LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుది ఒక ప్రత్యేక శైలి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని అయన చేసే విమర్శలు తరచుగా బూమరాంగ్ అవుతూ ఉంటాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటి కంటే.. అధికారంలో నేని సమయంలోనే అప్రమత్తంగా ఉండాలంటారు పరిశీలకులు. అధికార పక్షంపై చేసే విమర్శలకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపనలు చేస్తే.. ప్రజలలో ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబే చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని ఆయన స్వయంగా ప్రకటించేశారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ఫోటో తీవ్ర వివాదానికి కారణమైంది. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధించిన ఒక ఫోటోను ఆధారం చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే.. ఆ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటో అని తేలడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఫేక్ ఫోటో వ్యవహారంపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ పార్టీ చేసిన పెద్ద తప్పును బహిరంగంగానే అంగీకరించేశారు. ఎలాంటి ప్రాథమిక నిర్ధారణ లేకుండా.. కేవలం సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫేక్ ఫోటోను నమ్మి కూటమి ప్రభుత్వంపై దాడికి దిగడం వల్లే వైసీపీ బుక్కయిందని అంబటి అన్నారు. నిజం కాని విషయాలపై స్పందించి నవ్వులపాలు కావడం కంటే, మౌనంగా ఉండటమే మేలన్నట్లుగా ఆయన మాట్లాడారు.
విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు.అక్కడితో ఆగకుండా సాయి కృష్ణ ఫోటోను ప్రదర్శించి.. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని ఆరోపణలు చేశారు.
అంబటి రాంబాబు ప్రదర్శించిన ఫొటోలను ఆధారం చేసుకుని జగన్ సొంత మీడియా కూడా రెచ్చిపోయి వార్తలను ప్రచురించింది. ప్రసారం చేసింది. అయితే అంబటి రాంబాబు చూపిన ఫొటో సాయికృష్ణది కాదు, నవీన్ రెడ్డిదని తేలింది. ఈ విషయాన్ని స్వయానా నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ నవీన్ రెడ్డి ఎవరన్న ఆరా మొదలైంది. ఆ ఆరాలో నవీన్ రెడ్డి, సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులని తేలింది. వీరిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారనీ రాణి తోట.. కృష్ణలంక వాసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తాను అడ్డంగా బుక్కవ్వడమే కాకుండా, వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) అభ్యర్థి బైజనాథ్ రామ్ సునాయాస విజయం సాధించారు.
ఇక రెండో స్థానంలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఘ నెలకొంది. రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపునకు కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా.. పరిమళ్ నత్వానీకి ఖచ్చితంగా 28 ఓట్లు లభించడం విశేషం. మరోవైపు, అధికార కూటమి అండతో గెలుపుపై కొండంత ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ 81 ఓట్లలో నత్వానీ తనకు కావలసిన 28 ఓట్లను సాధించి గెలుపు బావుటా ఎగురవేశారు.
