బాహుబలి తో తమన్నాకు బంపరాఫర్లు
on Jul 30, 2015
బాహుబలి బాలీవుడ్ లోనూ ఇరగదీస్తోంది. ఇప్పటివరకూ హిందీలో డబ్ అయిన ఏ చిత్రం చేరుకోని హైట్స్ కు చేరుతోంది.ప్రపంచ వ్యాప్తంగా జూలై 10న రిలీజైన 'బాహుబలి' మూడో వారం కూడా తన హవా కొనసాగిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటివరకూ 90కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100కోట్ల మార్క్ కు చేరుకోబోతోంది. బాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లోనూ బాహుబలి తానేంటో నిరూపిస్తోంది. ఈ దెబ్బతో సినిమాలో నటించిన వారందరూ ఒక్కరిగా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా తమన్నా అయితే బాహుబలి తో తన మార్కెట్ ను ఇంకా పెంచుకోంది. దీంతో ఆమెకు కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. బాలీవుడ్ లో ఆమె చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో, ఆతరువాత ఆమెకు సరైన ఆఫర్లు దక్కలేదు. మళ్ళీ బాహుబలితో బాలీవుడ్ ప్రొడ్యూసర్ లు ఆమె వెంటపడుతున్నారు. దీంతో బాహుబలి కోసం తమన్నా పడిన కష్టానికి మంచి ఫలితాలు దక్కుతున్నాయని ఇండస్ట్రీ టాక్.