సాయిబాబా సూక్తులు చాలా సరళంగా ఉంటాయి. ఆయన బోధనలు మనల్నిరకరకాల అవలక్షణాల నుండి బయట పడేస్థాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. సాయిబాబా ఉద్బోధ మానవ కల్యాణం కోసమే.
బాబా సూక్తులు కొన్ని చూడండి.
* "నేను" అనే అహంకారాన్ని వదిలిపెట్టండి.
* నన్ను నమ్మండి. మీ దుఖాలన్నీ మర్చిపోయి, నిశ్చింతగా ఉండండి. భారం నామీద మోపండి.
* ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను.
* అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో స్థిరంగా ఉంటాను.
* మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను.
* మీరు చేయాల్సిందల్లా ధ్యానం.
* ఇతర ధ్యానాలన్నీ వదిలి నామీదే దృష్టి నిలపండి.
* నిరంతరం స్మరించండి, జపించండి
* మనసులో అలజడులన్నీ తగ్గుతాయి.
* కోరికలన్నీ తీరతాయి.
* పూర్తి ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది.
|