Facebook Twitter
కవితాభినందనం పాదాభివందనం

కవితాభినందనం పాదాభివందనం

- డా. రాధశ్రీ

 

 

కదులుతున్న కవితలా నడుస్తున్న నవతలా
చరిస్తున్న చరితలా, మసలే మానవతలా
అలరారే శ్రీ సి. నా.రె. రాజ్యసభా సభ్యత్వం
పొందినట్లు తెలియగానే పొంగి పొరలె " కవిత్వం " !

అవధి లేని అభిమానపు పూపొదలో  దాగి దాగి
మహితోన్నత మహానందం మకరందం త్రాగి త్రాగి
మత్తిల్లిన హృదయ భ్రమర ఝుంకారోద్ద్రుతి ఇది !
కృతిలా ఆకృతి దాల్చిన వినయ నమస్కృతి ఇది !!