LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఏప్రిల్ 20) తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. చంద్రనబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో అవసరమనీ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. చంద్రబాబును అనితర సాధ్యుడి'గా అభివర్ణించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఒక సమర్థుడైన పరిపాలకుడిగా చంద్రబాబు సేవలు చిరస్మరణీయమన్నారు.
కాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘమైన, ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుకు ఫోన్ , సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఇక సినీ ప్రముఖుడు చిరంజీవి, పలువురు అగ్ర నటులు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టిన రోజును సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన పుట్టినరోజు కానుక అనిపేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఈ అపారమైన ప్రేమ తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన.. అన్నది ఇది నిజంగా బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమ కాళ్లపై గొడ్డలి వేసుకున్నారా?
ఎందుకంటే ఇది ఒక శాసన ఓటమి.. పొలిటికల్ విక్టరీ? సీట్ల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఇవన్నీ లోక్ సభలో సభలో 2/3 మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని మోదీ–షా ఓటమిగా ప్రకటించాయి. అయితే మరో కోణంలో చూస్తే.. ఈ సంఘటన బీజేపీకి 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో ఆ వాదనను వాస్తవాలు, రాజ్యాంగం, చరిత్ర, రాజకీయ గణితం ఆధారంగా విడమరచి చూస్తాం.
1. డీలిమిటేషన్ .. ఇది బీజేపీ ఎత్తుగడ కాదు, రాజ్యాంగం ఆదేశం. ఆర్టికల్ 81 & 82 ఏమంటాయి?
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఉత్తర భారతీయుల కుట్ర కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన డెడ్లైన్.
2. మహిళా రిజర్వేషన్ అమలు .. డీలిమిటేషన్ లేకుండా అసాధ్యం. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆర్టికల్ 334ఏ స్పష్టంగా రిజర్వేషన్ అమలు డీలిమిటేషన్ తర్వాతే అని పేర్కొంది. అంటే.. డీలిమిటేషన్ తప్పనిసరి. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బిల్లులోనే ఉన్న నిబంధన. బీజేపీ ప్రతిపాదించిన 850 సీట్లు, 50% పెంపు ఫార్ములా — దక్షిణాది రక్షణ కోసమా?
కేంద్రం ఏం ప్రతిపాదించిందంటే.. లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెంపు. ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు పెంపు. ఆ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలు. ఈ ఫార్యులా వెనుక లాజిక్ ఏంటంటే.. మొత్తం సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాబల్యం తగ్గదు. జనాభా ఆధారిత న్యాయం కూడా జరుగుతుంది. అంటే.. ఉత్తర రాష్ట్రాలకు కొత్త నియోజకవర్గాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకూ అదనపు సీట్లు. ఎవరికీ నష్టం లేకుండా సమతుల్యం.
ఇది దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం అని కేంద్రం అంటోంది. అయితే.. ప్రతిపక్షాలు ఈ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి వాదన ఏంటంటే.. ఈ బిల్లు పాస్ అయితే.. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ప్రాబల్యం దక్కుతుంది.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. 50శాతం పెంపు ఫార్ములా తిరస్కరించబడినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమి, డీఎంకేలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక నష్టం.
5. బీజేపీ నేరేటివ్ మేము రక్షించడానికి ప్రయత్నించాం, వారు అడ్డుకున్నారు. ఈ నినాదంతో బీజేపీకి ఒక స్పష్టమైన ప్రచార మార్గం లభించింది. ఇక మేం మహాళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు బిల్లు తెచ్చాం. కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 50శాతం పెంపును కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది.
ఉత్తర రాష్ట్రాలకు
ఇకఈ బిల్లు వీగిపోవడం వల్ల ఉత్తరాదిలో కూడా బీజేపీకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది. జనాభా పెరిగింది. సీట్ల పెంపును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసే అవకాశం వచ్చింది. ఇది 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం బీజేపీకి లభించింది.
6. ప్రతిపక్షాల వ్యూహపరమైన తప్పు.. ప్రతిపక్షాలు పార్లమెంట్లో బిల్లును ఓడించడంపై ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రజల (ఓటర్ల) మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఇది బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మార్చేసింది.
7. డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది?ప్రతిపక్షాలు 50% పెంపు ఫార్ములాను తిరస్కరించినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ఇది రాజ్యాంగం చెప్పిన మార్గం. దీనిని ఆపడం అసాధ్యం.దీని వల్ల ఉత్తర రాష్ట్రాలకు భారీ లాభం. అదే సమయంలో దక్షిణాదికి తీరని నష్టం. దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రం తమిళనాడు.
8. ముగింపు: ఇది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమను తాము బలహీనపరుచుకున్నాయా.. అంటే.. పరిశీలకులు రెండోదే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ నేరేటివ్, దక్షిణాదికి రక్షణ కోసం ప్రయత్నించిందన్న గుర్తింపు. ప్రతిపక్షాలే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చేశారన్న విమర్శ. ఇది నిస్సందేహంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే 2029 ఎన్నికల ప్రచార అజెండాను బీజేపీకి ముందుగానే లభించేసింది.
ఇక విపక్షాలు.. మహిళా సాధికారతను అడ్డుకున్నాయన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే దక్షిణాదికి సీట్ల నష్టానికి కారణమని ఓటర్లు భావిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో నేరేటివ్ నష్టం. వ్యూహాత్మక దూరదృష్టి లోపం. పార్లమెంట్లో ఓటమి బీజేపీకి పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి వ్యూహపరమైన తప్పు కారణంగా 2029లో వారి రాజకీయ ప్రాబల్యం బలహీనపడే అవకాశం ఉంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండూ ముందే నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీనపడటానికి ప్రతిపక్షాలే కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
భూమ్మీదకు ఎంతోమంది వస్తూ ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు. వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే.. చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం.. ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా కన్నారు? ఆయన కుటుంబ నేపథ్యం ఆయనను చదివించటానికి సరిపోతుంది కానీ, ఆయన రాజకీయాలలో ఎదగడానికి ఖర్చు పెట్టగలిగే శక్తివంతమైనది కాదు. ఈ రోజుల్లో మాదిరి శాసనసభ్యుడు కావాలంటే కోట్లు అవసరం ఉండి ఉండకపోవచ్చు, కానీ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా శాసనసభ్యుడు అవటం ఆ రోజుల్లో కూడా అసాధ్యమే. కానీ తన రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు కలకనటమే కాకుండా.. సాకారం చేసుకోవటానికి కృషి చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
బహుశా అందుకేనేమో.. ఆయన జీవితమంతా అసాధ్యాలను సుసాధ్యం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సవాళ్లను స్వీకరించటం ఆయన నైజం. అందుకే అప్పటికే మహామహులు నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. చిత్తూరు జిల్లాలో పెద్దగా ప్రాధాన్యత లేని సామాజికవర్గం నుండి వచ్చిన ఆయన.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేడు? అనే సవాలును అతి పిన్నవయస్సులో స్వీకరించాడు. సామాన్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు అసామాన్యతనే సామాన్యతగా రూపాంతరం చెందేలా చేయగలిగాడు. దానికి తార్కాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే కాదు, ఆయన నాయకత్వంలో ఎదిగిన తెలంగాణ.
పార్టీ నిర్మాణంలో, అంచలంచెల నాయకత్వ విధానంలో కమ్యూనిష్టులను అనుకరించే చంద్రబాబు, అనుసరించేది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆయన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రూపురేఖలు ఎలా అల్లుకుపోతాయి అనే మాట పక్కన పెడితే.. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే ఆయన లక్ష్యం. దార్శనికుడు అంటారు, అది నిజమే.. అలాగే అన్వేషణ ఆయన సహజగుణం. రేపు రాబోయే సమాజం ఎలా ఉంటుందో దర్శించగలగటం ఒకెత్తు.. ఆ సమాజానికి అవసరమైన పునాదులను అన్వేషించటం మరో ఎత్తూ.. ఈ రెండూ ఏకకాలంలో చేయగలగడమే చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పటి ప్రపంచం తీరుతెన్నులకు తనను తాను మలచుకుంటాడు. ఆయన మీద ఉండే ప్రధానమైన విమర్శ కూడా అదేనేమో! అవసరాలకు అనుగుణంగా తన పార్టీ విధివిధానాలను, తన పాలనా తీరును మార్చుకోవటం అవకాశవాదం అయితే.. ఆయన ఖచ్చితంగా అవకాశవాదే. కానీ ఆయన నమ్మేది అవసరమే ఆవిష్కరణకు తల్లి. ప్రజల అవసరాలను తీర్చటమే తన విధానాల అన్వేషణకు మూలం అనుకుంటారు చంద్రబాబు. తన పార్టీ బతికి ఉండాలి, తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే ఆశయానికి అనుగుణంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన రాజకీయాలలో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోయారు. రేపు రాబోయే ఎన్నికలలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటి అవసరాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నంలో ఇప్పటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఆయన లెక్క చేయరు. అయితే ఆయన ఆలోచనలు రాష్ట్ర అవసరాల మేరకే పరిమితమైపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారే కానీ, దేశ విదేశీ విధానం గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. బహుశా సుదీర్ఘకాలం తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో జత కట్టించి ఉంచటం వలనేమో.. రాష్ట్రానికి ఆవల ఏమీ జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోరు.
ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలు ఆయనలోని దార్శనికుని చూస్తున్నాయి. కానీ.. దేశ రాజకీయాలలో ఆయన పాత్ర పరిమితం అయిపోయింది. ఇదే ఎన్డీయే వాజ్ పేయి నాయకత్వంలో పరిపాలన కొనసాగిగుతున్నప్పుడు.. దేశంలో మౌలిక వసతుల రూపకల్పన లాంటి విషయాలలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక పిల్లర్ అయినా జాతీయ విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకోవటం లేదు. బహుశా మారిన రాజకీయ ముఖచిత్రంలో ఆయన తన పాత్రను రాష్ట్రం వరకే పరిమితం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇది దేశానికి నష్టం.
అయితే ఆంధ్రరాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నదంటే, ఆయన మరో డెబ్బై అయిదు వసంతాలు జరుపుకోవాలన్నంతగా! ఒకనాడు ఆయన ఐటీ వైపు మొగ్గు చూపినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు అంతులేని భేదం ఉన్నది. ఐటీ సెక్టార్ నిరాటంకంగా పాతిక సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించటమే కాక, ఉన్న ఉద్యోగులనే తీసివెయ్యవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నది. కొత్తగా వచ్చిన సాంకేతికత ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, సాంకేతిక రంగానికి ఆవల కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వీటన్నిటికంటే మిన్నగా కుదేలయిపోయిన వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాలి. వ్యవసాయాధారిత రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకంటే ముఖ్యం. ఇక చంద్రబాబు మానస పుత్రిక, ప్రజా రాజధాని అమరావతి ఉండనే ఉన్నది. చంద్రబాబు డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల నాటికి అమరావతికి ఒక రూపం తీసుకువస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. భిన్న కోణాల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యం అనే విషయంతో ఎవరూ విభేదించలేరు. అందరికీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి, కానీ సమస్యను సవాలుగా స్వీకరించేవారిపై బాధ్యతలు పెరుగుతాయి. అందుకని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. బహుశా ఆయన కోరుకునేది కూడా ఇటువంటి శుభాకాంక్షలనే ఏమో. తెలుగుజాతి అస్తిత్వానికే చిహ్నంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగువన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా..
ALSO ON TELUGUONE N E W S
-బిగ్ బాస్ లో పాల్గొని అభిమానులని అలరించింది
-కానీ ఆ రోగం వచ్చింది
-అందుకు కారణం వాల్లే
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ షో టెలికాస్ట్ అవుతున్నంత సేపు తమ డైలీ దిన చర్యని మార్చుకునే వాళ్ళు ఎంతో మంది. అన్ని భాషల్లోను ఇదే పరిస్థితి. కొంత మంది మేకర్స్ అయితే బిగ్ బాస్ రన్నింగ్ లో ఉన్నంత కాలం తన సినిమాలని రిలీజ్ చేయడానికి భయపడతారు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ షోనే తన హౌస్ మేట్ ని భయపెట్టింది, భయపెట్టడమే కాదు భయానిక పరిస్థితుల్లోకి కూడా తీసుకెళ్లింది. దీంతో హౌస్ మేట్ రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం
జనవరి 11 న స్టార్ట్ అయిన బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్ నిన్న ఆదివారంతో పూర్తయింది. ఈ సీజన్ లో ప్రముఖ నటి సోనాలి రౌత్(Sonali Raut)హౌస్ మేట్ గా పాల్గొని ఫిబ్రవరి 1 న ఎలిమినేట్ అయ్యింది. రీసెంట్ గా సోషల్ మీడియా వేదిక ఒక వీడియో రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు బిగ్‌బాస్ నుండి బయటకి వచ్చాక నా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద రావడం మొదలైంది. వైద్యులని సంప్రదిస్తే తామర అని చెప్పారు. బిగ్ బాస్ లోని అపరిశుభ్ర వాతావరణం కారణంగానే నాకు ఆ రోగం వచ్చింది. దీంతో మానసిక, శారీరక క్షోభ అనుభవిస్తూ షూటింగ్స్ కి కూడా హాజరు కాలేకపోతున్నాను. కెమెరా ముందుకు రావాలంటేనే భయంగా ఉంది. అసలు షో నుంచి రెండు వారాల్లోనే బయటకి రావడానికి కారణం కూడా దురద వల్లనే. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా తగ్గలేదు. ప్రస్తుతం మెడిసిన్స్ వాడుతు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంలో నిర్వాహకులకి సోనాలి రౌత్ రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది.
