Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే!
posted on: Jan 4, 2014 3:45PM

సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే!
టీడీపీ-బీజేపీ కూటమికి ఆధిక్యం
ఎన్నికల సర్వేలు చేయించడంలో స్పెషలిస్టు అయిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు తాజాగా మరో రహస్య సర్వే జరిపించారు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న పాయింట్ మీద జరిపించిన ఈ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాలలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఏ నలుగురు రాజకీయ నాయకులు ఒక్కచోట చేరినా ఈ సర్వే ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు.
సదరు నాయకుడు జరిపించిన సర్వే ఫలితాల ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ-బీజేపీ కూటమి 93 ఎమ్మెల్యే స్థానాలు, 14 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ 71 ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్ర విభజన విషయంలో అత్యుత్సాహం చూపించిన కాంగ్రెస్ పార్టీ 9 ఎమ్మెల్యే స్థానాలు, ఒక్క ఎంపీ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సదరు సర్వే స్పష్టం చేసింది.
ఇక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం.ఐ.ఎం. ఈ మూడు పార్టీలకు కలిపి 71 ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే చెబుతోంది. టీడీపీ-బీజేపీ కూటమికి 46 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎంపీ స్థానాలు వస్తాయని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. వైఎస్సార్సీపీకి తెలంగాణలో అకౌంట్ ఓపెన్ అయ్యే అవకాశం లేదని ఆ సర్వే స్పష్టం చేసింది.


.png)
.jpg)


