Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 22

 

    "అయితే యింకేం లైటు లేని సైకిల్నాపే పోలీసులా అదర గొట్టేరు గదండి బాబూ!" అన్నాడు చిరంజీవి.
    "ఇహ ..... ప్రారంభించనా మరి?" తొందర పడుతున్నాడు సీతాపతి.
    "మనం కులాసాగా కాలక్షేపం చేయడాని కిక్కడ చేరేం. ఆ బొమ్మ గురించి మీరిప్పుడు మాటాడితే మర్యాద దక్కదు. మన స్నేహం చేడిపోడం అటుంచండి. క్షణంలో బద్ధ విరోధులమై పోతాం. తర్వాత మీ యిష్టం!" అన్నాడు రవి ఆవేశంగా.
    "ఏమిటండీ మీ ఫోజు? ఆ ఫోటోకీ మీకూ సంబంధ మేమిటసలు?" సీతాపతి అడిగేడు.
    "ఆ ఫోటో సీతక్కది?" రవి తలొంచుకుని అన్నాడు.
    "సీతక్కా? ఎవరా సీతక్క?" చిరంజీవి అడిగేడు.
    'ఒక అభాగ్యురాలు. ప్రేమించి ప్రేమలో ఫెయిలైన ఆడకూతురు. ఆడదైనా 'కర్తవ్యంలో మగాడిని మించిన మనిషై తన తమ్ముడ్ని పెంచి పెద్దచేసి నిలబెట్టిన దేవత! ఆ తమ్ముడికి సీతక్కే సర్వస్వం. అమ్మా నాన్నా అన్నీ సీతక్కే! మనం తాగి వున్నాం. మన మనస్సుల్లో దెయ్యాలు చేరాయి. సీతక్క వున్న గదిలో దెయ్యాలు చేరాడవే గొప్ప నేరం. దెయ్యాలున్నది చాలక సీతక్కని అవమానిస్తే మనకిక పుట్టగతులుండవు. ప్లీజ్ ..... సీతక్కని ఎవనకండి" రవి ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.
    "మరి ఇందాక మీ సిస్టరు కాదన్నారు," అన్నాడు సత్యం.
    "ఆ మాట కొస్తే సీతక్క మనందరికీ సిస్టరే!" అన్నాడు రవి.
    "జోకేయకండి సార్! ఎవరో ఆడపిల్లని నాకు సిస్టరని ఎవడైనా పరిచయం చేస్తే వొళ్ళు మండుకొస్తుంది. ఇంతకీ ఈ సీతక్క ఎవరి సిస్టరో చెప్పండి!" అన్నాడు సీతాపతి.
    "మన వరప్రసాదం అక్క!" అన్నాడు రవి.
    మౌనంగా వుండిపోయేరు . మధ్యలో అకస్మాత్తుగా సీతాపతి నవ్వడం ప్రారంభించేడు, ఆ నవ్వు ఎంతకీ తెగిపోలేదు.
    రవి లేచి నుంచున్నాడు. కానీ, తూలిపోవడం నుంచి తప్పించుకోలేక పోయేడు. అతి జాగ్రత్తగా నడిచి .... ఆ ఫోటో దగ్గిరికి వెళ్ళేడు. ఆ ఫోటోని గోడ వైపు తిప్పి మళ్ళా వచ్చి కూచున్నాడు.
    అప్పటిగ్గాని సీతాపతి నవ్వు ఆగలేదు. నవ్వు ఆపి అన్నాడు.
    "అల్లా చెప్పండి..... సీతాపతి వర ప్రసాదానికీ సిస్టరా? బాగుంది . ప్రేమలో ఫెయిలైన నిర్భాగ్యురాలా? ఇంకా బాగుంది. ప్రేమించటం వాళ్ళింటి ఆచారం కాబోలు. వండర్ పుల్. సత్తె మొరేయ్! ఈ సీతక్క కధ మీ కుమతితో తప్పకుండా చెప్పి జాగ్రత్తని హెచ్చరించు. ప్రసాదాన్ని మీ కుమతింకా ప్రేమిస్తుందేమో .....పాపం .....గూబ గుయ్యమంటుందని హెచ్చరించు.
    థాంక్స్ అండీ రవిగారూ! .... మంచి కధే చెప్పేరు..... మేమంతా వెధవలం గనక నోరు జారిపోయేం సీతక్క మహా గొప్ప ఇల్లాలు! ఇల్లాలంటే అర్ధం కరేక్టేనా? ఇంకో ఇల్లాలి నెవరినైనా కనుక్కు చెప్పాలా? ఏమోలే ...... అయ్యా అదీ కధ..... ఒరేయ్ సత్తెం ........వెధవా! జోగడం మాని లేచి నుంచో. మనం ఇల్లు చేరుకునే వేళయింది. చిరంజీవి నువ్వులే. ఒరేయ్ సోడాల కుర్రాడూ.... నీకూ చెప్పాలేవిట్రా రాస్కెల్ ..... లేచి నుంచోరా గాడిదా! వొస్తా మండి రవి బాబు గారూ! బుద్ది తక్కువై , మందు బలమ్మీద ఏదేదో పేలెం. ఇంత పవిత్రమైన గది అని తెలీక ఇక్కడ కొలువు పెట్టేం. క్షమించండి. వెళ్ళొస్తాం."
    సీతాపతిని మెడ పిసికి చంపాలన్నంత కోపం వచ్చింది రవికి. కాని, ఏమీ చేయలేక పోయాడు. వాళ్ళందరూ వెళ్ళి పొయిం తర్వాత తలుపులు మూసి, అతను పరుపు మీద వాలిపోయేడు.