వాస్తవానికి జార్ఖండ్ అసెంబ్లీలో జెఎమ్ఎమ్, కాంగ్రెస్-ఆర్‌జేడీ అధికార కూటమికి కలిపి స్పష్టంగా 56 మంది ఎమ్మెల్యేల భారీ బలం ఉంది. సాధారణ రాజకీయ లెక్కల ప్రకారం చూస్తే జెఎమ్ఎమ్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కూడా చాలా సులభంగా విజయం సాధించాలి. కానీ.. కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న ఎన్‌డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థిగా పరిమళ్ నత్వానీని రంగంలోకి దించి మైండ్ గేమ్ ఆడింది. ఈ రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టింది. అధికార కూటమి అభ్యర్థి ప్రణవ్ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే రావడం వెనుక అధికార కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేటతెల్లం అయ్యింది. కొందరు అధికార పక్ష ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ నత్వానీకి ఓట్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల విషయంలో తెలుగుదేశం నుంచి మద్దతు లభించకపోవడంతో.. కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ పై అటాక్ చేయడానికి విజయవాడలో సంచలనం సృష్టిస్తోన్న రౌడీ షీటర్ గడే సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకుని నాని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, డిమాండ్ లు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ప్రకాశం జిల్లా నుంచి గడే సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని , అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్ చేశారనీ, మృతదేహాన్ని సైతం పోలీసులు మాయం చేశారనే ఆరోపణలపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేవలం బాధ్యులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును బదిలీ చేయడం లేదా వీఆర్‌కు పంపడం అనేది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని విమర్శించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. గత నెల 9వ తేదీ నుంచి దాదాపు 35 రోజులకు పైగా సాయికృష్ణను పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఈ సుదీర్ఘ అక్రమ కస్టడీ వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబం లబోదిబోమంటోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కస్టడీ మరణం వార్తలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే జూన్ 29వ తేదీ లోగా బాధ్యులైన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. కేశినేని నాని, నేరస్థుడిని శిక్షించే అధికారం కేవలం కోర్టులకే ఉందని, పోలీస్ స్టేషన్లు శిక్షలు ఖరారు చేయలేవంటూ విమర్శలు గుప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేయాలని కేశినేని డిమాండ్ చేశారు. తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న అంతర్గత పోరులో సీఎం చంద్రబాబు మద్దతు లభించకపోవడంతో.. నాని ఇలా రూటు మార్చి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
ALSO ON TELUGUONE N E W S
విభిన్న క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శ్వాసిక విజయ్ ఈ రోజు విజయ్ ఆంటోనీతో కలిసి వంద దేవుళ్ళు తో థియేటర్స్ లో అడుగుపెట్టింది. మూవీపై నమ్మకంతో మేకర్స్ నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
వాసవి(శ్వాసిక విజయ్) పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకే భర్తని కోల్పోతుంది. ఇద్దరు పిల్లలు . పేర్లు భాస్కర్(అజయ్ ధీషాన్) వివేక్. ఆర్ధికంగా అత్యంత పేద కుటుంబం కావడంతో పలు రకాల పనులు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. తనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆశ పుడుతుంది. కానీ కొడుకులు ఒప్పుకోరు. పైగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మరి వాసవి కోరిక నెరవేరిందా? అసలు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకొనేది శారీరక సుఖం కోసమా? లేక సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావడం కోసమా? మరి ఈ కథలో ఏడుకొండలు(విజయ్ ఆంటోనీ) క్యారక్టర్ ఏంటి? అనేదే వంద దేవుళ్ళు
ఎనాలసిస్
భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్లు కొత్త జీవితాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే పాయింట్ బాగుంది. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. మూవీ చూస్తున్నంత సేపు బాగానే ఉన్నా సినిమాటిక్ గా మలచడంలో మేకర్స్ కొంచం తడబడ్డారు. ఏడుకొండలు క్యారక్టర్ ని మొదటి నుంచే వాసవికి పారలల్ గా చూపిస్తూ ఏడుకొండల కూతురు కూడా తన తండ్రి రెండో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మూవీ ప్రారంభమే మంచి ఇంట్రస్ట్ తో సాగడంతో . వాసవి క్యారక్టర్ కి సరెండర్ అవుతాం. పిల్లల కోసం ఆమె చేసే చిన్న చిన్న పనుల్ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. వాసవి పెద్ద కొడుకుతో స్కూల్ మాస్టర్ మీ అమ్మకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తే వాసవితో కొడుకు ప్రవర్తించే తీరుకి సంబంధించిన సీన్ గూస్ బంప్స్. భాస్కర్ పెళ్లి చూపుల సీన్, యూ ట్యూబ్ కంటెంట్ ఎపిసోడ్ సూపర్ గా ఉండటంతో పాటు నవ్వులు పూయించింది. భాస్కర్, వాసవికి మధ్య వచ్చే కండిషన్ కాన్సెప్ట్ ఎక్స్టార్డినరీ. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే చాలా స్పీడ్ గా సాగింది. ఏడుకొండలు రాకతో డల్ గా ఉన్న కథనంలో స్పీడ్ రావడంతో పాటు వాసవి, ఏడుకొండల మధ్య వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా మరిన్ని సీన్స్ ఉండాల్సింది. వాసవిని పుట్టింటోళ్లే చంపడానికి ప్రయత్నించే సన్నివేశం ఒళ్ళు జలధరింపచేస్తుంది. నేటికీ సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారనే విషయాన్నీ గుర్తుకి చేస్తుంది.చివరి ఇరవై నిమిషాలతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎక్స్ టార్డినరీగా ఉన్నాయి
నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు
వాసవిగా శ్వాసిక విజయ్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వితంతువుగా, ఇద్దరు కొడుకుల తల్లిగా భిన్న పార్శ్వాలున్న క్యారక్టర్ లో జీవించింది. ఉన్నత స్థాయితో కూడిన అవార్డు రావడం ఖాయం. నిడివి తక్కువైనా ఏడుకొండలుగా విజయ్ ఆంటోనీ తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసాడు. భాస్కర్ క్యారక్టర్ లో అజయ్ దిశన్ నూటికి నూరు శాతం సూట్ అయ్యి మెచ్యూర్డ్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకున్నాడు. రెండో కొడుకుగా చేసిన నటుడుతో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ తమ పెర్ఫార్మ్ తో మూవీకి హెల్ప్ అయ్యారు. శశి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా మరింత పదును పెట్టాల్సింది. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ హైలెట్. నిర్మాణ విలువలు కథకి తగట్టుగా ఉన్నాయి.
బలాలు
1 . కథ
2 . శ్వాసిక విజయ్, విజయ్ ఆంటోనీ పెర్ ఫార్మెన్స్
3 . సెకండ్ హాఫ్
4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
5 .డైరెక్షన్
బలహీనతలు
1 . కొన్ని క్యారెక్టర్స్ చుట్టూనే కథ తిరగడం
2 . ఫస్ట్ హాఫ్
చివరిగా చెప్పుకోవాలంటే కథ మెయిన్ పాయింట్ తో పాటు శ్వాసిక విజయ్, విజయ్ అంథోని వంద దేవుళ్ళకి ప్రధాన బలంగా నిలిచారు.
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం
గతించిన కాలం, గడిచిపోయిన రూమర్స్ వెతుక్కుంటూ రావడం సోషల్ మీడియాకు అలవాటు. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో సినీ తార రాయ్ లక్ష్మీ రిలేషన్‌షిప్‌లో ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వచ్చి ఏళ్ళవుతున్నా, ఇప్పటికీ నెట్టింట ఏదో ఒక సందర్భంలో అవి చర్చకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ అంశంపై రాయ్ లక్ష్మీ మరోసారి స్పందించి తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఆ రూమర్స్ నుండి బయటపడిన ఈ హాట్ బ్యూటీ, పదే పదే పాత విషయాలను తవ్వి తీయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన కెరీర్ మొదట్లో ధోనీతో ఉన్న క్లోజ్ నెస్ గురించి వచ్చిన వార్తలను "ఒక మచ్చ" (scar) గా ఆమె అభివర్ణించింది. అప్పట్లో జరిగిన దాన్ని, ఇప్పుడున్న తన జీవితానికి ముడిపెట్టడం ఏంటని ఆమె ప్రశ్నిస్తోంది.
ఈ రూమర్స్ వల్ల తన పర్సనల్ లైఫ్‌కు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఒకవేళ భవిష్యత్తులో తన పిల్లలు ఈ వార్తల గురించి అడిగితే తను ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని రాయ్ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. పాత విషయాలను వదిలేసి, తన ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వాలని కోరింది.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆమె స్టెప్పులకు మంచి ఆదరణ లభించింది.
ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం కోసం కష్టపడుతున్న సమయంలో, ఇలాంటి పాత రూమర్స్ తన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆమె భావిస్తోంది. నిజానికి సెలబ్రిటీల జీవితాల్లో కొన్ని సంఘటనలు అలానే ఉండిపోతాయి, కానీ వాటినే పట్టుకుని వేలాడటం సరికాదని నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుల మీద పూర్తి దృష్టి సారించిన రాయ్ లక్ష్మీ, తన పనితీరుతో కొత్త ఇమేజ్‌ని బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. రూమర్స్‌ను పక్కనపెట్టి ఆమె నటించే పాత్రల కోసం ఎదురుచూడడమే అభిమానుల ముందున్న మార్గం.
వీకెండ్ వచ్చేసిందంటే చాలు డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చొని సరికొత్త సస్పెన్స్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్స్ కోసం వెతికే సినీ ప్రియుల సంఖ్య చాలా ఎక్కువ. అలాంటి వారి కోసం ఈ వారం ఒక అదిరిపోయే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డిజిటల్ వేదికపై సందడి చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించిన ఒక కన్నడ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల కాలంలో డిజిటల్ బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ఆ క్రేజీ హారర్ డ్రామానే 'సీట్ ఎడ్జ్'. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కేవలం ఒరిజినల్ కన్నడ భాషలోనే కాకుండా, మన సౌత్ ఆడియెన్స్ కోసం తెలుగు వెర్షన్‌లోనూ ఈ భయానక చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా, నేటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, ఫాలోయింగ్ సంపాదించి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలని ఆశపడే సిద్ధు అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎన్ని రకాల వీడియోలు చేసినా పెద్దగా క్లిక్ కాకపోవడంతో, చివరికి ఒక డిఫరెంట్ ఐడియాతో దెయ్యాల కంటెంట్ చేయాలని డిసైడ్ అవుతాడు.
అలా హారర్ వీడియో షూట్ కోసం ప్లాన్ చేసుకుని, ఒక ఊరు కాని ఊరిలో ఉన్న నిగూఢమైన, రహస్య ప్రాంతానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను ఊహించని విధంగా చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు. అసలు ఆ భయానక ప్రదేశంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? ఆ క్లిష్ట పరిస్థితుల నుండి సిద్ధు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు చేతన్ శెట్టి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సిద్ధు మూలిమణి ప్రధాన పాత్రలో నటించగా.. రవిక్షా శెట్టి, రఘు రమణకొప్ప, గిరీష్ శివన్న తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎన్ ఆర్ సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భయపెట్టే విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ సినిమాపై గట్టి చర్చ నడుస్తోంది. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 8.2 రేటింగ్‌తో దూసుకుపోతుండటంతో హారర్ జోనర్ ఇష్టపడే సినీ లవర్స్ ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్‌లు మరియు హీరో నటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ వారంలో పలు బడా సినిమాలు ఓటీటీ స్క్రీన్స్‌పై సందడి చేస్తున్నప్పటికీ, డిఫరెంట్ కంటెంట్‌తో వస్తున్న 'సీట్ ఎడ్జ్' మాత్రం తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ శని, ఆదివారాల్లో రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఒక మంచి పీరియడ్ హారర్ థ్రిల్లర్‌ను ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి సినిమా వస్తోందంటేనే ఏదో ఒక వైవిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా ఆయన నటిస్తున్న 55వ చిత్రం టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘OM Chapter: 1 - Udhiram: The Blood Wood’ (ఓమ్) అనే ఇంటెన్స్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, దానికి సంబంధించిన 'ఫస్ట్ స్ట్రైక్' వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది.
