ఎక్స్ క్లూజివ్ ఫోటో: బాలయ్య 'లయన్' ఈజ్ బ్యాక్
on Apr 6, 2015
నందమూరి నటసింహం బాలకృష్ణ లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత నటిస్తున్న చిత్రం 'లయన్'. ఈ సినిమాపై అభిమానులలో కూడా అంచనాలు భారీగానే వున్నాయి. లేటెస్ట్ గా లయన్ సినిమాకి సంబంధించిన ఓ ఫోటో రిలీజైంది. హోలీ రంగులతో నిండిపోయి వున్న నటసింహం లుక్ ను చూసి నందమూరి అభిమానులు 'లయన్' ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. అలాగే లయన్ ఆడియో తొమ్మిదన విడుదలవుతుంది. ఈ ఆడియో ఇప్పటికే విన్న యూనిట్ వర్గాలు, ట్యూన్ లు మళ్లీ పాత మణిశర్మను గుర్తుకు తెస్తున్నాయని, క్యాచీగా, చాలా బాగున్నాయని అంటున్నారు. నిజంగానే ఈ ఆల్బన్ హిట్ అయితే మణిశర్మ మళ్లీ ఫుల్ బిజీ అయిపోతాడు.