సన్నబడాలంటే స్ట్రాటజీ ఉండాలి!     సన్నగా అయిపోవాలి అనుకుంటే చాలదు, అందుకు ఓ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. అలా ఫాలో అవ్వకపోవడం వల్లే స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతోందని తాజాగా జరిపిన ఓ పరిశోధనలో తేలిందట. సన్నబడాలన్న ఆశ ఉన్నా... సరియైన పద్ధతిని ఫాలో అవ్వకపోవడం వల్లే చాలామంది బరువు తగ్గలేక భారంగా బతుకుతున్నారట. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఓ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఇదిగో... ఇదే ఆ స్ట్రాటజీ. - నిమ్మరసం కూడా కొవ్వును కరిగించడంలో బాగా తోడ్పడుతుంది. అందుకే మీ రోజును నిమ్మరసంతో మొదలు పెట్టండి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోండి. - ఉరుకుల పరుగుల జీవితం విసుగు పుట్టిస్తుందేమో కానీ ఉదయాన్నే పరుగు తీయడం మాత్రం ఆరోగ్యాన్ని పెంచుతుంది. వీలైతే ఉదయాన్నే జాగింగ్ చేయండి. బయటికి వెళ్లలేకపోతే ట్రెడ్ మిల్ మీద పరుగెత్తండి. మరీ పరుగెత్తలేకపోతే నడక. - వెంటనే కాఫీ, టీలకు ఫుల్ స్టాప్ పెట్టేసి గ్రీన్ టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి. దీనిలో ఉండే కెటాచిన్ అనే కెమికల్ కొవ్వును త్వరగా కరిగిపోయేలా చేస్తుంది.   - రోజూ క్రమబద్దమైన బ్రేక్ ఫాస్ట్ ను అలవాటు చేసుకోండి. చక్కెర తక్కువ, పోషకాలు ఎక్కువ ఉండాలి. పండ్ల రసాలు, ఎగ్ వైట్ లాంటివన్నమాట. - రోజంతా నీరు తాగుతూనే ఉండండి. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. కూల్ డ్రింకుల జోలికి పోకండి. - స్నాక్స్ అనగానే సమోసాలు, బజ్జీలు, పఫ్ లు, పిజ్జాలు గుర్తొస్తాయి. కానీ ఇక మీద సలాడ్లు, పండ్లు మాత్రమే గుర్తు రావాలి. సాయంత్రం పూట వాటినే తినండి. ముందు చెప్పుకున్న స్నాక్స్ లాంటివి తింటే సన్నబడాలన్న ఆలోచనను ఇక మర్చిపోవచ్చు. - బద్దకం పెరిగితే బరువు తరగడం జరగదు. అస్తమానం కూర్చుని ఉండకూడదు. కొంతమంది టీవీ చూడటం, పుస్తకాలు చదవడం లాంటివన్నీ పడుకునే చేస్తుంటారు. ఈమాత్రం బద్దకం చాలు బరువు పెరిగిపోడానికి. ఉదయాన్నే వ్యాయామం చేసేసి రోజంతా బద్దకంగా గడిపినా ఫలితం ఉండదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. శరీరానికి కదలికనివ్వాలి. - పగలు పడుకోవద్దు. రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు. సమయానికి పడుకోవాలి. సరిపడా నిద్రపోవాలి. అప్పుడే శరీరం చెప్పుచేతల్లో ఉంటుంది. ప్రతి జీవక్రియా సరిగ్గా జరుగుతుంది. చూశారు కదా ఎంత సింపులో! ఇంత ఈజీ స్ట్రాటజీని కూడా ఫాలో అవ్వలేకపోతే సన్నబడాలన్న కోరిక ఎలా తీరుతుంది? అందుకే వెంటనే దీన్ని ఫాలో అవ్వండి. మీలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. -Sameera

తగ్గడానికి..తిండి తగ్గించక్కర్లేదట     అందంగా కనిపించాలంటే శరీరాన్ని తగ్గించాల్సిందే అంటున్నారు నేటితరం అమ్మాయిలు. దీంతో పొద్దున్న టిఫిన్ తింటే..మధ్యాహ్నాం భోజనం కట్..ఒకవేళ మధ్యాహ్నాం హేవిగా తింటే సాయంత్రం ఖాళీ కడుపుతో పడుకోవడమే.. ఇక రాత్రంటరా..? రాత్రిపూట భోజనం తినడాన్ని ఈ తరం ఎప్పుడో మరచిపోయింది..రెండు చపాతీలు అది కూడా కుదిరితేనే.   ఏది ఏమైనప్పటికి నాజూకైనా శరీరాన్ని సాధించాలి. ఇది ఒక్కటే అమ్మాయిల మెయిన్ టార్గెట్. అయితే పాపం తప్పు వీరిది కాదులే..సన్నబడాలంటే నోరు కట్టేసుకోవాలనే చెబుతారు పేరు మోసిన డైటీషియన్లందరూ. కానీ బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోకుండా సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు బాలీవుడ్ తారల ఫేవరేట్ డైటీషియన్ రుజుత. స్థానికంగా పండిన ఆహారాన్ని తినడంతో పాటు శారీరక వ్యాయామం, కంటి నిండా కునుకు ఉంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారామె. ప్రతీ రోజు నెయ్యి: ఇదివరకటి రోజుల్లో నెయ్యి లేకుండా ఏం తినేవారు కాదు..కానీ ఇప్పుడు సన్నబడాలనే మోజులో నెయ్యిని పూర్తిగా దూరం పెడుతున్నారు. అయితే ప్రతిరోజూ నిరభ్యంతరంగా నెయ్యిని తినొచ్చు అంటున్నారు రుజుత. కొన్ని పదార్థాలను ఎక్కువ నెయ్యితో, కొన్నింటిని తక్కువ నెయ్యితో కలిపి తినొచ్చు. అయితే పరిమితంగా తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది,  జాయింట్ల సమస్యలు దరిచేరవు. జ్యూస్‌లు తాగకండి..పళ్లు తినండి: వీలు కుదిరితే ఏదో ఒక పండును జ్యూస్ చేసుకోవడానికి చూస్తారు తప్ప వాటిని తృప్తిగా తిందామని ఎవ్వరూ అనుకోవడం లేదు..ఎందుకంటే ఎవరికి అంత టైం ఉండటం లేదు. కానీ నోటిలో పళ్లున్నంత కాలం జ్యూస్‌లు చేసుకుని తాగే బదులు కూరగాయలు, పళ్లను చక్కగా నమిలి తినొచ్చంటున్నారు. దీని వల్ల జ్యూస్ చేసుకునే ప్రక్రియలో మిగిలిపోయే పీచు పదార్థాలు ఇతర పోషకాలు కూడా మన శరీరంలోకి వెళతాయి.   వీటిని ఆహారం నుంచి నిషేధించండి: కేక్, బిస్కెట్స్, బ్రెడ్, పాస్థా, పిజ్జా లాంటి జంక్ ఫుడ్‌ని దూరం పెట్టండి.   పొద్దున్నే టీ మానండి: చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే ఏ పని చేయబుద్ధి కాదు. అయితే ధీర్ఘకాలంలో ఇలాంటి అలవాటు చేటు చేస్తుందట. మరీ ముఖ్యంగా ఆకలేస్తే టీతో సరిపెట్టడం మానండి..అయితే మరి ఎక్కువసార్లు కాకుండా రోజులో 2-3 సార్లు తీసుకోవచ్చు.   ఏదో ఒకటి తినండి: ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే మధ్యలో వంటింట్లో లభించే ఆహార పదార్థాలు తీసుకునేవారు. దీని వల్ల పనిలో అలసట ఉండదు సరికదా..? నాజుగ్గా ఉంటారు...భోజనం సమయంలో ఎక్కువ తినరు.

సన్నబడాలా... ఈ థియరీ ఫాలో అవ్వండి!   సన్నబడాలి. కానీ కష్టపడకూడదు. బద్దకమేసి కాదు. టైమ్ లేక. ఇప్పుడు ఇదే చాలామందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటివారి కోసమే ఇది. సన్నబడటానికి ఒక సింపుల్ పద్ధతి... ఫుడ్ రీప్లేస్ మెంట్. అవును. మీరు సహజంగా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలను వేరే వాటితో రీప్లేస్ చేస్తే చాలు... పనైపోతుంది. - రోజూ ఉదయం కాఫీ, టీలలో వేసుకునే పాల నుంచి డెబ్భైకి పైగా క్యాలరీలు వస్తాయి. కాబట్టి పాలు కలిపిన కాఫీ, టీల బదులు లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి తాగండి. - గారెలు, మైసూర్ బజ్జీలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇడ్లీ, దోశలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి. దోశలు నూనె లేకుండా కాల్చాలి సుమా! - పాలతో ఏదైనా పదార్థం చేస్తుంటే కనుక మామూలు పాలను స్కిమ్డ్ మిల్క్ తో రీప్లేస్ చేయండి. దానివల్ల ఓ కప్పుకు దాదాపు డెబ్భై రెండు క్యాలరీల చొప్పున తగ్గుతాయి. - చికెన్, ఫిష్ లాంటి వాటిని ఫ్రై చేసే బదులు గ్రిల్ చేయండి. కూరలు కూడా వండొద్దు. ఎందుకంటే ఓ కప్పు చికెన్ కరీలో 250  క్యాలరీలు ఉంటే... గ్రిల్డ్ చికెన్ లో 114 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. మరి ఎంత మేలు! - మామూలు రైస్ ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేయండి. - సమోసాలు, పకోడీలు, చిప్స్ లాంటి స్నాక్స్ కి బదులు ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తినడం వల్ల కడుపూ నిండుతుంది, బరువూ పెరగరు. - ఫ్రైడ్ ఎగ్ కంటే ఉడికించిన ఎగ్ ఎంతో మంచిది. బాయిల్డ్ ఎగ్ లో 78 క్యాలరీలు ఉంటే ఫ్రై చేసిన దానిలో 100 క్యాలరీలు ఉంటాయి. మరి ఏది బెస్ట్! - కూల్ డ్రింక్స్ ని మంచినీటితో రీప్లేస్ చేయండి. మంచినీరు చేసినంత సాయం ఏ పానీయమూ చేయదు. నీటి వల్ల క్యాలరీలు పెరగవు కానీ ఒక్క డ్రింక్ తాగినా నూట యాభైకి పైగా క్యాలరీలు పెరుగుతాయి. అందుకే దాహం వేసినప్పుడల్లా దాన్నే ఆశ్రయించండి తప్ప కూల్ డ్రింక్స్ వైపు చూడకండి.     ఈ రీప్లేస్ మెంట్ థియరీ ఫాలో అయితే బరువు పెరగరు. ఆల్రెడీ ఉన్న బరువు తగ్గుతారు. ఎప్పుడూ తినే వాటిలో మార్పులు చేయడమే కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. - Sameera

Foods to Boost Your Mood     Nuts: Dry fruits or nuts as we call them are all high in magnesium, which plays a major role in converting sugar into energy, and are also filled with fiber to keep your blood sugar levels even.   Keep a bag of nuts like almonds, cashews and hazelnuts at your desk and just a handful will give you longer lasting energy than a cup of coffee ever will.   Dark Chocolate: Eat a square or two of dark chocolate energizes the body by providing an excellent source of iron and magnesium. Dark chocolate can improve cognitive function, it can prevent Alzheimer and dementia and it can also boost your mood in a matter of minutes.   The darker the chocolate you consume, the better! Dark chocolate slows down the production of stress hormone, and the anxiety levels automatically decrease, moreover, chocolate also makes the brain release endorphins and also boosts the serotonin levels. This creates a feeling of well-being that lasts for several hours.   Green Tea/ Ginger Tea: A large review of studies conducted by researchers world over found that drinking three cups of tea daily was associated with a positive attitude. Also a report recently showed that study participants who sipped four or more cups of green tea daily reported having a more positive mood.   Green tea has been used for thousands of years due to its numerous benefits. Just like berries, green tea is also very rich in antioxidants, amino acids and L-theanine, known for reducing stress and anxiety while improving the mood. If consumed on a regular basis, green tea can give a feeling of overall well-being.   Fish: Salmon is a great source of the energy-boosting goodness that is essential omega-3 fatty acids, which are important for energy production, brain activity and circulation.     Just a gram of fish oil each day and noticed a 50 percent decrease in symptoms such as anxiety, sleep disorders, unexplained feelings of sadness, suicidal thoughts.   Milk: Milk contains proteins high in tryptophan, which is a building block in the bloodstream for serotonin in the brain.   It’s a source of carbohydrates and vitamin D (low levels have been associated with depression), which is required for the production of serotonin. Milk is also a source of calcium, which has been shown to reduce anxiety.   Banana: Bananas contain high amounts of vitamins and minerals, as well as tryptophan which is known for raising serotonin levels.   All the compounds found in bananas are mood-boosting, and vitamin B6 converts tryptophan into serotonin, the mood-lifting hormone. Bananas are one of the world’s best foods for supplying your body with energy. Rich in potassium and B vitamins, they can provide your body with a more sustained release of energy. The supply of vitamins and carbohydrates in bananas make you feel full, help slow down digestion and keep blood sugar levels stable. ..Divya

  Pistachio Power   Eating nuts is what every parent wants his/her child to get habituated to....i wonder if the parents do the same at their age !!? Yes, not many of us consume as many dry fruits as necessary per day, among the adult group. A famous journal published a study on Pistachios. It says that Pistachios have the power to reduce bad cholesterol, control blood sugar and improve overall blodd vessel health. In this study, 60 adults with poor cholesterol lipid levels were the test subjects. They were split into two groups. One group was given LifeStyle Modifications (LSMs) only while the other group was given LSMs and also 40grams of pistachios every day over a period of three months. In comparison, between the two groups, the group that consumed Pistachios had improved their good cholesterol levels and their bad cholesterol levels went down significantly. This group also exhibited lower blood sugar level on fasting, better artery health, better expansion and contraction of arteries too. Every natural fruit and nut that is harmless and edible has its own benefits. Fruits, Vegetables, Pistachios and other nuts are good not only for the children, they can also help a hundred year old. Follow the 'Nut Job', hereon !! ...Prathyusha Talluri

