మన ముండాలి."
* * *
"సుమతి చిరంజీవితో చాలా యిదిగా తిరుగుతుంది తెలుసా?" అన్నాడు రవి.
"తెలీదు" అన్నాడు ప్రసాదం.
"మొన్న సినిమాలో చూశాను. నిన్న బీచ్ లో చూశాను. ఈ రెండు తడవలూ వాళ్ళవి పెద్దగా పట్టించుకోలేదు గాని, ఇవ్వాళ దెయ్యాల బంగాళా దగ్గర వాళ్ళిద్దరూ అతి దగ్గిరగా కూచుని నవ్వేసుకుంటూ , ఒకళ్ళ మీద ఒకళ్ళు బడిపోతూ మాట్లాడుకుంటుంటే నావళ్ళు మండిపోయింది ప్రసాదం!"
"నీ కెందుకు వళ్ళు మండిపోవడం?"
"పెళ్ళి కాకుండా, అలా పట్టపగ్గాలు లేకుండ క్లాసు లేక్కట్టి తిరిగేస్తుంటే వళ్ళు మండదూ?"
"అయినా ఆ దెయ్యాల బంగళా వేపు నువ్వెందు కెళ్ళావ్?"
"నువ్వేమో అక్క దగ్గిరి కెళ్ళిపోయేవ్ . నా కొక్కడికీ తోచి చావదాయే? పుస్తకం తీసుకుని అటు వేపు వెళ్ళెను. నీకు తెలుసుగా అదెంత నిర్జన ప్రదేశమో! నేను వాళ్ళని చూశాను గాని వాళ్ళు నన్ను చూళ్ళేదు."
"ఇంకెప్పుడూ అటు వెళ్ళకు."
చాలా సేపు ఇద్దర్లో ఎవరూ మాట్లాడలేదు. నిశ్సబ్దాన్నింక భరించలేక రవి సిగరెట్టు ముట్టించుకుంటూ అన్నాడు. 'అయినా ప్రసాదం , ఆడపిల్ల మరీ అంత చొరవగా తిరగడం మంచిది కాదేమో! ఏమంటావ్!"
"పరీక్షలు దగ్గిర పడుతున్నాయి. శ్రద్దగా చదువుకోవడం మంచిది. ఏమంటావ్?" అన్నాడు ప్రసాదం.
"ఏం మనిషినో గాని నీతో స్నేహం చేయడం బహు కష్టంరా ప్రసాదం,' అన్నాడు రవి.
ప్రసాదం నవ్వి వూరుకున్నాడు.
---ఆదివారం సాయంత్రం ప్రసాదం బజారు నుంచి యింటి కోస్తుండగా సీతాపతి కారులోవచ్చి అతని ముందాగాడు. డోర్ తెరచి 'గెటిన్ ప్లీజ్' అన్నాడు.
ప్రసాదం ముందు తటపటాయించాడు గాని మళ్ళీ సీతాపతి బలవంతం చేయగా కారెక్కక తప్పింది కాదు. అతను కారులో కూచున్న తర్వాత స్టీంగ్ దగ్గిరున్న సీతాపతి సర్దుక్కుచున్నాడు హుందాగా.
కారు మెత్తగా పోతుంది. ఆ కారు గురించి మాటాడేడు సీతాపతి.
"మావయ్య కొన్నాడు. ఇవాళ ట్రైల్ వేస్తున్నాను. అవునూ, ఎల్లా చదువుతున్నారు?"
"ఫర్లేదు."
"ఎక్కణ్ణుంచేమిటి? మీ ఫ్రండ్ నొదిలి ఒంటరిగా వొస్తున్నారు?"
"లైబ్రరీ కెళ్ళేను."
'అల్లాగా! నే నసలు మీ రూమ్ వేపే వస్తున్నాను. దార్లోనే మీరు కలిశారు. మనం కలుసుకుని చాలా కాలమైంది కదూ?"
"కాలేజీలో రోజూ కనుపిస్తూనే వున్నాంగా."
"ఏం కాలేజినో లెండి. కాలేజి అంటే భయంగా వుంది."
'భయమా?"
"ఆఫ్ కోర్స్ ! సరిగ్గా భయమని కాదనుకోండి, అదో రకమైన నిరుత్సాహం."
" .... .... ...."
"ఎప్పటికప్పుడు చాడువుదామనుకుంటూనే ఇంతకాలం చదువుని నిర్లక్ష్యం చేసి - యిప్పుడు పరీక్ష లోస్తున్నాయని తెలిసి బెంగపడిపోతున్నాను. వదిలేయండి - చదువు గోల, ఇవాళ , ఈ కొత్త కారు మీద ఒక కొత్త సినిమాకి వెడదాం. ఏవంటారు?"
"వోద్దులెండి. ఏకంగా పరీక్షలై పొయిం తర్వాత చూద్దాం సినిమాలు."
సీతాపతి చిర్నవ్వు నవ్వి అన్నాడు.
"మీలాటి బ్రిలియంట్స్ గూడా ఎప్పుడో వచ్చే పరీక్షలకి యిప్పట్నుంచే చదువు చదువని కలువరిస్తే ఎలా చెప్పండి? మొద్దులం మేము చదువు కోసం బెంగ పడాలి గాని మీకేమంది? నిక్షేపంగా , చదవక పోయినా పాసవుతారు."
'అయినా, నాకు సినిమాల పట్ల అంత అభిమానం లేదు."
సీతాపతి నిట్టూర్చి అన్నాడు. "పోనీండి . మీ కోరిక ప్రకారం సినిమా మానేద్దాం. కొత్త కారు కొన్నాం గనక, అల్లా బీచ్ వరకూ వెళ్ళి వద్దాం కాదనకండి. ఒక్క అర గంటలో వచ్చేద్దాం. ఒకే "
ప్రసాదం కొంతసేపు అలోచించి అన్నాడు. "సరే, మీ యిష్టం!"
"థాంక్స్ ."
కారు బీచ్ వేపు సాగింది. బీచ్ కి దూరంగా కారు ఆపి ఇద్దరూ కాలినడక ప్రారంభించారు. దార్లో సీతాపతి ప్రసాదంతో తన కుటుంబ వ్యవహారాలు కొన్ని చెప్పటం మొదలు పెట్టేడు.
ఒకచోట ---
సీతాపతి మాట లాగిపోయేయి. అతనూ ఆగిపోయేడు . ప్రసాదం చేతిని పుచ్చుకుని, దగ్గిర్లో ఆగివున్న కారుని చూపిస్తూ అడిగేడు సీతాపతి.
'ఆ కారేవరిదో గుర్తించేరా?"
