ప్రేమలో వెంకటేశ్?
on Jul 9, 2015
విక్టరీ వెంకటేశ్ ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఆరు పదులకు దగ్గరపడుతుంటే ఇప్పుడు ప్రేమ కథలేంటి? అసలు ఏ ధైర్యంతో లవ్ స్టోరీకి ఒప్పుకున్నాడు? ముసలి కాలానికి ముచ్చంట్లేంటి అని డిస్కస్ చేసుకుంటున్నారంతా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టుతో మల్టీ స్టారర్, దృశ్యంతో ప్రయోగాత్మక చిత్రాలకు అడుగుముందుకేసిన వెంకీ....వయసుకి తగ్గా పాత్రలు ఎంచక్కా ఎంచుకుంటున్నాడు. ప్రేమకథ అంటున్నారు- వయసుకి తగ్గా పాత్ర అంటున్నారు....ఏది రైట్ అనే డైలమా వచ్చిందా?
మేటర్ ఏంటంటే....ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పెళ్లైన మధ్యవయసు వ్యక్తి...టీనేజర్ తోప్రేమలో పడడం కథాంశం. కథ సరదాగా సాగడంతో వెంకీ నో అనలేకపోయాడట. బాలీవుడ్ లో అమితాబ్-జియాఖాన్ నటించిన నిశ్శబ్ద్ తరహాలో అన్నమాట. అయితే ఆ సినిమా సీరియస్ గా ఉంటుంది కానీ వెంకీ మాత్రం నవ్విస్తాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరి సీనియర్ వెంకీ లవర్ ఎవరో?