నాగార్జున మన్మథుడు సీక్వెల్..!!
on Aug 17, 2018
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అతి తక్కువ సినిమాల్లో మన్మథుడు ఒకటి.. నాగార్జున హీరోగా, కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు సినిమా వచ్చింది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ మాటలు అందించారు.. ఈ సినిమా ఘన విజయం సాధించటమే గాక, నాగార్జున మన్మథుడుగా అమ్మాయిల మనస్సు దోచుకున్నాడు.. అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి మరో హీరో మన్మథుడుగా వెండితెర మీద సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.. నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. ఇప్పటికే ‘మన్మథుడు 2’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని ఫిలింనగర్ టాక్.. ఈ సీక్వెల్ లో మన్మథుడుగా నాగచైతన్య లేదా అఖిల్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి మన్మథుడు 2 మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో.