LATEST NEWS
చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఇటీవల తెలంగాణ జనగామకు చెందిన మావోయిస్టు అగ్రనేత అరుణక్క ఎన్ కౌంటర్ లో చనిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరిట వచ్చే మార్చి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలనిస్తుంది. వందలాది మంది జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. చత్తీస్ గడ్ లో గత వారం 50 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. శనివారం (ఏప్రిల్ 5)న 86మంది మావోయిస్టులు భద్రాది మునుగుజిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కోరికి 25 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఐజి చంద్రశేఖరరెడ్డి మావోయిస్టులను ఒప్పించి జన జీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో లొంగిపోవడం మావోయిస్టులకు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. లొంగిపోయిన వారంతా చత్తీస్ గడ్ వాసులే. మరో వైపు కేంద్ర హోంమంత్రి చత్తీస్ గడ్ పర్యటనలో ఉండగానే మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.
మాజీ మంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించలేదు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదరించి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్ లపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
వారి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం (పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ వాయిదావ వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. మాజీ మంత్రికి అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా కల్పించలేదు. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీ పేరుతో తనను బెదిరించి, రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడుజిల్లా, యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్ క్రషర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నల్లపనేని చలపతిరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎసిబి కేసు నమోదు చేసింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విడదల రజని పీఏ దొడ్డా రామకృష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ కూడా ఏప్రిల్ 8కే వాయిదా పడింది.
తిరుపతిలో హోం స్టే నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ శుక్రవారం (ఏప్రిల్ 4) అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రెండు స్టే హోంల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కర్రలు రాళ్లతో హోంస్టేల నిర్వాహకులు ఘర్షణకు తలపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
ఈ గ్యాంగ్ వార్ కు కారణమేంటంటే.. ఒక స్టేహోంకు వచ్చే వారిని మరో స్టేహోం వారు బలవంతంగా లాక్కు వెడుతున్నారంటూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది. ఈ దాడిలో డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డి లు గాయపడ్డారు.
వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ స్టే హోంల నిర్వాహకుల మధ్య జరిగిన ఈ ఘర్షణతో స్థానికులు, శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)మరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan).లూసిఫర్ కి పార్ట్ 2 గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల కి పైగా కలెక్షన్ ని సాధించి ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ మూవీలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా మసూద్ అనే క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు.
రీసెంట్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది.2022 లో పృథ్వీ రాజ్ జనగణమన, గోల్డ్, గడువు చిత్రాల్లో నటించడంతో పాటు సహ నిర్మాతగాను వ్యవహరించాడు.కాకపోతే ఈ మూడు చిత్రాలకి నటించినందుకు పారితోషకం తీసుకోకుండా సహ నిర్మాతగా మాత్రమే డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఈ విషయంపైనే ఆ మూడు సినిమాల ఆదాయ వివరాలని అందించాలని ఐటి శాఖ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి.
రీసెంట్ గా ఎంపురాన్ నిర్మాతల్లో ఒకరైన 'గోకులం గోపాలన్' ఇంట్లోతో పాటు చిట్ ఫండ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈడీ(Ed)సోదాలు జరిగిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ పై కూడా ఐటి శాఖ నోటీసులు జారీ చెయ్యడం చర్చినీయాంశమయ్యింది.మూవీలోని కొన్ని సీన్స్ తో పాటు కొన్నిపేర్లు భారతీయ జనతా పార్టీ కి దగ్గరగా ఉన్నాయనే అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర బృందం ఆ సీన్స్ ని డిలీట్ చేసింది.ఈ విషయంలో మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పాడు.మంజు వారియర్(Manju Warri3r)అభిమన్యు సింగ్,టోవినో థామస్,జెరోమ్ ప్లాన్,ఇంద్రజిత్ సుకుమారన్,కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు.
మణిరత్నం(Mani ratnam)దర్శకత్వంలో వచ్చిన 'సఖి' మూవీతో తెలుగు ప్రేక్షకులకి అభిమానాన్నిచూరగొన్న మాధవన్(r madhavan)ఆ తర్వాత పలు భాషల్లో పలు బడా డైరెక్టర్ ల చిత్రాల్లో నటించి తన సత్తా చాటాడు.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్,విలన్ గా చేస్తు సిల్వర్ స్క్రీన్ పై తన హవాని కొనసాగిస్తు వస్తున్నాడు.ఇప్పటి వరకు ఒక నేషనల్ ఫిలిం అవార్డు,ఐదు సార్లు సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు,రెండు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డులు సాధించాడు.రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'టెస్ట్ 'లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులని అలరిస్తున్నాడు.
రీసెంట్ గా మాధవన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒకప్పుడు మూవీ చూడటమంటేనే ఎంతో వైవిధ్యంతో ఉండేది.జనాలని తోసుకుంటూ టికెట్ కొనడం దగ్గరనుంచి పార్కింగ్ కష్టాలు,ఫ్యామిలీని ఎవరు నెట్టకుండా చూడటం,ఇంటర్వెల్ లో తినడానికి సమోసా, పాప్ కార్న్ ఈ విధంగా మూవీ చూసాక ప్రేక్షకుడికి ఎంతో అనుభూతి ఉండేది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.థియేటర్ లోపలకే మెను వస్తుంది.
మనం మూవీ చూస్తుంటే సడెన్ గా మొబైల్ ఫోన్ ప్లాష్ లైట్ వెలుగుతుంది.మెను ఏం వచ్చిందో చెక్ చేసుకునే దాకా లైట్ వెలుగుతూనే ఉంటుంది.పానీ పూరి వస్తే అందులో పని ఎలా ఉందో కూడా తీరిగ్గా
చూస్తారు.పైగా సినిమా ఏ మాత్రం బాగోకపోయినా మనతో వచ్చిన వాళ్ళు సినిమా బాగోలేదని థియేటర్(Theater)లోనే మాట్లాడుకుంటు ఉంటారు.మూవీ క్లైమాక్స్ కి వచ్చే సరికి పార్కింగ్ ఏరియా నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతో,మనం సినిమా చూస్తుంటే అడ్డంగా మన ముందు నుంచే వెళ్తు ఇబ్బంది కలిగిస్తారని చెప్పుకొచ్చాడు.
ప్రభాస్(Prabhas)తో ఏక్ నిరంజన్ మూవీలో జోడి కట్టిన కంగనా రనౌత్(Kangana Ranaut)ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ ఏడాది జనవరిలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indira Gandhi)ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు సంభవించిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల ఆధారంగా చేసుకొని తెరకెక్కిన 'ఎమర్జన్సీ'(Emergency)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్వీయ దర్శకత్వంలోనే కంగనా నిర్మించగా టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించి అభిమానుల మన్ననలు పొందింది.
ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవుతు ఉంది.నిత్యానందం అనే వ్యక్తి ఎమర్జెన్సీ చిత్రాన్ని చూసి 'కంగనా'నటనని మెచ్చుకోవడమే కాకుండా,పవర్ ఫుల్ సబ్జెట్ ని ఎలాంటి బెరుకు లేకుండా చూపించినందుకు కంగనాకి తన అభినందనలు తెలపడంతో పాటు కాంచి పురం చీరని బహుమతిగా కూడా పంపించాడు.ఇనిస్టా వేదికగా ఈ విషయాన్నీ షేర్ చేసిన కంగనా 'ఎమర్జెన్సీ రూపొందించినందుకు అద్భుతమైన చీరని బహుమతిగా పొందాను.పనికి మాలిన ట్రోఫీల కంటే ఈ చీర ఎంతో ఉత్తమమైనదని తెలిపింది.
బాలీవుడ్(Bollywood)లో ఇచ్చే అవార్డుల గురించే కంగనా అలాంటి వ్యాఖ్యలు చేసిందనే విషయాన్నీప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె గతంలోను బాలీవుడ్ ఇచ్చే అవార్డులపై మాట్లాడుతు అర్హులకి అవార్డులివ్వరని,బందుప్రీతికే మొగ్గు చూపిస్తారని చెప్పుకొచ్చింది.కంగనా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ(Bjp)తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి'(mandi)పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ssmb 29(ssmb29)అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒడిస్సా లోని పర్వత శ్రేణుల్లో ఒక షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకోగా ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)మలయాళ లెజండ్రీ యాక్టర్,దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు చిత్ర బృందం ఒడిస్సా ప్రజలకి ధన్యవాదాలు కూడా తెలిపింది.
ఇక రాజమౌళి కొన్ని రోజుల క్రితం మహేష్ పాస్ పోర్ట్ ని తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ఒక పిక్ రిలీజ్ చేసాడు.దాంతో సోషల్ మీడియా మొత్తం ఫన్నీమీమ్స్ తో నిండిపోయింది.రీసెంట్ గా మహేష్ బాబు తన పాస్ పోర్ట్ చూపిస్తు ఒక వీడియోలో కనిపించాడు.దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా'మై పాస్ పోర్ట్ ఈజ్ బ్యాక్, నా పాస్ పోర్ట్ నాకు వచ్చేసింది.నన్ను ఎవరు ఆపలేరు' అనే మీమ్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.దీంతో #ssmb 29 హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ssmb 29 లో విదేశీ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి దుర్గ ఆర్ట్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన కే ఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నాడు.ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
ప్రముఖ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)గత నెల మార్చి 19 న 73 సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.బర్త్ డే వేడుకలు తిరుపతిలోని తన యూనివర్సిటీ లో జరగగా శరత్ కుమార్,ప్రభుదేవా హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మోహన్ బాబు ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో బిజీగా ఉన్నాడు.మంచు విష్ణు(Vishnu) 'కన్నప్ప'గా టైటిల్ రోల్ లో చేస్తుండగా ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి మేటినటులు కీలక పాత్రలు చేస్తున్నారు.మోహన్ బాబు కూడా ఒక కీలక క్యారక్టర్ లో నటించడంతో పాటు 'కన్నప్ప' కి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.
మోహన్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతు నాకు మొట్టమొదటి అవకాశం దాసరి నారాయణరావు(Dasari Narayanararao)గారు స్వర్గం,నరకంతో ఇచ్చారు.అప్పట్నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల క్యారక్టర్ లు వేసాను.కొన్నిసార్లు సినిమాలు ఫెయిల్ అయ్యాయి గాని,నటుడిగా మాత్రం నేను ఫెయిల్ అవ్వలేదు.నిర్మాతగా అన్నగారు నందమూరి తారకరామారావుతో మేజర్ చంద్రకాంత్ నిర్మించడంతో పాటు ఆయన కొడుకుగా నటించాను.నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మేజర్ చంద్రకాంత్ ని తెరకెక్కిస్తుంటే అలా వద్దని ఎన్టీఆర్ వారించారు.కానీ మొండిగా ఆ సినిమా నిర్మించి సక్సెస్ అయ్యాను
నేను ట్రోలింగ్ లని పట్టించుకోను.అలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో నాకు తెలియదు.పక్క వాళ్ళు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు.అలా కోరుకుంటే వాళ్ళ కంటే ముందే మనం నాశనం అవుతాం.కోపం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది.నేను ఎవరికీ అపకారం చెయ్యలేదు.నన్నేచాలా మంది మోసం చేశారు.ఒకర్నిమార్చాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు.అందరు క్షేమంగా ఉండాలి.దేవుడి దయ వల్ల 'కన్నప్ప'మూవీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
బాబు జగ్జీవన్ రామ్ చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి. విద్యార్థులను, యువతను ప్రశ్నిస్తే ఈయన గురించి చెప్పేవారు తక్కువ. కానీ ఈయన తన జీవితాన్ని అంటరాని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశారు. అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనకు దోహదపడ్డారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజును చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా కూడా పరిగణిస్తారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుంటే..
జగ్జీవన్ రామ్ ను బాబూజీ అని పిలుచుకుంటారు. ఈయన 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని 'అంటరాని' కులంలో జన్మించాడు. ఈయన జన్మించినది సామాన్య రైతు కుటుంబంలోనే. ఈయనకు ఒక అన్న, ముగ్గురు చెల్లెళ్లు ఉండేవారు. ఈయన తన బాల్యంలో, విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రోజుల్లో కూడా షెడ్యూల్డ్ కులాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాలనే తన కోరికను వ్యక్తం చేసేవాడు.
బాబూ జగ్జీవన్ రామ్ అడుగడుగునా వివక్షణ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆ వివక్షలను లెక్క చేయకుండా చదువులో రాణించాడు. 1931 లో సైన్స్ లో డిగ్రీ పొందాడు. అయినప్పటికీ ఆయనకు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉండేది. ఎప్పుడూ అంటరాని వారికి సమానత్వం సాధించే విషయం గురించి ఆలోచించేవాడు. ఈయనలో ఉన్న ఈ తపనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించాడు. ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి అతన్ని రాజకీయ జీవితంలోకి ఆకర్షించేలా చేసింది.
నిజానికి, బాబు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
బాబు జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని మొదటి క్యాబినెట్లో సభ్యుడు. అంతేకాదు ఈ క్యాబినెట్ లో ఆయన అతి పిన్న వయస్కుడైన మంత్రిగా, భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఉన్నత పదవులకు వెళ్లి రక్షణ మంత్రిగా (1970 - 1974), ఉప ప్రధాన మంత్రిగా (1977 - 1979) కూడా పనిచేశారు. ఆయన 1986లో మరణించారు. ఆయన మరణించే వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.
*రూపశ్రీ.
ఈ సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనది. స్త్రీలు జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి ఆధారం అని చెబుతారు. ప్రాచీన గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర, స్త్రీల గుణగణాలు ఎంతో గొప్పగా ప్రస్తావించబడ్డాయి. ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే తన నీతి శాస్త్ర గ్రంథంలో స్త్రీల గురించి కొన్ని నిజాలను స్పష్టంగా చెప్పాడు. పండితుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ వేత్త, మంచి సలహాదారుడు అయిన చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే..
ధైర్యానికి ప్రతిరూపం..
చాణక్య నీతి ప్రకారం స్త్రీకి అపారమైన శక్తి ఉంటుంది. సంక్షోభ సమయంలో తన భర్త, పిల్లలు, కుటుంబం, వంశాన్ని రక్షించే స్త్రీని ఉత్తమురాలు అంటారు. అలాంటి మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు. దేశాభివృద్ధికి తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తారు.
చాలా మందికి తెలియదు.. కొందరైతే ఒప్పుకోరు.. కానీ స్త్రీలు రెట్టింపు ఆహారం తింటారు. అలాగే వారి వినయం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట.
చైవ కామశ్చాష్టగుణం: స్మృత: ॥ అని చాణక్యుడు అన్నాడు.
పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది. కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది.
స్త్రీల గురించి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ.. స్త్రీ ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలని చెబుతాడు. ఆధునిక వాతావరణంలో, మహిళలు మాట్లాడే భాష క్షీణించింది. దీని కారణంగా సమాజం ప్రభావితమవుతోంది. స్త్రీ ఎప్పుడూ దుర్భాషను ఉపయోగించకూడదని చాణక్యుడు అన్నాడు.
దుర్భాషలాడే స్త్రీల గురించి చెబుతూ.. ఈ అలవాటు ఉన్న స్త్రీల జీవితాలు సమస్యలతో నిండి ఉంటాయి అని అన్నాడు. వైవాహిక జీవితంలో ఉత్సాహం లోపిస్తుందట. అలాంటి స్త్రీలు ఒత్తిడితోనూ, వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు భాష మాట్లాడటం వల్ల ఆలోచనలలో స్వచ్ఛత తగ్గిపోతుందట. ఆలోచనలు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల అది మనస్సు, మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సమయం వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన నైపుణ్యాలను, బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ పరిస్థితిలో న్యూనతా భావన, ఒత్తిడి పెరుగుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పాడు.
*రూపశ్రీ
పచ్చదనం అంటే ఆ తాతకు ప్రాణం.. ఇంతకీ ఎవరు ఈ తాత అంటే.. ఆయన పేరు సూర్యనారాయణ్.. తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆయనను ఒక సంకల్పానికి సిద్దం చేసింది. బెంగళూరు నివాసి అయిన ఈ పచ్చదనపు ప్రేమికుడు తనకు ఉన్న పరిశుభ్రతను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎంతగా అంటే తను నివసించే పరిసర ప్రాంతాలను చీపురు పట్టుకుని మరీ శుభ్రం చేసే అంత. పచ్చదనానికి ప్రాణం పోస్తున్న ఆ తాత గురించి తెలుసుకుంటే..
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు నుండి 62 ఏళ్లకు రిటైర్ అయిపోతారు. 65 ఏళ్లు దాటాయంటే ఇంటి పట్టున ఉంటూ భార్యా లేదా కోడలు వండిపెడుతుంటే తింటూ కృష్ణా, రామ అంటూ కాలక్షేపం చేస్తుంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ సంతోషాన్ని, జ్ఞాపకాలను పోగేసుకుంటూ ఉంటారు. కానీ బెంగళూరుకు చెందిన 83ఏళ్ల సూర్యనారాయణ్ మాత్రం అందుకు భిన్నం. ఈయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. 60ఏళ్ల వయసులో రిటైర్ అయిన ఈయన 24ఏళ్ల నుండి తనకు ఎంతో ఇష్టమైన పరిశుభ్రతను తను నివసించే ప్రాంతాలకు అంతా వ్యాప్తం చేస్తున్నాడు. ఈయన దగ్గరుండి ఎవరితోనూ పనులు చేయించట్లేదు. స్వయంగా తానే చీపురు పట్టి వీధులు ఊడుస్తున్నాడు. ప్రతి ఉదయం వీధులు ఊడ్చి శుభ్రం చేస్తాడు. శుభ్రమైన మురుగు కాలువలు, పచ్చదనం, చెత్త ప్రదేశాలను మచ్చలేని ప్రదేశాలుగా శుభ్రంగా మార్చేస్తుంటాడు.
సూర్యనారాయణ్ గారు రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు చెట్లు నాటడం అంటే చెప్పలేనంత ఇష్టం. వాటిని సంరక్షించడం ఆయన బాధ్యతగా భావించేవాడు. చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వయస్సులో, సూర్యనారాయణ్ ప్రతిరోజూ చేతిలో చీపురు పట్టుకుని తన పనిని కొనసాగిస్తూ కనిపిస్తాడు.
ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ తాత కృషి మరింత పెరుగుతుంది. 2001 నుండి వర్షాకాలంలో కూడా అవిశ్రాంతంగా వీధులు ఊడ్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, ఎండిన ఆకులను కంపోస్ట్ చేయడం చేస్తున్నాడు. వర్షాకాలంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, డ్రైనేజీ పొంగిపోకుండా నిరోధించడానికి అదనపు కృషి చేస్తున్నాడు. తను చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తాడు. సంవత్సరాల నుండి తను చేస్తున్న పని మధ్యలో గాయాలు అయినా సరే వెనకడుగు వేయడం లేదు. తన భార్య మద్దతు ఉండటంతో తాను చేసే పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మనసు పెట్టి చేయగలుగుతున్నానని, తనకు ఆ పని చేయడం ఇష్టం కాబట్టే చేస్తున్నానని ఎంతో సంతోషంగా అంటున్నాడు. ఈ స్వచ్చంద సేవకుడికి లాల్ సలాం చెప్పాల్సిందే..!
*రూపశ్రీ.