ఈ జ్యూసులు తాగితే సన్నబడటం ఖాయం!     బరువు తగ్గడం పెరిగినంత తేలిక కాదు. నోరు కట్టేసుకుని, కడుపు కాల్చుకుని ఎంత కష్టపడినా తగ్గని బరువును చూసి తెగ బెంగపడుతుంటారు చాలామంది. అలాంటివారికి డాక్టర్లు ఓ శుభవార్త చెబుతున్నారు. నోటికి రుచిగా కొన్ని జ్యూసులు తాగుతూ కూడా బరువు తగ్గొచ్చంటున్నారు. ఇదిగో... ఇవే ఆ జ్యూసులు. - గోరువెచ్చని నీళ్లలో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని, కొద్దిగా తేనె చేర్చి తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారట.   - పైనాపిల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుందట. కాబట్టి రోజుకోసారి పైనాపిల్ జ్యూస్ తాగితే ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. - ద్రాక్షపండ్ల రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. - నిమ్మరసంలో ఉప్పు, తేనె చేర్చి పరగడుపున తాగినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. - జామకాయలో ఉండే విటమిన్ సి బరువును తగ్గించడంలో ఎక్స్ పర్ట్. - అవకాడో జ్యూస్ క్యాలరీలను కరిగిస్తుంది. - టొమాటోలను ఉడికించి, గ్రౌండ్ చేసి, కొద్దిగా బెల్లం కలుపుకుని మూడు పూటలా తాగినా మంచి ఫలితముంటుంది.     చూశారు కదా? రుచికి రుచి... మంచికి మంచి. కాబట్టి తరచూ ఈ ఫ్రూట్ జ్యూసులు తాగండి. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ ఎందులోనూ పంచదార మాత్రం కలపవద్దు. కలిపారో... జ్యూస్ తాగడం వల్ల ఏ ఉపయోగం ఉండదు.  -Sameera  

  ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి     వాకింగ్ అన్నిటకంటే మంచి వ్యాయామం అంటారు నిపుణులు. కానీ సిటీలో ఉండేవాళ్లకు వాకింగ్ చేయడం కష్టమే. దగ్గర్లో ఏదైనా పార్క్ ఉంటే ఓకే. లేదంటే ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వాహనాల రొద, దుమ్ము ధూళిలో నడక అసాధ్యం. అందుకే ఎక్కువమంది జిమ్ ల మీద ఆధారపడేవాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్లిపోయి ప్రశాంతంగా కాసేపు వ్యాయామం చేసుకోవడంలే ఉండే సుఖమే వేరు కదా! అయితే జిమ్ లో చేరాలనుకునేవాళ్లు, చేరినవాళ్లు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది.   ముందుగా ఆలోచించాల్సింది దుస్తుల గురించి. జిమ్ కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.   వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరుగా వెళ్లి మొదలుపెట్టేస్తే వెనువెంటనే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి. అలాగే శరీరాన్నిహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి, వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడమే కష్టమైపోతుంది.   అదే విధంగా వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్ చేయడం చాలా అవసరం. శరరం కష్టపడుతోంది కదా ఆ ఒత్తడిని మనసు మీద పడనివ్వకూడదు. అందుకే అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే వ్యాయామం చేస్తున్నంతసేపూ చక్కని సంగీతం వినండి. చాలా జిమ్స్ లో ఈ సౌకర్యం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే జిమ్ లో మీ అనుభవం ఆనందంగా ఉంటుంది. ఫలితం తృప్తికరంగా ఉంటుంది. - Sameera    

 పెళ్లయ్యిందా... ఫిగర్ గురించి టెన్షన్ పడుతున్నారా...!   టీనేజీ అమ్మాయిలు తమ ఫిగర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ లావైపోతారో, ఎక్కడ ఫిగర్ పాడైపోతుందోనని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మరి పెళ్లయ్యి, ఇళ్లలో ఉండే మహిళల సంగతేంటి? వాళ్లకి ఫిట్ నెస్ అవసరం లేదా? ఈ విషయం చాలామంది గృహిణులు ఆలోచించరు.  కాస్త కేర్ తీసుకోవచ్చు కదా అంటే... ఎక్కడ కుదురుతుంది అనేస్తారు సింపుల్ గా. ఇంట్లో పనంతా చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తకి కావలసినవన్నీ సమకూర్చాలి, ఉదయం నుంచీ ఉరుకులు పరుగులతోనే సరిపోతుంటే ఇక అందంగా తయారయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. నిజానికి కేర్ తీసుకోమనేది అందం కోసం కాదు... ఆరోగ్యం కోసం. అవును. ఫిట్ నెస్ అనేది ఫిగర్ ని పర్ ఫెక్ట్ గా ఉంచుకోవడం కోసమే కాదు... ఫ్యూచర్ ని సంతోషంగా గడపడం కోసం. ఈ విషయం అర్థం కాని ఎంతోమంది గృహిణులు తమ ఒంటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆకర్షణ కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు.   నిజానికి ఫిట్ గా ఉండటానికి పని గట్టుకుని జిమ్ లకి వెళ్లక్కర్లేదు. పనులన్నీ మానేసుకుని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లోనే చక్కని వ్యాయామం ఉండేలా చూసుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే అందాన్ని ఆనందాన్ని మన దగ్గర కట్టి పడేసుకోవచ్చు.   ముందుగా మీరు ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టండి. పనుల హడావుడిలో పడి ఏదో తినేశాంలే అనిపించకుండా ఓ క్రమ పద్ధతిలో తినడం అలవర్చుకోండి. మూడు నాలుగు గంటలకోసారి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకూ ఆహారంలో గింజలు ఉండేలా చూసుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెర తక్కవగా ఉండాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. మసాలాలు, కారం, నూనె తగ్గించేయండి.   ఇక వ్యాయామం సంగతి. మీరు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేలా చూసుకోండి. మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రోళ్లు పక్కన పెట్టేశాం. కానీ ఒక్కసారి మళ్లీ వాటిని వాడి చూడండి. చేతులకు ఎంత గొప్ప వ్యాయామమో తెలుస్తుంది. వీలైతే బట్టలు కూడా వాషింగ్ మెషీన్లో కాకుండా చేత్తోనే ఉతకండి. అపార్ట్ మెంట్లో ఉంటుంటే లిఫ్ట్ వాడకండి. మెట్లు ఎక్కి దిగండి. కూరగాయలకు, సరుకులకు మీవారినో పిల్లల్నో పంపకుండా మీరే వెళ్లి రండి. చిన్న చిన్న దూరాలకు కూడా ఆటోలు బస్సులు ఎక్కకుండా నడిచి వెళ్లండి. ఏ మధ్యాహ్నం పూటో టీవీ చూడాలని కూర్చుంటారు కదా! అప్పుడు రిమోట్ వాడకండి. చానెల్ మార్చుకోవాలనుకున్నప్పుడు టీవీ దగ్గరకు వెళ్లి వస్తూ ఉండండి. బైటికి వెళ్లినప్పుడు సెల్ వాడినా... ఇంట్లో వాడటానికి ఓ ల్యాండ్ లైన్ పెట్టించుకోండి. అది రింగయినప్పుడల్లా పరుగు పరుగున వెళ్లడం కంటే మంచి వ్యాయామం ఏముంటుంది!   ప్రపంచం ముందుకు వెళ్తుంటే మమ్మల్ని వెనక్కి వెళ్లమంటున్నారేంటి అనుకోకండి. మంచి జరుగుతుందనుకుంటే నాలుగడుగులు వెనక్కి వేయడంలో తప్పు లేదు. జిమ్ కి వెళ్లే సమయం, వ్యాయామం చేసే తీరిక లేనప్పుడు కనీసం లైఫ్ స్టయిల్ ని మార్చుకుంటే మేలు జరుగుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది. అనారోగ్యం మీకు దూరంగా పరిగెడుతుంది. వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. - Sameera  

 Healthy Coconut Oil-2     Antibacterial properties: Coconut oil has natural antibacterial properties that help boost immune function and fight off illness-causing viruses and bacteria. It also helps protect the body from ringworm, yeast, candida and intestinal parasites, among other issues. Whats great about the oil is that its texture allows for easy external application, and it can be used for skin issues like diaper rash, eczema and acne. Of course, be sure you're storing the oil you use on your body in a separate container from the one containing the oil you use for cooking. Weight and Cholesterol maintenance: Research shows that, women who had abdominal obesity(excess belly fat), adding coconut oil to their diets reduced body mass index (BMI), waist circumference and "bad" LDL Cholesterol, while raising "good" HDL Cholesterol. Replacing cholesterol-raising fats like butter with a healthier fat like coconut oil is a great way to support weight loss and help maintain healthy cholesterol levels. And healthy weight and cholesterol levels are also good for the heart. Skin and Hair health: Coconut oil is naturally moisturizing, making it good to use externally on dry skin and hair. It also contains the antioxidant Vitamin E, which has a protective effect on the skin and supports healthy aging by reducing free radical damage. I recommend using organic coconut oil to limit exposure to toxins and chemicals. Diabetes support: Emerging studies show evidence that coconut oil supports the health of those with or at risk for Type 2 Diabetes. Research published in a American Heart Association's journal found that "dietary supplementation with MCFA ( medium chain fatty acids) found in sources like coconut oil may be beneficial for preventing obesity and peripheral insulin resistance" conditions that can lead to diabetes. We will learn about how to replace other cooking oils with coconut oil and its supplementation in our next article.

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి?   బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం.   వెజ్ - శాకాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. 2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి. 2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి. 3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి. రాత్రి - డిన్నర్ : 1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి.   మాంసాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. 2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి 2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. రాత్రి - డిన్నర్ : 1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.

బ్యాలెన్స్ డైట్   శరీరంలోని జీవక్రీయలు సవ్యంగా సాగడానికి.. ఆరోగ్యంగా ఉండాలన్నా సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి..? అది తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=lG8myPLKfV8

Quinoa's Nutrition Value Makes it a Superfood!     Quinoa is a grain that originated in the mountainous regions of South America that has gained a lot of popularity over the last few years due to its significant nutrition and health benefit. It contains all nine amino acids that are vital for muscle growth and development. So if you want to build muscle, then quinoa is a complementary of animal products. Animal products provide protein, but they are loaded with cholesterol. One cup of quinoa provides about 220 calories and 8 grams of protein. This is the protein equivalent to one egg or approximately one ounce of chicken, fish, or other animal protein. Another good reason to have Quinoa is it contains more vitamins, nutrients, and antioxidants than any other grain. In fact, you’ll get an impressive list of vitamin B6, thiamin, niacin, potassium, and riboflavin, plus minerals like copper, zinc, magnesium, and folate, as well as the antioxidants phytonutrients quercetin and kaempferol, which lend anti-inflammatory and disease-fighting prowess to each bowl consumed. Quinoa may be beneficial for who are following a gluten-free diet and might be concerned about nutrients they are missing by eliminating gluten-containing grains from their diets. Did you know that Quinoa aids in keeping diabetes at bay? It turns out that eating quinoa also reduces your chances of developing type 2 diabetes, but it can also help you keep those glucose levels balanced if you already have diabetes. This is due to the fact that it’s rich in complex carbohydrates, or healthy carbohydrates, that slowly digest and keep you satiated for longer while keeping your blood sugar and appetite level. Our diet lack required intake of fiber which is alarming reason for many of health problems like obesity, craving for calorie dense food, heart disease, diabetes, etc. Fiber is required for multiple functions that make it vital. Quinoa can fill those gap in your diet. The fiber content of quinoa is double than that of other grains that we usually eat such as wheat, a major source of energy and fiber. It contains both soluble and insoluble fiber. But the quantity of insoluble fiber is quite high thus lowering its benefit. ..Divya

నెలసరి సమయానికి రావడం లేదా..?   రుతుక్రమం.. నెలసరి.. బహిష్టు పేరేదైనా సరే ఇది కేవలం స్త్రీ శరీరంలో జరిగే సహజ శారీరక మార్పుకాదు.. దాన్ని స్త్రీత్వానికీ, మాతృత్వానికీ ప్రతీకగానే చూస్తుంది భారతీయ సమాజం. అందుకే నెలసరి రాకపోవడం అమ్మాయిలనీ.. మానసికంగా, శరీరకంగా కృంగదీస్తుంది. ఇందుకు గల కారణాలు.. చికిత్స విధానం.. తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?time_continue=2&v=_m9rabrQ3Ro  

