లయన్ గర్జించింది..
on Apr 10, 2015
లయన్ ఆడియో రిలీజ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారకరామారావు అని మాత్రమే కాదన్నారు. ‘ఎన్టీఆర్ లో ఎన్ అంటే నటనాలయం. ఆ ఆలయంలో ఎన్టీఆర్ నటరాజ నటసింహుడు. టి అంటే….తారామండలంలోని నటసింహుడు, ఆర్ అంటే రాజార్షి, రారాజు, కమనీయ సౌమ్య దురందరుడు. అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన భౌతికంగా లేకున్నా ఆయన స్పూర్తిగా ఉంది’ అని కొనియాడారు. నందమూరి బాలకృష్ణ గాలిలో కలిసి పరిగెత్తే వ్యక్తి కాడని చెప్పారు. సింహం వలే ఎప్పుడైనా, ఎక్కడైనా అభిమానుల ఉన్నంత వరకు లయన్ గానే ఉంటానని చెప్పారు. చిత్రపరిశ్రమలోకి చిట్టెలుకలు..చిరుతపులులు వచ్చిన సింహం ఒక్కటే ఉంటుందని అన్నారు. తన జోలికి వస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. తనపై ఎంతో నమ్మకం ఉండబట్టే అభిమానిగా ఉన్న వ్యక్తి నిర్మాతగా మారారని చెప్పారు. వేల లక్షల కోట్లమంది అభిమానాన్ని పొందటం అదృష్టమని, హీరోగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా అభిమానం సంపాదించుకోవడం సంతోషకరమన్నారు. ''భగవద్గీత యుద్దానికి ముందు వినిపిస్తారు..మనిషి చనిపోయిన తరువాత కూడా వినిపిస్తారు. ముందు వింటావా? తరువాత వింటావా?'' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంటే..ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
