Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రభుత్వంపై కేశినేని నాని విమర్శల దాడి.. కారణమదేనా?
posted on: Jun 19, 2026 7:25AM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల విషయంలో తెలుగుదేశం నుంచి మద్దతు లభించకపోవడంతో.. కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ పై అటాక్ చేయడానికి విజయవాడలో సంచలనం సృష్టిస్తోన్న రౌడీ షీటర్ గడే సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకుని నాని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, డిమాండ్ లు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక పోలీసులు ప్రకాశం జిల్లా నుంచి గడే సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని , అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్ చేశారనీ, మృతదేహాన్ని సైతం పోలీసులు మాయం చేశారనే ఆరోపణలపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేవలం బాధ్యులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును బదిలీ చేయడం లేదా వీఆర్‌కు పంపడం అనేది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం అని విమర్శించారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. గత నెల 9వ తేదీ నుంచి దాదాపు 35 రోజులకు పైగా సాయికృష్ణను పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఈ సుదీర్ఘ అక్రమ కస్టడీ వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబం లబోదిబోమంటోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కస్టడీ మరణం వార్తలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేదంటే జూన్ 29వ తేదీ లోగా బాధ్యులైన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. కేశినేని నాని, నేరస్థుడిని శిక్షించే అధికారం కేవలం కోర్టులకే ఉందని, పోలీస్ స్టేషన్లు శిక్షలు ఖరారు చేయలేవంటూ విమర్శలు గుప్పించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేయాలని కేశినేని డిమాండ్ చేశారు. తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న అంతర్గత పోరులో సీఎం చంద్రబాబు మద్దతు లభించకపోవడంతో.. నాని ఇలా రూటు మార్చి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.



.webp)


