స్నేహం
(Friendship Day Special)
కలతలు కమ్ముకున్న వేళ
ఉసురు ముసుర్లు ఉరులై
గుబులు గుండెల నిండి
కన్న కలలు కన్నీరై
కరిగి ఆవిరైన వేళ
మనకుంటే ఒక నేస్తం
ఆదుకునే ఆపన్న హస్తం
చేసె అత్యవసర వైద్యం
కష్టంలో కాచుకునే దైవం
కలిసి చదువుకునే పుస్తకం
అదొక నిజమైన స్వప్నం
లేదు స్నేహాన్ని మించిన ధనం
బతుకు పోరాట దారుల్లో
నీడనిచ్చి సేదదీర్చు వృక్షం.
స్నేహమంటే కరగని కల
నేస్తమంటే విరగని అల
శూన్యమైన జీవితాన
విరిసే నవ్వుల వాన
తనువులు వేరైనా
తలపులు మారేనా
మతమేదైనా, కులమేదైనా
రాజైనా, పేదైనా
అవుతారా అనర్హం
పంచుకుందుకు స్నేహం
ఎల్లలెరుగక, కల్లలు లేక
కలకాలం నిలిచేదే స్నేహం
జన్మకి చెప్పేవరకూ వీడుకోలు
కమ్మని బంధమై విడిపోదు.
నమ్మకాన్ని కొంత
అమ్మతనాన్ని కొంత
రంగరించి నాన్నలా
లాలించేది నేస్తం
మనువైన మనుగడ సంసారం
నేస్తమున్న జీవితం బంగారం
చెప్పాలంటే స్నేహం గొప్పతనం
సరిపోదొక స్నేహితుల దినం
మరువకుమా ఓ నేస్తం
ప్రాణమున్నంతవరకూ స్నేహం.
.....శారద శివపురపు
Click here for more Friendship Day Special articles