Difference between Vegan and Vegetarian diet!     Vegan diet is seen as a subset of various possible vegetarian diets/lifestyles. And it is being chosen by a lot of people over vegetariansim and non vegetarianism. The general interpretation is that a vegan will not consume any foods of animal origin, not even honey, while a vegetarian might consume eggs (ovo-vegetarian), or dairy (lacto-vegetarian). Another general interpretation is that Veganism is a subdivision of Vegetarianism. However, some people believe that the only true vegetarian is a vegan. Virtually all vegan societies also add that a vegan does not use products that come from animals, such as leather, wool, down, cosmetics, or products which have been tested on animals. Videos on the cruel way in which animals are bred for eventual slaughter are pushing most of the people into choosing this diet. Vegans do not consume or use dairy products or eggs even though doing so would not kill the animal. Part of the reason is a belief in the absolute right of animals to exist freely without human interference, but also because many commercially-raised egg-laying chickens and dairy cows are slaughtered when their productivity declines with age. Since animal products are the most convenient sources of protein and iron, vegans have a hard time getting an equal fix, which isn’t to say it’s impossible. Studies cited a cup of cooked lentils and a cup of cooked black beans each pack 18 grams of protein; a veggie burger patty packs 13g of protein; while 4 ounces of firm tofu packs 11g of protein. While Vegetarians eliminate animal products, too, but the dairy can stay if the dieter wants. Vegetarians have long been hailed as the healthiest eaters. A study published found people who mostly adhere to a pro-vegetarian diet (70 percent of food intake is derived from plants) were less likely to die from cardiovascular disease. And a slew of other research have associated this particular diet with reduced risk for certain types of cancer, high blood pressure, and early death. And again, like vegans, maintaining a mostly plant-based diet is beneficial to the environment. Eating animal fats and proteins has been shown in studies to raise a person's risk of developing cancer, diabetes,rheumatoid arthritis, hypertension, heart disease, and a number of other illnesses and conditions. The fat and protein content of cow's milk is very different from human milk, leading some experts to suggest that we are not designed for consuming cow's milk. Whole grains, vegetables, fruits, and legumes contain no cholesterol and are low in fat, especially saturated fats. They are also high in fiber and other nutrients. There are several plant based foods that are good sources of protein, such as beans, peanuts, and soya. veganism is very restrictive. While protein and iron can be otherwise sourced, vitamin B12 another vitamin rich in animal products is harder to get. There’s also a tendency for meat-free eaters to fill the animal void with processed foods. The trick, as experts would tell you, is not to go all-vegan or all-vegetarian at once; gradually phase meat out of your diet, while adding more vegan- and vegetarian-friendly options.     ..Duivya

బరువు తగ్గాలంటే పాటించాల్సిన ఆరు సూత్రాలు     నమిలి తినాలి:- వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనలో చాలామంది ఆహారాన్ని నమిలి తినరు. గబగబ తినేస్తారు. దీని వల్ల ఆహారంలో ఉండే కొన్ని రకాల పీచు పదార్థాలు జీర్ణం కావు. అందువల్లే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. నెమ్మదిగా నమిలినప్పుడు నోటిలో లాలాజలం ఊరుతుంది. దీనిలో ఉండే ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.   ఎక్కువ అల్పాహారం:- గబగబ ఆఫీసులకు, కాలేజీలకు బయలుదేరేవారికి కష్టం కానీ.... ఉదయం పూట ఎక్కువ తింటే ఎటువంటి జబ్బులు దగ్గరకు రావంటున్నారు నిపుణులు. దీనికి ఒక కారణముంది. రోజంతా పనిచేయాలంటే మన శరీరానికి పోషక పదార్థాలు అవసరం. లేకపోతే అవసరమైన శక్తి అందదు. అందువల్ల పొద్దుటిపూట వీలైనంత ఎక్కువ తిని.. మధ్యాహ్నం భోజనం తక్కువగా తినమని నిపుణులు సూచిస్తున్నారు.   రాత్రి కొద్దిగానే:- కొంత మంది రాత్రి చాలా ఎక్కువగా తింటారు. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మిగిలిన అవయవాల మాదిరిగానే మన జీర్ణ వ్యవస్థకు కూడా విశ్రాంతి ఉండాలి. రాత్రి ఎక్కువగా తినటం వల్ల జీర్ణవ్యవస్థకు తక్కువ విశ్రాంతి దొరుకుతుంది. దాని ప్రభావం మర్నాడు ఉదయం శరీరంపై పడుతుంది. రాత్రి ఎక్కువ తినేవారు సాధారణంగా ఉదయం తక్కువగా తింటారు. దీని వల్ల పగలంతా శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు లభించవు.   గ్లౌసిమిక్ ఇండెక్స్ కూడా ప్రధానమే:- మనం తినే ఆహారపదార్థాలలో కొన్ని త్వరగా.. కొన్ని ఆలస్యంగా శక్తిని విడుదల చేస్తాయి. ఆలస్యంగా శక్తిని విడుదల చేసే ఆహారపదార్థాల వల్ల మన శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. ఆహారపదార్థాలు శక్తిని విడుదల చేసే స్థాయిని నిర్ధారించే టేబుల్‌ను గ్లౌసిమిక్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకు బ్రౌన్ రైస్, గోధుమలు గ్లౌసమిక్ ఇండెక్స్ ప్రకారం నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. మైదా త్వరగా విడుదల చేస్తుంది. అందువల్ల బ్రౌన్ రైస్, గోధుమతో చేసిన పదార్థాలను తినటం వల్ల శరీరంలోని శక్తి సమతౌల్యంలో సమస్యలు ఏర్పడవు.   సరైన వంట:- మనం తినే పదార్థాలతో పాటు వాటిని వండే పద్ధతి కూడా ముఖ్యమే. ఉడకపెట్టిన పదార్థాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల వేయించటం తప్పనిసరైనప్పుడు ముందు ఆ పదార్థాన్ని ఉడకపెట్టాలి. ఆ తర్వాతే వేయించాలి.   ఎక్కువ నీళ్లు:- ప్రతి రోజు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. నీరు మన ఆకలిని నియంత్రించటమే కాకుండా శరీరపు ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో మలినాలను బయటకు పంపటంలో కూడా నీరు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.  

 Fashion in Fitness Yoga mats and Exercise mats have become a necesity these days....gone are the days of plain colored yoga mats...these days they come in exclusive prints, organic designs, with wide variety of choice for buying. Some sites even offer customising these mats with names and quotations. Manufacturers are even selling bags and slings to carry these mats easily to a yoga studio or for a pilates session.   Rubber mats are no longer the only options. Dhurries and mats made of other organic materials like jute etc., are available across the country in many stores and online shopping sites too. Exercise mats are now sold in Square and round shapes too, not just the long rectangular ones anymore. Why continue exercising on boring mats...its always fun and exciting to start a fitness regime on a colorful and interesting mat that has a character. Be a fitness fashion icon!!! -Pratyusha.T

  మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి జబ్బులపాలు చేస్తాయి. పోషక విలువలు లేని ఆహారం తిన్నందువల్ల ప్రయోజనం ఉండదు. కొన్నికొన్ని పదార్థాలు మంచి పోషకాలతో శక్తిని చేకూరుస్తాయి. మరికొన్ని పదార్థాల్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాంటివాటిని తప్పక తినాలి. ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక ఉసిరికాయలు తినడం అవసరం. దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.   * శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. * కాన్స్టిపేషన్ సమస్య ఉంటే తగ్గుతుంది. * సి విటమిన్ అధికంగా ఉన్న ఉసిరికాయలు ఐరన్ , ఇంకా ఇతర ఖనిజాలను శరీరం గ్రహించేలా చేస్తాయి. * అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి. * మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. * ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. * ఆమ్లాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. * ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం లాంటివి తిగ్గుతాయి. * ఉసిరితో కంటిచూపు మెరుగవుతుంది. * ఉసిరికాయలు తిన్నా, ఆమ్లా ఆయిల్ వాడినా జుట్టు రాలదు. బాగా పెరుగుతుంది కూడా. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఉసిరికాయల సీజన్లో వాటిని సంపాదించి ఏదో ఒక రూపంలో సేవిద్దాం.

The Green Wonder     Spinach or Palak as we call it, is one of the most consumed green leafy vegetable. It is a good source of vitamins A, B2, C, E and K, iron, calcium, magnesium, manganese, phosphorus, zinc, selenium, copper, folate, protein and dietary fiber. Plus, it is loaded with flavonoids and carotenoids. Scientifically known as as Spinacia oleracea, spinach belongs to the amaranth family and is related to beets and quinoa. Eating spinach may benefit eye health, reduce oxidative stress, help prevent cancer and reduce blood pressure levels. Cooking spinach actually increases its health benefits! Just half a cup of cooked spinach will give you thrice as much nutrition as one cup of raw spinach. That’s because the body cannot completely break down the nutrients in raw spinach for its use. Unprocessed or raw spinach contains amino acids, carotenoids, potassium, iodine, magnesium, iron, Vitamin C, A, E, B Complex and K. All the minerals present in this healthy vegetable are alkaline in nature. Thus, they help maintain the pH level balance in the body. There’s a compound in spinach called oxalic acid, which blocks the absorption of calcium and iron. An easy way to solve this problem is to pair spinach with a food high in vitamin C. Spinach contains antioxidants lutein and zeaxanthin in plentiful which protect the eye from cataracts and age related macular degeneration. Zeaxanthin is an important dietary carotenoid which is absorbed into the retinal macula lutea in the eyes, providing light filtering functions. Spinach also contains vitamin A which is required for maintaining healthy mucus membranes and essential for normal eyesight. Did you know that freezing spinach diminishes its health benefits? So in order to get the best from the leaf is to buy it fresh and eat it the same day. Most of the carbs in spinach consist of fiber. Spinach also contains 0.4% sugar, mostly glucose and fructose. Most nutrients in spinach are alkaline in nature. Due to the very high alkalinity of spinach juice, you get substantial, natural relief from rheumatoid arthritis. In addition to this, spinach also clears out various tissues in the body and helps maintain your blood’s alkalinity level. What few know is that it also very good for digestion. Spinach eases constipation and protects the mucus lining of the stomach, so that you stay free of ulcers.  It also flushes out toxins from the colon. ..Divya