తాజాగా విడుదలైన ‘ఓమ్’ వీడియో గ్లింప్స్ చూస్తుంటే, ప్రేక్షకులకు టాలీవుడ్ సెన్సేషన్ ‘పుష్ప’ బ్యాక్‌డ్రాప్ గుర్తుకు రాక మానదు. ఈ ప్రచార చిత్రంలో ఎర్రచందనం దుంగలను నరికేందుకు అడవిలోకి వెళ్లిన కొంతమంది శ్రామికులు ఫారెస్ట్ అధికారులకు చిక్కిపోతారు. ఆ ఆపద సమయంలో మాస్ ఎంట్రీ ఇచ్చే కథానాయకుడు ధనుష్, వారిని రక్షించే యాక్షన్ సీక్వెన్స్ సీట్ ఎడ్జ్ ఎలివేషన్‌గా నిలిచింది. ఈ రా అండ్ రస్టిక్ విజువల్స్, అడవి నేపథ్యంలో సాగే డార్క్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.
ఇటీవలే ‘అమరన్’ వంటి బయోపిక్ యాక్షన్ బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీని ఊపేసిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి సారథ్యం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు గుండెకు హత్తుకునే భావోద్వేగాలను పండించడంలో దిట్ట అయిన రాజ్ కుమార్, ఈసారి ధనుష్‌ను సరికొత్త మాస్ రెబెల్ అవతారంలో ప్రజెంట్ చేస్తున్నారు. టైటిల్ లోనే ‘ఛాప్టర్ 1’ అని పేర్కొనడంతో, ఈ ఎర్రచందనం సమరం మున్ముందు మరిన్ని భాగాలుగా రాబోతోందని హింట్ ఇచ్చారు.
ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఆయన పాత్ర సినిమాకు మేజర్ అసెట్ కానుంది. అంతేకాకుండా, అభినయానికి మారుపేరైన సాయి పల్లవి, ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల ఇద్దరూ కథానాయికలుగా నటిస్తూ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్న పల్స్-పౌండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్‌కు ఊపిరి పోసింది.
ఇక ఈ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ధనుష్ కెరీర్‌లో మరో ఊచకోత ఖాయం’ అంటూ హల్చల్ చేస్తున్నారు. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘OM’ చిత్రాన్ని 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మున్ముందు రాబోయే టీజర్, ట్రైలర్ అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సలార్ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిపోయిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ హైస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఐ, నోబడీ’ (I, Nobody). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లొసుగులు, టెక్నికల్ లోపాలను ఆధారంగా చేసుకుని ఒక సామాన్య వ్యక్తి ఎంతటి భారీ దోపిడీలకు పాల్పడ్డాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అసలు ఆ అపరిచితుడు బ్యాంకులని ఎలా బురిడీ కొట్టించాడు? అతన్ని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం, ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలు ఎలాంటి వ్యూహాలు పన్నాయనే అంశాలు ట్రైలర్‌లో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. అవుట్‌పుట్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సీరియస్ అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రియులకు దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘లక్కీ భాస్కర్’ సినిమా గుర్తుకు రాక మానదు. ఆ సినిమాలో బ్యాంక్ క్లర్క్ స్కామ్స్ ఎలాగైతే అలరించాయో, అంతకంటే రెట్టింపు ఇంటెన్సిటీతో, నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో మెప్పించబోతున్నట్లు స్పష్టమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ నిషమ్ బషీర్ అద్భుతంగా తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు విలక్షణ నటి పార్వతి తిరుమోతు, హక్కీం షాజహాన్, అశోకన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం నెట్టింట ‘ఐ, నోబడీ’ తెలుగు ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సలార్ లాంటి యాక్షన్ డ్రామా తర్వాత పృథ్వీరాజ్ నుండి వస్తున్న ఈ తరహా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది.
ఈ మైండ్ గేమ్ హైస్ట్ డ్రామా జూలై 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు. అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు, లైఫ్ స్టైల్ విశ్లేషకులు. ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా ఆపుతాయి. ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..
మనిషి చేసే తప్పు..
శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు. గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి, అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి. ఇవన్నీ వ్యక్తిలో ఓపిక, శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు.
సద్గుణాలు..
మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి. పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది. మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను అతను ఆకర్షిస్తాడు. అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి. ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు.
నిజమైన ధనవంతుడు..
పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం, వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు.
అవకాశాలు..
మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది.
అపాత్ర దానం..
దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.
పొదుపు..
చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.
*రూపశ్రీ.
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
విడాకుల ప్రమాదం..
భార్యాభర్తల బంధం ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు. సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం?
సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం?
ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు, ఇంటి విషయాల కారణంగా తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు, ఒకరికి ఒకరు సహకరించే విధానం అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.
లవ్ బాంబింగ్..
లవ్ బాంబింగ్‌ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు.
*రూపశ్రీ.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి. ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం, వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి. మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
ఈ వర్షాకాలంలో తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా, ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..
డ్రైనేజీ రంధ్రాలు..
వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా ఎదురయ్యే సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి. కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి.
కలుపు మొక్కలు..
గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి, ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి.
ప్రూనింగ్..
ప్రూనింగ్ అంటే కత్తిరింపు. కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి.
సపోర్ట్..
వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ లేదా తమలపాకు వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి.
కంపోస్ట్, కొత్త మట్టి..
తరచుగా కురిసే వర్షాల వల్ల కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి, మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది.
కొన్ని గార్డెనింగ్ టిప్స్..
తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి బాగా పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.
*రూపశ్రీ.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుది ఒక ప్రత్యేక శైలి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని అయన చేసే విమర్శలు తరచుగా బూమరాంగ్ అవుతూ ఉంటాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటి కంటే.. అధికారంలో నేని సమయంలోనే అప్రమత్తంగా ఉండాలంటారు పరిశీలకులు. అధికార పక్షంపై చేసే విమర్శలకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపనలు చేస్తే.. ప్రజలలో ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబే చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని ఆయన స్వయంగా ప్రకటించేశారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ఫోటో తీవ్ర వివాదానికి కారణమైంది. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధించిన ఒక ఫోటోను ఆధారం చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే.. ఆ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటో అని తేలడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఫేక్ ఫోటో వ్యవహారంపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ పార్టీ చేసిన పెద్ద తప్పును బహిరంగంగానే అంగీకరించేశారు. ఎలాంటి ప్రాథమిక నిర్ధారణ లేకుండా.. కేవలం సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫేక్ ఫోటోను నమ్మి కూటమి ప్రభుత్వంపై దాడికి దిగడం వల్లే వైసీపీ బుక్కయిందని అంబటి అన్నారు. నిజం కాని విషయాలపై స్పందించి నవ్వులపాలు కావడం కంటే, మౌనంగా ఉండటమే మేలన్నట్లుగా ఆయన మాట్లాడారు.
విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు.అక్కడితో ఆగకుండా సాయి కృష్ణ ఫోటోను ప్రదర్శించి.. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని ఆరోపణలు చేశారు.
అంబటి రాంబాబు ప్రదర్శించిన ఫొటోలను ఆధారం చేసుకుని జగన్ సొంత మీడియా కూడా రెచ్చిపోయి వార్తలను ప్రచురించింది. ప్రసారం చేసింది. అయితే అంబటి రాంబాబు చూపిన ఫొటో సాయికృష్ణది కాదు, నవీన్ రెడ్డిదని తేలింది. ఈ విషయాన్ని స్వయానా నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ నవీన్ రెడ్డి ఎవరన్న ఆరా మొదలైంది. ఆ ఆరాలో నవీన్ రెడ్డి, సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులని తేలింది. వీరిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారనీ రాణి తోట.. కృష్ణలంక వాసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తాను అడ్డంగా బుక్కవ్వడమే కాకుండా, వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) అభ్యర్థి బైజనాథ్ రామ్ సునాయాస విజయం సాధించారు.
