Facebook Twitter
పూటలో రాలే పూవు కోసం

 

పూటలో రాలే పూవు కోసం
ఆకులతో
ఎంత చాకిరీ చేయిస్తుంది
చెట్టు!

మబ్బులు తెర
తొలగిపోయింది
ఇక మొదలు
ఆకాశ రూపకం.

కిరణం పెట్టింది
చక్కిలి గింత
కులికి మెరిసింది
రత్నకాంత


 

డా. వై . రామకృష్ణారావు.