అక్కినేని ఫ్యామిలీ హంగామా మొదలైంది
on Aug 28, 2015
ఫస్ట్ లుక్ తో ఇప్పటికే అఖిల్ లాంఛింగ్ మూవీకి టైటిల్ అఖిల్ అని అధికారికంగా చెప్పేశారు. అఖిల్ ఫస్ట్ లుక్ ఇచ్చి ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు కూడా. మరో రెండ్రోజుల్లో అఖిల్ కి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు డైరెక్టర్ వినాయక్. దీనికితోడు నాగచైతన్య- గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా నాగ్ బర్త్ డే రోజునే వచ్చేస్తోంది. ఇక వీళ్లిద్దరికి మించి సందడి చేయబోతున్నాడు మన బర్త్ డే బాయ్ నాగార్జున. సోగ్గాడే చిన్నినాయన ఫస్ట్ లుక్ కూడా అదే రోజు రిలీజ్ కానుండడం విశేషం. ఈ సినిమాలో తాతమనవళ్లుగా నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓల్డేజ్ గెటప్ కు రమ్యకృష్ణ, యంగ్ గెటప్ కు లావణ్యత్రిపాఠి నాగ్ కి జంటగా నటిస్తుండగా మరదలి కేరక్టర్ లో అనసూయ కనిపించబోతోంది మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ పండగ మొదలైపోయిందన్నమాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
