Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 10


    "అందరూ తమతమ సెల్లుల్లో ఉన్నారా?" డిప్యూటీ జైలరు మొరిగాడు.
    ఖైదీలంతా ఇనుపతలుపుల వెనక్కు వెళ్ళాక, గార్డులు ధైర్యంగా దాడికి బైల్దారారు. వారు సింహాల్లా రంగంలో దూకారు. బెత్తాలు, లాఠీలు ఎత్తిపట్టుకుని ఖైదీల్ను సెల్లుల్లో దెబ్బమీద దెబ్బ వేస్తున్నారు. ఆ ఉత్సాహంలో వారు ఖైదీల తలలు సహితం బ్రద్దలుకొడుతున్నారు.
    ఈ బెడదంతా తెచ్చిన తనను ఏంచేస్తారు? అతని బుర్ర బద్దలు కొట్టి, చల్లని సిమెంట్ ఫ్లోర్ మీద, భద్రంగా, సంకెలలువేసి రక్తపు మడుగులో వదిలివేస్తారు.
    కాలూ గుండె పొంగిపోయింది. అయినా అతన్ని ఓదార్చడానికి లేఖ ఉందికదా! అతనెప్పుడూ ఆమె ఓదార్పును వింటూనే ఉండేవాడు. "బాబా శాంతం వహించు," అనే ఆమె మాటలు సదా అతని హృదయకుహురంలో ప్రతిధ్వనిస్తుంటాయి.
    అతని భావన అతన్ని వణికించింది. కోపాన్ని అణచుకొని అమర్యాదణు దిగమ్రింగేవాడు.
    మంచి నడవడి ఉన్నట్లు గుర్తించిన ఖైదీకి నెలకు 2 రోజుల శిక్ష తగ్గిస్తారు. ఆరు రోజుల ముందే బైటపడ్డాన్ని గురించి కలలుకంటూ ఉండేవాడు. రాత్రిళ్ళు దీన్నిగురించి అతడు చంద్రలేఖతో చెపుతూ ఉండేవాడు.
    "చంద్రలేఖా నేను నా ఆరురోజుల సమయం - నీ ఆరురోజులు - సంపాదిస్తున్నాను."
    అతడు దూరంగానూ మౌనంగానూ ఉండేవాడు. అతనికి చాల కొద్దిమంది మాత్రమే స్నేహితులైనారు. కాలూకు నేరస్థులంటే ద్వేషం ఉండేది. అతడనేకసార్లు బేడీలు వేయబడిన దొంగల్ని. ఎర్రటోపీలు, ఝార్నాలో న్యాయస్థానానికి తీసుకెళ్తూ ఉండడం చూశాడు. వాళ్ళకట్లానే కావాలి. అదే వారిని శిక్షించే మార్గం అని తాను ఆమోదముద్ర వేశాడు.
    ఒకసారి లేఖ తండ్రితో ఏకీభవించిన
    "వాళ్ళకు తినతిండీ, చేయపనీ లేక అలాచేస్తుంటారేమో" అంది.
    "అర్ధరాత్రి నీ గదిలో దొంగ ఉంటే నీవు ఏమనుకుంటావ్?"
    లేఖ వణికిపోయింది.
    ఇవాళ ఆమె తన్ను చూస్తే వణికిపోతుంది అనుకున్నాడు కాలూ.
    అతడు ఒక స్థిర నిర్ణయానికి రాలేక చికాకు పడ్డాడు. లేఖకు ఉత్తరం రాయాలి. కాని ఆ ఉత్తరం మీద జేలుసీలు ఉంటుంది. జరిగిందంతా లేఖకు వివరంగా చెప్పాల్సి వస్తుంది. తాను దొంగనని లేఖకు ఎలా చెబుతాడు? ఆమె ఎంత బాధ పడ్తుందో?
    కాని అతడు రాయకున్నా ఆమె విచారంతో కృంగిపోతుంది.
    ఎలాగైనా ఆమె బాధపడేదే. అయితే శిక్ష అయిపోయేదాకా ఎందుకు ఆగకూడదూ? తండ్రి విషయంలో ఆమెకు ఉన్న గౌరవాన్ని ఎందుకు చంపుకోవాలి? ఈ విషయం ఆమెకు ఎప్పుడైనా తెలిస్తే? ఇప్పుడు తెలియపర్చినట్లే అవుతుందా?
    ఆమెకు అర్ధం అవుతుందా? ఝార్నా దొంగల్నుచూచి ఆమె నొచ్చుకునేది. తన తండ్రినికూడా వాళ్ళలోనే జమకడితే?
    కాలూ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఒకసారి లేఖ గుండెపగిలి, ఏడుస్తూన్నట్లనిపించింది. వెంటనే ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. అతనికి సంతోషం అయింది. కాని మళ్ళీ కొంతసేపటికి అదే అనిశ్చితస్థితి. రెండురోజులు ఆ వుత్తరం అతనిదగ్గర ఉంచుకొని చింపేశాడు.
    ఒక పక్షం గడిచింది. రాయడం చింపేయడం, రాయడం చింపేయడం, ఇలా చాలాసార్లు జరిగింది.
    ర్తోజులు గడిచినకొద్దీ తాను బయటపడేరోజు దగ్గరకొచ్చిందనీ తఃరువాత రాయవచ్చుననీ అనుకోసాగాడు. లేఖా! ఇంకా చాలారోజులు బాధపడాల్సిన అవసరంలేదు. ఇంకా ఒక నెలా మూడురోజులు -నీ తండ్రిదొంగ, నేరస్తుడు అనేవిషయం తెలుసుకొని బాధపడాల్సిన అవసరం ఉండదు.
    నేరస్తులమీద అతనికి ఉండే ద్వేషం నశించింది. అక్కడవున్న వాళ్ళంతా తనలాగే చిన్న చిన్న దొంగతనాలు చేసినవాళ్ళే. ఒకవ్యక్తితో మాత్రం అతనికి బాగా పరిచయం అయింది. అతడు పొడుగ్గా బక్కపల్చగా ఉండేవాడు. నగరంలోని ఆకలిబాధితుల్ని ఆహారధాన్యాలదుకాణం కొల్లగొట్టడానికి పురికొల్పాడనే బేరంతో అతనికి ఒక సంవత్సరం కఠినశిక్ష విధించబడింది. అతడు బి-10. సెల్లులో వారిద్దరికీ ఇనుప మంచాలు పక్క పక్కనే ఉన్నాయి.
    "అబ్బ! పట్నంలో ఆకలిబాధితులా? కొద్దిమంది అంతేకదూ!" అని ఆశ్చర్యంగా అడిగాడు కాలూ.
    "వేలకువేలు. ప్రతివీధిలోనూ పుట్టలకు పుట్టలు. ప్రతివారం వందలకొలది చస్తుంటారు."
    కాలూమీద పిడుగుపడ్డట్లయింది. అది నిజమైవుంటుందా? అతడు మృగతృష్ణలో నీటికే అర్రులుచాస్తున్నాడా? కాదు బి-10 ఏదో అంకెలగారడీ చేస్తున్నాడు. ఈ యువకులకు గోరంతల్ను కొండంతలు చేయడం అలవాటైంది. బి-10 ఒక ఊహాదృశ్యం చూస్తూండేవాడు. రాత్రిళ్ళు అతడు కలవరించేవాడు. "ముసలివాణ్ణి చంపేస్తున్నారు. మీసోదరున్ని చంపేస్తున్నారు. మీరంతా ఇక్కడే ఉన్నారా?" తరువాత ఒక నీరస ధ్వని. అటుతరువాత ఉద్రేకపూరితమైన అరుపు "నాశనం చేయండి. బూడిద........." కాలూ ఇదంతా వినేవాడు.
    "ఏం? అంతపెద్దపట్నంలో జేలులేకనా నిన్నిక్కడికి పంపింది?"
    "అక్కడి సెంట్రల్ జేలు క్విట్ ఇండియా ఖైదీల్తో నిండిపోయింది. వారంతా భారతదేశం బ్రిటీషువారి బానిసత్వం నుంచి విముక్తి కావాలని కోరుతున్నారు. అందుకే బి-10 ని 50 మైళ్ళ దూరంగా ఉంచాల్సి వచ్చింది".