ముంబైకి చెందిన సోనాలీ 2010లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా ఎంపికయింది. అప్పటికి ఆమె 19 సంవత్సరాల కళాశాల విద్యార్థిని.మాక్ కాస్మోటిక్స్, పీసి చంద్ర జ్యువెలర్స్, లిమ్కా, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్ మొదలైన అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లకి అంబాసిడర్ గా వ్యవహరించింది. 2011లో మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్‌తో కలిసి చేసిన ఫోటోషూట్ అయితే సంచలనం సృష్టించింది. ది ఎక్స్‌పోజ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం కూడా చేసి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లడానికి 99% యూజ్‌లెస్ ఫెలోస్ అనే మూవీ ఆఫర్ ని కూడా వదులుకొని మరో వెళ్ళింది.
also read: VIjay: వైఫ్ సంగీత విషయంలో విజయ్ కీలక నిర్ణయం.. 23 నే కదా ఎలక్షన్స్
సోషల్ మీడియాలో సోనాలి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో కేవలం రేటింగ్స్ కోసమే కాకుండా, కంటెస్టెంట్ల ఆరోగ్యంపై కూడా నిర్వాహకులు శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. గతంలో కూడా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు జుట్టు రాలడం, అలర్జీలు రావడం వంటి ఫిర్యాదులు చేసినా, సోనాలీ విషయంలో ఇది మరీ తీవ్రంగా ఉండటం గమనార్హం. సోనాలి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం తను హౌస్ లో ఉన్నన్ని రోజులు పెర్ఫార్మ్ తో మెప్పించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పుట్టినరోజు (ఏప్రిల్ 20) సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, వీటన్నింటిలోనూ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబును 'మావయ్య గారు' అని ఆత్మీయంగా సంబోధిస్తూ తారక్ చేసిన ట్వీట్ నందమూరి, నారా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
హ్యాపీ బర్త్‌డే మావయ్య గారు
జూనియర్ ఎన్టీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో మీరు చూపే అదే దార్శనికత, అంకితభావం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతూ, అందరికీ గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నాను" అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
గత కొంతకాలంగా చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య సంబంధాల గురించి రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, తారక్ ఇంత ఆత్మీయంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 'మావయ్య గారు' అనే పదం వాడటం ద్వారా తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధం ఎంత దృఢంగా ఉందో మరోసారి స్పష్టమైంది.
https://x.com/tarak9999/status/2046042311185055960
ప్రముఖుల శుభాకాంక్షలు
చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు:
పవన్ కళ్యాణ్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
చిరంజీవి: మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా, తనదైన ముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుకు ఈ పుట్టినరోజు మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విజయ్ తీరు
-మరి విజయ్ అనుకున్నట్టుగానే జరుగుతుందా!
-ఈ రోజే విచారణ
ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కైవసం చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 న జరగనున్న ఎన్నికల్లో తమిళ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తి తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా ఇండియా వ్యాప్తంగా అందరిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కి సంబంధించిన తాజా న్యూస్ ఎలక్షన్ మ్యాటర్ లాగానే వైరల్ గా మారింది
కొన్ని రోజుల క్రితం విజయ్ నుంచి విడాకులు కోరుతు ఆయన భార్య సంగీత(Sangeetha)పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ విడాకులకి ఒప్పుకుంటాడా లేదా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొని ఉంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా టాక్. విజయ్ తన భార్యకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని, విడాకుల ప్రక్రియని పరస్పర అంగీకారంతో త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా భారీ సెటిల్‌మెంట్‌కి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 250 కోట్ల భరణం ఇవ్వాలని సంగీత కోరుకుందని, విజయ్ మాత్రం 35 కోట్లు ఇవ్వడంతో పాటు కొడుకు, కూతురుని తానే చూసుకుంటానని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
also read: sanskruti jayana: హీరోయిన్ గా మాజీ ముఖ్యమంత్రి మనవరాలు.. హీరో ఇతనే
ఈ రోజు మాత్రం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణకి రానుంది. విజయ్ స్వయంగా హాజరు కావాల్సి ఉండగా,ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆన్ లైన్ ద్వారా హాజరు కానున్నాడు. ఈ నేసథ్యంలో తీర్పుపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఎలక్షన్స్ లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడు.
విలక్షణమైన పాత్రలతో అలరించే కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం 'కర' (Kara). విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
కథా నేపథ్యం:
1990ల నాటి గల్ఫ్ యుద్ధం, కువైట్ చమురు బావుల మంటల వార్తలతో ట్రైలర్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక బ్యాంక్ దొంగతనం సీన్‌తో ధనుష్ ఎంట్రీ అదిరిపోయింది. ఒక రాత్రి బ్యాంక్ దోచుకున్న వ్యక్తి, మళ్ళీ మరుసటి రోజు పట్టపగలే మరో బ్యాంకును దోచుకోవడం అనే పాయింట్ కథలో ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. ధనుష్ ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తూనే, తను చేసే పనుల వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందనే సస్పెన్స్‌ను ట్రైలర్‌లో కొనసాగించారు. "అతను ఈరోజు ఖచ్చితంగా దొరికిపోతాడు" అనే పోలీస్ అధికారి మాటతో ట్రైలర్ ముగియడం, క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.
నటీనటుల పనితీరు:
ధనుష్ తన నటనతో మరోసారి మాయ చేశాడు. మాస్ లుక్, బ్యాంక్ దొంగగా అయన పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. "నాకు డబ్బు కావాలి, నా పరిస్థితి మీకు అర్థం కాదు" అనే డైలాగ్ ధనుష్ పాత్రలోని లోతును సూచిస్తోంది. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నాయి.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు విఘ్నేష్ రాజా ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చాలా సహజంగా, ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచుతూ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, పోలీసుల ఛేజింగ్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి.
మొత్తానికి 'కర' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ధనుష్ మరో వైవిధ్యమైన పాత్రతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది.
-వెండి తెరపై రాణించాలనే ఆశతో ఎంట్రీ
-ఆ ఎంట్రీ మాములు ఎంట్రీ కాదు
-మాజీ సిఎం మనవరాలు
-మరి ఆమె సక్సెస్ ని అందుకుంటుందా!
కళకి ఉన్న పవిత్రత ఈ సృష్టిలో మరో దానికి లేదని అంటారు. మరి ముఖ్యంగా కళకి సంబంధించిన ప్రధాన రూపమైన సినిమా. బద్ద శత్రువులైనా సరే మనం నటించిన సినిమా చూస్తే మనకి అభిమాని అయిపోవడం గ్యారంటీ. అంతటి శక్తి సినిమా సొంతం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మనవరాలు సినీ ఆరంగ్రేటం చేస్తూ తన అమ్మమ్మకి ఉన్న ఏ కొద్దిపాటి శత్రువులనో కూడా తన అభిమానులుగా మార్చుకోనుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఆనందీబెన్ పటేల్(Anandi Ben Patel).. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. ఆమె కూతురు పేరు అనార్. ఈ అనార్ కూతురు 'సంస్కృతి జయనా'(Sanskruti Jayana). హీరోయిన్ గా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 'కృష్ణావతారం పార్ట్ 1: ద హార్ట్'(Krishnavataram Part 1 The Heart) అనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పౌరాణిక చిత్రంలో సత్యభామ క్యారక్టర్ లో కనిపించనుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అవ్వగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సత్యభామ క్యారక్టర్ లో సంస్కృతి ఆహార్యం, పెర్ఫార్మ్ చూస్తుంటే నిజమైన సత్యభామ మన కళ్ళ ముందు ఉందా అనిపించింది. శ్రీకృష్ణుడి జీవితంలోని ప్రేమ, భక్తి మరియు ధర్మ పోరాటాన్ని ఆవిష్కరించనుండగా హార్దిక్ గజ్జర్(Hardik Gajjar)దర్శకుడు. అందరు కర్మలని అనుభవిస్తారు. అది మనిషైనా సరే, మనిషి రూపం దాల్చిన అవతరమైనా సరే.. మురళి మోహన మోహములపుటేలేరా.. వెళ్ళద్దు కన్నయ్య.. నువ్వు వెళ్ళిపోతే ప్రేమ వెళ్ళిపోతుంది. అనే ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కిందో అర్థంకావడానికి. మే 7 న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
also read: Allu Arjun: హైదరాబాద్ కి గుడ్ బై చెప్పనున్న అల్లు అర్జున్.. ఇక నివాసం ఆ సిటీలోనే
'సంస్కృతి జయనా'కి సంబంధించిన మిగతా విషయాలకి వస్తే లండన్, అమెరికాలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నటన మరియు ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందింది. ఒకవైపు ఫ్యాషన్ బ్రాండ్ నడుపుతూనే ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వ్యాపార రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చిన సంస్కృతి తన తల్లి అనార్ అడుగుజాడల్లో నడుస్తూ హస్తకళలు గ్రామీణ కళాకారులను ప్రోత్సహించే పలు సేవా కార్యక్రమాల్లోపాల్గొంటూ వస్తుంది. మరి 'కృష్ణావతారం' సూపర్ డూపర్ హిట్ అయ్యి సంస్కృతి మరిన్ని చిత్రాల్లో చేసి తన అభిమానులని అలరించాలని కోరుకుందాం. సిద్దార్ష్ గుప్తా కృష్ణుడిగా చేస్తుండగా సుస్మిత భట్ రాధగా చేస్తుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా, మంచి విద్యార్థులుగా, మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే చిన్న మార్పులు పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మాట్లాడటం..
నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ప్రశ్నలకు సమాధానాలు..
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైం..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం. పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి.
ఎంకరేజ్..
ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
తమ పని తాము చేసుకోవడం..
పిల్లలకు వారి బ్యాగ్ వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం.
పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.
*రూపశ్రీ.
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు లక్షణాల గురించి, ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..
హీమోఫిలియా లక్షణాలు..
గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం, కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.
ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.
థీమ్ ఇదే..
వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స, సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.
హీమోఫిలియా..
శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది. రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి, నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.
ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు. అయితే అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల బంధం బాగుంటుంది. ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది. అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
మద్దతు..
అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు. అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే.. ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.
గౌరవం, మర్యాద..
అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే, గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా, నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.
బాధ్యత..
ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి, బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.
ప్రేమ, అనుబంధం..
అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది, తెలియకుండానే కోడలి పట్ల ఆమెకు చాలా ఇష్టం ఏర్పడుతుంది.
మనసు విప్పి మాట్లాడటం..
ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.
*రూపశ్రీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఏప్రిల్ 20) తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. చంద్రనబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో అవసరమనీ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. చంద్రబాబును అనితర సాధ్యుడి'గా అభివర్ణించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఒక సమర్థుడైన పరిపాలకుడిగా చంద్రబాబు సేవలు చిరస్మరణీయమన్నారు.
కాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘమైన, ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుకు ఫోన్ , సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఇక సినీ ప్రముఖుడు చిరంజీవి, పలువురు అగ్ర నటులు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టిన రోజును సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన పుట్టినరోజు కానుక అనిపేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఈ అపారమైన ప్రేమ తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన.. అన్నది ఇది నిజంగా బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమ కాళ్లపై గొడ్డలి వేసుకున్నారా?
ఎందుకంటే ఇది ఒక శాసన ఓటమి.. పొలిటికల్ విక్టరీ? సీట్ల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఇవన్నీ లోక్ సభలో సభలో 2/3 మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని మోదీ–షా ఓటమిగా ప్రకటించాయి. అయితే మరో కోణంలో చూస్తే.. ఈ సంఘటన బీజేపీకి 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో ఆ వాదనను వాస్తవాలు, రాజ్యాంగం, చరిత్ర, రాజకీయ గణితం ఆధారంగా విడమరచి చూస్తాం.
1. డీలిమిటేషన్ .. ఇది బీజేపీ ఎత్తుగడ కాదు, రాజ్యాంగం ఆదేశం. ఆర్టికల్ 81 & 82 ఏమంటాయి?
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఉత్తర భారతీయుల కుట్ర కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన డెడ్లైన్.
2. మహిళా రిజర్వేషన్ అమలు .. డీలిమిటేషన్ లేకుండా అసాధ్యం. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆర్టికల్ 334ఏ స్పష్టంగా రిజర్వేషన్ అమలు డీలిమిటేషన్ తర్వాతే అని పేర్కొంది. అంటే.. డీలిమిటేషన్ తప్పనిసరి. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బిల్లులోనే ఉన్న నిబంధన. బీజేపీ ప్రతిపాదించిన 850 సీట్లు, 50% పెంపు ఫార్ములా — దక్షిణాది రక్షణ కోసమా?
కేంద్రం ఏం ప్రతిపాదించిందంటే.. లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెంపు. ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు పెంపు. ఆ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలు. ఈ ఫార్యులా వెనుక లాజిక్ ఏంటంటే.. మొత్తం సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాబల్యం తగ్గదు. జనాభా ఆధారిత న్యాయం కూడా జరుగుతుంది. అంటే.. ఉత్తర రాష్ట్రాలకు కొత్త నియోజకవర్గాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకూ అదనపు సీట్లు. ఎవరికీ నష్టం లేకుండా సమతుల్యం.
ఇది దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం అని కేంద్రం అంటోంది. అయితే.. ప్రతిపక్షాలు ఈ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి వాదన ఏంటంటే.. ఈ బిల్లు పాస్ అయితే.. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ప్రాబల్యం దక్కుతుంది.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. 50శాతం పెంపు ఫార్ములా తిరస్కరించబడినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమి, డీఎంకేలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక నష్టం.
5. బీజేపీ నేరేటివ్ మేము రక్షించడానికి ప్రయత్నించాం, వారు అడ్డుకున్నారు. ఈ నినాదంతో బీజేపీకి ఒక స్పష్టమైన ప్రచార మార్గం లభించింది. ఇక మేం మహాళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు బిల్లు తెచ్చాం. కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 50శాతం పెంపును కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది.
ఉత్తర రాష్ట్రాలకు
ఇకఈ బిల్లు వీగిపోవడం వల్ల ఉత్తరాదిలో కూడా బీజేపీకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది. జనాభా పెరిగింది. సీట్ల పెంపును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసే అవకాశం వచ్చింది. ఇది 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం బీజేపీకి లభించింది.
6. ప్రతిపక్షాల వ్యూహపరమైన తప్పు.. ప్రతిపక్షాలు పార్లమెంట్లో బిల్లును ఓడించడంపై ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రజల (ఓటర్ల) మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఇది బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మార్చేసింది.
7. డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది?ప్రతిపక్షాలు 50% పెంపు ఫార్ములాను తిరస్కరించినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ఇది రాజ్యాంగం చెప్పిన మార్గం. దీనిని ఆపడం అసాధ్యం.దీని వల్ల ఉత్తర రాష్ట్రాలకు భారీ లాభం. అదే సమయంలో దక్షిణాదికి తీరని నష్టం. దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రం తమిళనాడు.
8. ముగింపు: ఇది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమను తాము బలహీనపరుచుకున్నాయా.. అంటే.. పరిశీలకులు రెండోదే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ నేరేటివ్, దక్షిణాదికి రక్షణ కోసం ప్రయత్నించిందన్న గుర్తింపు. ప్రతిపక్షాలే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చేశారన్న విమర్శ. ఇది నిస్సందేహంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే 2029 ఎన్నికల ప్రచార అజెండాను బీజేపీకి ముందుగానే లభించేసింది.
ఇక విపక్షాలు.. మహిళా సాధికారతను అడ్డుకున్నాయన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే దక్షిణాదికి సీట్ల నష్టానికి కారణమని ఓటర్లు భావిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో నేరేటివ్ నష్టం. వ్యూహాత్మక దూరదృష్టి లోపం. పార్లమెంట్లో ఓటమి బీజేపీకి పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి వ్యూహపరమైన తప్పు కారణంగా 2029లో వారి రాజకీయ ప్రాబల్యం బలహీనపడే అవకాశం ఉంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండూ ముందే నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీనపడటానికి ప్రతిపక్షాలే కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
భూమ్మీదకు ఎంతోమంది వస్తూ ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు. వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే.. చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం.. ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా కన్నారు? ఆయన కుటుంబ నేపథ్యం ఆయనను చదివించటానికి సరిపోతుంది కానీ, ఆయన రాజకీయాలలో ఎదగడానికి ఖర్చు పెట్టగలిగే శక్తివంతమైనది కాదు. ఈ రోజుల్లో మాదిరి శాసనసభ్యుడు కావాలంటే కోట్లు అవసరం ఉండి ఉండకపోవచ్చు, కానీ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా శాసనసభ్యుడు అవటం ఆ రోజుల్లో కూడా అసాధ్యమే. కానీ తన రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు కలకనటమే కాకుండా.. సాకారం చేసుకోవటానికి కృషి చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
బహుశా అందుకేనేమో.. ఆయన జీవితమంతా అసాధ్యాలను సుసాధ్యం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సవాళ్లను స్వీకరించటం ఆయన నైజం. అందుకే అప్పటికే మహామహులు నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. చిత్తూరు జిల్లాలో పెద్దగా ప్రాధాన్యత లేని సామాజికవర్గం నుండి వచ్చిన ఆయన.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేడు? అనే సవాలును అతి పిన్నవయస్సులో స్వీకరించాడు. సామాన్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు అసామాన్యతనే సామాన్యతగా రూపాంతరం చెందేలా చేయగలిగాడు. దానికి తార్కాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే కాదు, ఆయన నాయకత్వంలో ఎదిగిన తెలంగాణ.
పార్టీ నిర్మాణంలో, అంచలంచెల నాయకత్వ విధానంలో కమ్యూనిష్టులను అనుకరించే చంద్రబాబు, అనుసరించేది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆయన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రూపురేఖలు ఎలా అల్లుకుపోతాయి అనే మాట పక్కన పెడితే.. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే ఆయన లక్ష్యం. దార్శనికుడు అంటారు, అది నిజమే.. అలాగే అన్వేషణ ఆయన సహజగుణం. రేపు రాబోయే సమాజం ఎలా ఉంటుందో దర్శించగలగటం ఒకెత్తు.. ఆ సమాజానికి అవసరమైన పునాదులను అన్వేషించటం మరో ఎత్తూ.. ఈ రెండూ ఏకకాలంలో చేయగలగడమే చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పటి ప్రపంచం తీరుతెన్నులకు తనను తాను మలచుకుంటాడు. ఆయన మీద ఉండే ప్రధానమైన విమర్శ కూడా అదేనేమో! అవసరాలకు అనుగుణంగా తన పార్టీ విధివిధానాలను, తన పాలనా తీరును మార్చుకోవటం అవకాశవాదం అయితే.. ఆయన ఖచ్చితంగా అవకాశవాదే. కానీ ఆయన నమ్మేది అవసరమే ఆవిష్కరణకు తల్లి. ప్రజల అవసరాలను తీర్చటమే తన విధానాల అన్వేషణకు మూలం అనుకుంటారు చంద్రబాబు. తన పార్టీ బతికి ఉండాలి, తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే ఆశయానికి అనుగుణంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన రాజకీయాలలో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోయారు. రేపు రాబోయే ఎన్నికలలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటి అవసరాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నంలో ఇప్పటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఆయన లెక్క చేయరు. అయితే ఆయన ఆలోచనలు రాష్ట్ర అవసరాల మేరకే పరిమితమైపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారే కానీ, దేశ విదేశీ విధానం గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. బహుశా సుదీర్ఘకాలం తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో జత కట్టించి ఉంచటం వలనేమో.. రాష్ట్రానికి ఆవల ఏమీ జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోరు.
ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలు ఆయనలోని దార్శనికుని చూస్తున్నాయి. కానీ.. దేశ రాజకీయాలలో ఆయన పాత్ర పరిమితం అయిపోయింది. ఇదే ఎన్డీయే వాజ్ పేయి నాయకత్వంలో పరిపాలన కొనసాగిగుతున్నప్పుడు.. దేశంలో మౌలిక వసతుల రూపకల్పన లాంటి విషయాలలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక పిల్లర్ అయినా జాతీయ విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకోవటం లేదు. బహుశా మారిన రాజకీయ ముఖచిత్రంలో ఆయన తన పాత్రను రాష్ట్రం వరకే పరిమితం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇది దేశానికి నష్టం.
అయితే ఆంధ్రరాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నదంటే, ఆయన మరో డెబ్బై అయిదు వసంతాలు జరుపుకోవాలన్నంతగా! ఒకనాడు ఆయన ఐటీ వైపు మొగ్గు చూపినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు అంతులేని భేదం ఉన్నది. ఐటీ సెక్టార్ నిరాటంకంగా పాతిక సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించటమే కాక, ఉన్న ఉద్యోగులనే తీసివెయ్యవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నది. కొత్తగా వచ్చిన సాంకేతికత ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, సాంకేతిక రంగానికి ఆవల కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వీటన్నిటికంటే మిన్నగా కుదేలయిపోయిన వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాలి. వ్యవసాయాధారిత రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకంటే ముఖ్యం. ఇక చంద్రబాబు మానస పుత్రిక, ప్రజా రాజధాని అమరావతి ఉండనే ఉన్నది. చంద్రబాబు డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల నాటికి అమరావతికి ఒక రూపం తీసుకువస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. భిన్న కోణాల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యం అనే విషయంతో ఎవరూ విభేదించలేరు. అందరికీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి, కానీ సమస్యను సవాలుగా స్వీకరించేవారిపై బాధ్యతలు పెరుగుతాయి. అందుకని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. బహుశా ఆయన కోరుకునేది కూడా ఇటువంటి శుభాకాంక్షలనే ఏమో. తెలుగుజాతి అస్తిత్వానికే చిహ్నంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగువన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా..
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు, ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట. ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు, పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు.
జామకాయ..
జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది.
సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్..
సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు.
నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు..
నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ, బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.
*రూపశ్రీ.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు.
ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి?
నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి?
పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు.
నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి?
మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.
మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని, ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు.
గుండెల్లో మంట, ఎసిడిటీ..
కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జీర్ణవ్యవస్థ..
అతిగా మసాలా, కారం ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.
నోరు, గొంతు సమస్యలు..
అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి.
అల్సర్ల ప్రమాదం..
క్రమం తప్పకుండా మసాలా, ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.
చర్మ సమస్యలు..
మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం.
పైల్స్..
మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట , నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం పదార్థాలకు దూరంగా ఉండాలి.
నిద్ర..
రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
మసాలా ఆహారాలు తినకూడదా?
మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే కడుపు, చర్మం , మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.