ఇక రెండో స్థానంలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఘ నెలకొంది. రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపునకు కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా.. పరిమళ్ నత్వానీకి ఖచ్చితంగా 28 ఓట్లు లభించడం విశేషం. మరోవైపు, అధికార కూటమి అండతో గెలుపుపై కొండంత ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ 81 ఓట్లలో నత్వానీ తనకు కావలసిన 28 ఓట్లను సాధించి గెలుపు బావుటా ఎగురవేశారు.
వాస్తవానికి జార్ఖండ్ అసెంబ్లీలో జెఎమ్ఎమ్, కాంగ్రెస్-ఆర్‌జేడీ అధికార కూటమికి కలిపి స్పష్టంగా 56 మంది ఎమ్మెల్యేల భారీ బలం ఉంది. సాధారణ రాజకీయ లెక్కల ప్రకారం చూస్తే జెఎమ్ఎమ్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కూడా చాలా సులభంగా విజయం సాధించాలి. కానీ.. కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న ఎన్‌డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థిగా పరిమళ్ నత్వానీని రంగంలోకి దించి మైండ్ గేమ్ ఆడింది. ఈ రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టింది. అధికార కూటమి అభ్యర్థి ప్రణవ్ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే రావడం వెనుక అధికార కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేటతెల్లం అయ్యింది. కొందరు అధికార పక్ష ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ నత్వానీకి ఓట్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల విషయంలో తెలుగుదేశం నుంచి మద్దతు లభించకపోవడంతో.. కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ పై అటాక్ చేయడానికి విజయవాడలో సంచలనం సృష్టిస్తోన్న రౌడీ షీటర్ గడే సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకుని నాని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, డిమాండ్ లు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ప్రకాశం జిల్లా నుంచి గడే సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని , అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్ చేశారనీ, మృతదేహాన్ని సైతం పోలీసులు మాయం చేశారనే ఆరోపణలపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేవలం బాధ్యులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును బదిలీ చేయడం లేదా వీఆర్‌కు పంపడం అనేది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని విమర్శించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. గత నెల 9వ తేదీ నుంచి దాదాపు 35 రోజులకు పైగా సాయికృష్ణను పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఈ సుదీర్ఘ అక్రమ కస్టడీ వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబం లబోదిబోమంటోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కస్టడీ మరణం వార్తలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే జూన్ 29వ తేదీ లోగా బాధ్యులైన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. కేశినేని నాని, నేరస్థుడిని శిక్షించే అధికారం కేవలం కోర్టులకే ఉందని, పోలీస్ స్టేషన్లు శిక్షలు ఖరారు చేయలేవంటూ విమర్శలు గుప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేయాలని కేశినేని డిమాండ్ చేశారు. తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న అంతర్గత పోరులో సీఎం చంద్రబాబు మద్దతు లభించకపోవడంతో.. నాని ఇలా రూటు మార్చి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న భోజనంలో అయినా, రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే..
బరువు పెరగడానికి అసలు కారణం..
డాక్టర్ల ప్రకారం.. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు.
అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే..
అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రాత్రి భోజనం చేసేటప్పుడు, శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల, ఎక్కువగా అన్నం తిని, రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు.
బియ్యం రకం ముఖ్యం..
అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.
అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం..
ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి.
సమతుల్యం ఉంటేనే..
రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజువారీ కేలరీలను గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగడం అనేది జరగదు.
బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా తినే ఆహారం పరిమాణం, ఆహార రకం , మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.
*రూపశ్రీ.
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
వినికిడి సమస్యను మొదట్లోనే గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి. దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం.
లక్షణాలు..
గందరగోళం..
వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..
ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు.
వ్యాల్యూమ్..
టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్‌ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్‌ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు.
ఫోన్లో మాట్లాడటంలో ఇబ్బంది..
ఫోన్‌లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్‌లో కేవలం గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది.
చెవిలో శబ్దాలు..
చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.
చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి.
ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి!
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