    ఉదయమే వరప్రసాదం గది కొచ్చేడు. గది తలుపులు మూసి వుండటంలో లోపల రవి యింకా నిద్ర లేవలేదనుకున్నాడు.
    తలుపు తట్టేడు.
    సమాధానం రాక పోవడంతో మళ్ళా తలుపు తట్టీ "రవీ' అని పిలిచేడు.
    తలుపు తెరిచాడు రవీ.
    ఆతను మనిషంతా నలిగిపోయి వున్నాడు. అతని కళ్ళు ఎర్రటి చింత నిప్పుల్లా వున్నాయి.
    వరప్రసాదం అతన్నేమీ పలుకరించ కుండానే లోపలికొచ్చి సంచి బల్ల మీదుంచేడు.
    బట్టలు విడుస్తూ అడిగాడు.
    "మనిషివి బాగా నలిగున్నావు ఎన్నికల హడావుడి యింకా తగ్గలేదా? అన్నట్టు చిరంజీవి గారే గెలిచేరుట? దార్లో ఎవరో చెప్పేర్లె!"
    "... ... ... ....."
    "ఎన్నడూ లేని దివాళ యింత మొద్దు నిద్రేమిటి?
    ఈ పిచ్చి చూపులేమిటి? నీ వాలక మేమిటి?"
    "రాత్రి పొద్దు పోయి నిద్ర పోయేను."
    "స్నానం చేయి ముందు."
    "కాదులే ...... నువ్వే ముందు స్నానం చేయి. నా కింకా బద్ధకం గానే వుంది వెళ్ళిరా."
    వరప్రసాదం బాత్ రూమ్ వేపు నడిచాడు.
    అతను స్నానం ముగించి వచ్చినప్పుడు కూడా రవి పక్కమీద అల్లాగే దొర్లుతున్నాడు.
    అతన్నా స్థితిలో చూసి ప్రసాదం విసుక్కున్నాడు.
    "ఎంత పొద్దుపోయి నిద్రపోతే మాత్రం ఏవిటీ బద్ధకం అసహ్యంగా ..... లే."
    రవి వొళ్ళు విరుచుకుంటూనే స్నానానికి వెళ్ళేడు.
    ప్రసాదం గది నంతా పరికించి చూసేడు. గదిలో చిరుతిళ్ళు తాలుకూ కాగితాలూ, సిగరెట్లు పీకలూ అసహ్యంగా పడివున్నాయి. కొంచెంగా స్పిరిట్ వాసన గప్ మంటోంది. గోడ మీద సీతక్క ఫోటో గోడ వైపు తిప్పబడి వుంది!
    గబగబా వెళ్ళి ఆ ఫోటోని సర్దేశాడు ప్రసాదం.
    ఆ ఫోటోని ఎవరెందుకు మూసారో బోధపళ్ళేదు ప్రసాదానికి. గదిలో వున్నది రవి ఒక్కడే! సీతక్క పట్ల ప్రసాదానికి ఎంత గౌరవమున్నదో రవి గూడ అంతే గౌరవమున్నది.
    అయితే ఆ ఫోటోని ఎవరు మూసి వుంటారు.
    ప్రసాదం బట్టలు తొడుక్కుని రవి కోసం ఎదురు చూస్తూ కూచున్నాడు.
    రవి రావడంతోటే , అతన్నడిగాడు-
    "రాత్రి మన గదికి ఎవరయినా వచ్చేరా రవీ"
    రవి బాధపడ్డాడు. రాత్రి జరిగిందంతా ప్రసాదు కెలా చెప్పాలో తోచక మౌనం వహించాడు.
    "చెప్పు రవీ! ఎవరైనా వచ్చారా?"
    "వోచ్చేరు ."
    "ఎవరు?"
    "చిరంజీవి ఎన్నికల్లో నెగ్గేడు గదా, చిన్న పార్టీ చేసుకున్నాం."
    'అల్లాగా.... ఎవరెవరు వచ్చారేమిటి?
    "చిరంజీవి, సత్యం, సీతాపతీ!"
    "అవును గానీ రవీ! సీతక్క ఫోటోను గోడ వైపు తిప్పిందేవరు?"
    "నేను, " అన్నాడతను దిగులుగా.
    "నువ్వా? నువ్వు ఎందుకలా చేశావు?"
    ".... .... .... .... "
    "ఫర్లేదు . చెప్పు రవీ! నువ్వు ఆకారణంగా సీతక్క ఫోటోని కదపవు. రాత్రేం జరిగిందో పూర్తిగా చెప్పు."
    "రాత్రి మేమంతా తాగేం ప్రసాదం! క్షమించు!"
    ప్రసాదం మళ్ళా ఆశ్చర్యపోయాడు.
    "తాగేరా? వాళ్ళందరితో కలిసి నువ్వూ తాగేవా రవీ?"
    "అవును. నువ్వు ఎలాగో వూళ్ళో లేవని. నేనే వాళ్ళందర్నీ మన గదికి పిలిచెను. ఖర్చంతా వాళ్ళదే అనుకో. నువ్వుంటే మేము సముద్రపు ఒడ్డుకు వెళ్ళి వుండేవాళ్ళం."
    'అది సరే మన గదిలో తాగితే తాగతారు. తప్పో ఒప్పో జరిగిపోయిందేదో జరిగిపోయింది. కాని .... సీతక్క ఫోటోని ఎందుకు తిప్పేవు ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS