బాలయ్య న్యూ ట్రెండ్.. త్రీడీ సెట్ లో 'లయన్' ఆడియో
on Apr 3, 2015
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లయన్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘లయన్' ఆడియోను ఏప్రిల్ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో కోసం ప్రత్యేకంగా మొదటిసారి త్రీడీ సెట్‌ను వేయిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సీబీఐ ఆఫీసర్‌గాను, సామాన్యుడిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధికాఆఫ్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.