సాయితత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది.
షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘ శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది. సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసించి సుసంపన్నం అవుతాయి.
|