చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే స్త్రీల గురించి ఈ నిజాలు చెప్పేశాడు..!

 

ఈ సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనది.  స్త్రీలు జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి ఆధారం అని చెబుతారు. ప్రాచీన గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర,  స్త్రీల గుణగణాలు ఎంతో గొప్పగా ప్రస్తావించబడ్డాయి.  ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే తన నీతి శాస్త్ర గ్రంథంలో  స్త్రీల గురించి కొన్ని నిజాలను స్పష్టంగా చెప్పాడు.  పండితుడు,  దౌత్యవేత్త,  ఆర్థికవేత్త,  రాజకీయ వేత్త,  మంచి  సలహాదారుడు అయిన చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే..

ధైర్యానికి ప్రతిరూపం..

చాణక్య నీతి ప్రకారం స్త్రీకి అపారమైన శక్తి ఉంటుంది. సంక్షోభ సమయంలో తన భర్త, పిల్లలు, కుటుంబం,  వంశాన్ని రక్షించే స్త్రీని ఉత్తమురాలు అంటారు. అలాంటి మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు.  దేశాభివృద్ధికి తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తారు.

చాలా మందికి తెలియదు.. కొందరైతే ఒప్పుకోరు.. కానీ స్త్రీలు రెట్టింపు ఆహారం తింటారు.  అలాగే  వారి వినయం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట.

  చైవ కామశ్చాష్టగుణం: స్మృత: ॥ అని చాణక్యుడు అన్నాడు.

పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.  సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది.  కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది.

స్త్రీల గురించి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ..  స్త్రీ ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలని చెబుతాడు. ఆధునిక వాతావరణంలో, మహిళలు మాట్లాడే భాష క్షీణించింది. దీని కారణంగా సమాజం ప్రభావితమవుతోంది. స్త్రీ ఎప్పుడూ దుర్భాషను ఉపయోగించకూడదని చాణక్యుడు అన్నాడు.

దుర్భాషలాడే స్త్రీల గురించి చెబుతూ.. ఈ  అలవాటు ఉన్న స్త్రీల జీవితాలు సమస్యలతో నిండి ఉంటాయి అని అన్నాడు. వైవాహిక జీవితంలో ఉత్సాహం  లోపిస్తుందట. అలాంటి స్త్రీలు ఒత్తిడితోనూ,  వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు భాష మాట్లాడటం వల్ల ఆలోచనలలో స్వచ్ఛత తగ్గిపోతుందట. ఆలోచనలు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల అది మనస్సు,  మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సమయం వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన నైపుణ్యాలను,  బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ పరిస్థితిలో న్యూనతా భావన,  ఒత్తిడి పెరుగుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పాడు.


                                                  *రూపశ్రీ