    కాలూ గతాన్ని నెమరవేసుకుంటూ ఒక్కొక్కటే తన చరిత్రంతా బి-10 కు చెప్పాడు. కమ్మరిగా తన మధురస్మృతులు చంద్రలేఖ, ఆమె పేరువచ్చిన విధం. ఆమెస్కూలురోజులు. అశోకా మెడల్. ఆకలి కలి. ఫుట్ బోర్డ్ మీది ప్రయాణం. అన్నీ పూసగుచ్చినట్లు చెప్పేశాడు.
    "నీకు మహానగరం బాగా తెలుసుకదా! నాకెక్కడ పనిదొరుకుతుందో చెప్పు. డబ్బు పుష్కలంగా దొరకాలి. సాధ్యమైనంత త్వరలో ఝార్నావెళ్ళి చంద్రలేఖను నగరానికి తీసికొనిరావాలి."
    బి- 10 మౌనంగా తన తల ఆడించాడు.
    "చెప్పు" అని అరచాడు కాలూ తన వ్యధను వ్యక్తపరుస్తూ.
    "నీకు సాధ్యపడదు"
    "ఏంటీ?" కాలూ ఆ యువకుని రెండుభుజాలు పట్టుకున్నాడు.
    "నువ్వెవరో తెలియకుండా నీకు పనెవరిస్తారు? నీవంటినిండా జేలువాసన కొడ్తుంటేనూ."
    "నువ్వనేది వాస్తవంకాదు" కాలూ దురుసుగా అరచాడు.
    అతని హృదయానికి అంతా అర్ధంఅయింది. జైలుకువెళ్ళి వచ్చినవాణ్ణి తాను వ్యాపారంలో భాగస్వామిని చేసుకుంటాడా? తండ్రి ఖైదీ అయిన యువకునికి తనబిడ్డనిచ్చి పెళ్ళిచేస్తాడా?
    అయితే ఎలా? తాను స్వంత కమ్మరివ్యాపారం సాగిస్తే ఏ చిక్కూ ఉండదు. కాని.......డబ్బు.....డబ్బు ఎక్కన్నుంచి వస్తుంది?
    అతడు తలబద్దలు కొట్టుకున్నాడు. మూడునెల్లు వృధాగా ఆలోచనలోనే గడిచాయి. చివరకు అతనికి బాధతప్ప ఏమీ మిగల్లేదు. బ్రతుకుదెరువు ఎట్లా? ఏం చేయాలి?
    అతడు బోనులోంచి బైటపడేరోజు తల్చుకుంటే కంపరమెత్తేది. అందుగురించి ఆలోచించినప్పుడల్లా అతనిముఖంమీది నరాలుపొంగి కోపంతో రక్తం వేగంగా ప్రవహించేది. తాను ఏంచేశాడు? ఇతరదొంగలకంటే అతడు మేలేమీకాదా? ఇది న్యాయమా? నాటకమా? సంవత్సరాలు తరబడి రక్తంపిండి ఆర్జించిన తన సొత్తు అయిదింట్లో ఒకటవవంతుగానే మిగిలిపోయింది. మిగతాది ఎవరు తీసుకున్నారు? అది ఎక్కడికో పోయివుండాలి ఏ పర్సులోకో, ఏ ఇనప్పెట్టిలోకో దానికెవరూ బాధ్యులు కారా? ఈ దోపిడీకి ఎవరినీ శిక్షించాల్సిన అవసరంలేదా?
    రాత్రికి, ఆ ఇరుకుమంచంలో, సగంకాళ్ళు, బైటవుండగా, ఆలోచనలో మునిగి పోయాడు. నిద్రరాదు. లేఖసైతం అతనికి సహాయపడేట్టులేదు. కాలూకు పస్తులు వుండడమంటే భయంలేదు. కాని అతనికూతురు లేఖ గతేంకాను?
    అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ "నేనూ నిన్నుగురించే ఆలోచిస్తున్నా" అన్నాడు బి-10.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS