ఎక్స్‌పోజింగ్‌పై నోరు విప్పిన తమన్నా
on Apr 30, 2015
టాలీవుడ్ కథానాయికల నెంబర్ వన్ రేసులో తమన్నా కూడా ఉంది. సరైన హిట్లు పడకుండానే.. తమన్నా ఇంత క్రేజ్ సంపాదించుకొందంటే.. మరో రెండు విజయాలు తన ఖాతాలోకి వెళ్తే... దుమ్మురేపడం ఖాయం. అందాన్ని, అభినయాన్నీ మిక్స్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపడం ఎలాగో తమన్నాకి బాగా తెలుసు. 100 % లవ్ లో పద్ధతిగా కనిపిస్తూనే... అందాలారేసింది. ఇక రెబల్‌లో అయితే రెచ్చిపోయింది. కానీ.. ఎక్స్‌పోజింగ్ అనేది తన అభిమతం కాదని, నిజానికి.. ఈ వ్యవహారాలకు తానెంతో దూరమని చెప్తోంది. కొన్ని కొన్ని సార్లు దర్శకుల అభిమతం ఆధారంగానే ఎక్స్‌పోజింగ్ చేస్తోందట. ఏ కథానాయికకూ కేవలం ఎక్స్‌పోజింగ్ ద్వారానే పేరు తెచ్చుకోవాలని ఉండదని, దర్శకుల ఒత్తిడి మేరకే అలా నటిస్తున్నారని సంచలన కామెంట్స్ చేసింది తమన్నా. ఒకవేళ... మంచి కథొస్తే.. తను పూర్తిగా డీగ్లామర్‌గా కనిపించడానికైనా సిద్ధమే అని ప్రకటించింది. మరి.. అలాంటి పాత్రలతో ఎవరొస్తారో చూడాలి. ఈ కామెంట్లపై మన దర్శకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.