షిర్డీ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు.
సద్గురు షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. సాయిబాబా భక్తుల సంకల్పాలు నెరవేరుతాయి. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి. ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం.
సద్గురు షిర్డీ సాయిబాబా నామంతో చింతలకు తావు లేకుండా పోతుంది. సాయిబాబా మనకు అన్నీ సమకూర్చే కామధేనువు, కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. మనకు సరైన మార్గాన్ని చూపే దివ్యమణి. సాయిబాబా సర్వాన్నీ ప్రబోధించే విజ్ఞాన సర్వస్వం. సాయి సూక్తులు అమృత జల్లులు.
సాయిబాబా మనకు సర్వవేళలా రక్షణగా నిలుస్తాడు. సాయిబాబా నామం స్మరిస్తే చాలు ధైర్యంగా ఉంటుంది. ఎనలేని శక్తి సమకూరుతుంది. సాయిబాబా సూక్తులతో స్ఫూర్తి కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మనోనిబ్బరం కలుగుతుంది. మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించే షిర్డీ సాయిబాబాను సదా స్మరించుకుందాం. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకుందాం.
|