LATEST NEWS
తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం  పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా?  అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.  విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే..  ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు.  ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ..  రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.  తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది.  మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు.   మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో  వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై   పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది.   గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.   విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో  పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత  స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.    శ్రీకాకుళం జిల్లాలో  వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో  పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.    ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏ రకంగా చూసినా  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది.   తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  నాదెండ్ల భాస్కరరావు  1935 జూన్ 23న  పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో రాణించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగిన భాస్కరరావుపై చదువుకునే రోజులలోనే రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు. హైదరాబాద్‌లో బీఏ పూర్తిచేసి, అక్కడే ఈవెనింగ్ లా కాలేజీలో బి.ఎల్. (LLB) పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1959లో  లలితని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంచి పేరు సంపాదించిన ఆయన, అదే సమయంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనంతరం ఇందిరా కాంగ్రెస్‌లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుండి 1989 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మర్రి చెన్నారెడ్డి,  టి. అంజయ్య మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించగా, 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భాస్కరరావుకి ఇద్దరు కుమారులు నాదెండ్ల మురళీ,  నాదెండ్ల మనోహర్. చిన్న కుమారుడు మనోహర్ 2004లో తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా, 2011 నుండి 2014 వరకు చివరి శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తరువాత 2018లో కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
ALSO ON TELUGUONE N E W S
Director Anil Ravipudi is gearing up for an exciting multi-starrer featuring Venkatesh Daggubati and Nandamuri Kalyanram in the lead roles. This project marks a significant reunion for Kalyanram and the director, who are teaming up after an 11-year gap since Anil's debut film, Pataas.  Additionally, this will be the fifth collaboration between Venkatesh and Anil, a combination that has consistently delivered box-office hits. The casting process is currently underway, and the director recently shared some exciting updates. During the recent LIK event, Anil officially confirmed that Krithi Shetty has been finalized as one of the female leads.  While she is set to share the screen with Kalyanram, the casting for the second female lead has also generated a lot of buzz. Reports strongly suggest that Keerthy Suresh will be starring opposite Venkatesh. Although her inclusion has not been officially announced by the makers yet, industry sources indicate she is locked in for the project.  The regular shoot for this highly anticipated film is expected to commence in June. Venkatesh and Keerthy Suresh will participate in the film's first schedule, which will begin right after Venkatesh wraps up his current project, AK47, directed by Trivikram Srinivas.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఫ్యాన్స్ ఎన్ని పనుల్లో ఉన్నా సరే పెద్ది అప్ డేట్ గురించి ఒక లుక్ వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్పెషల్ సాంగ్ కి సంబంధించి వినిపిస్తున్న ఒక హీరోయిన్ పేరుతో వాళ్లంతా ఉన్న పళంగా తన ఇష్టదైవాల్ని ప్రార్ధించే పరిస్థితి. అవసరమైతే ఎన్ని మొక్కులైనా మొక్కుకుంటారు. మరి అంత రేంజ్ గల హీరోయిన్ ఎవరో చూద్దాం. Also read: Dhurandhar: తెలుగు లాంగ్వేజ్ లో బుల్లితెరపైకి ధురంధర్.. ఛానల్ పేరు ఇదే   శృతి హాసన్(Shruti haasan).. ఈ ముద్దుగుమ్మ పేరునే పెద్ది స్పెషల్ సాంగ్ కి మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ శృతి కన్ఫర్మ్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే శృతి మోస్ట్ పవర్ గోల్డెన్ లెగ్. తను ఏ హీరో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ సినిమా సూపర్ హిట్. కావాలంటే తన ట్రాక్ రికార్డు చూసుకోవచ్చు. చరణ్, శృతి ఆల్రెడీ 'ఎవడు' తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.    
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ 'సబ్‌స్క్రిప్షన్' అనేది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీలు తమ ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను చూసేందుకు అభిమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) టాప్ గేర్‌లో దూసుకుపోతుండగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) కూడా ఈ బాటలోకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా అషూ షేర్ వేసిన సెటైరికల్ వీడియో మాత్రం విష్ణు ప్రియ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో విష్ణుప్రియపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పోలీస్ కంప్లైంట్లు కూడా నమోదయ్యాయి. అయినా విష్ణుప్రియ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. అయితే తాజాగా అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో వివాదానికి దారి తీసింది. "సబ్‌స్క్రైబర్స్.. గెట్ రెడీ ఫర్ మోర్ కంటెంట్, మోర్ వీడియోస్" అంటూ వెటకారంగా నవ్వుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు విష్ణు ప్రియను ఉద్దేశించి చేసిన సెటైర్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో విష్ణు ప్రియ అభిమానులు అషూపై ఫైర్ అవుతున్నారు. అషూ రెడ్డి కూడా 14 రోజుల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అంటూ ఆఫర్లు ఇస్తూ తన బిజినెస్ మొదలుపెట్టింది. ఇప్పటికే వందకు పైగా సబ్ స్క్రైబర్లు ఆమె ఖాతాలో చేరారు. విష్ణుప్రియ రేంజ్‌లో సబ్ స్క్రైబర్లను సంపాదించుకోవడానికి అషూ రెడ్డి కూడా అందాల ఆరబోతకు సిద్ధమవుతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి అషూ రెడ్డి నిజంగానే బోల్డ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేసిందా? లేక విష్ణుప్రియపై సెటైర్ కోసమే ఈ సబ్‌స్క్రిప్షన్ అంటూ హడావుడి చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. మునుముందు ఈ సబ్‌స్క్రిప్షన్ల గోల ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.   https://www.instagram.com/reel/DXZ2pvAE-sP/
తెలుగు సినీ వెండితెరపై నందమూరి వారసుల డైలాగ్ డెలివరీకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ తెరపై కనిపిస్తే ఆ గాంభీర్యం, ఆ గొంతులో ఉండే బేస్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరాములయ్య' సినిమాలో హరికృష్ణ నట విశ్వరూపం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక విప్లవ పోరాట యోధుడిగా హరికృష్ణ కనిపిస్తారు. పేదల కోసం, వ్యవస్థలోని అవినీతిపై పోరాడి, చివరికి ఉరిశిక్షకు సిద్ధపడే సన్నివేశం ఇది. చావు కళ్లముందు కనిపిస్తున్నా, అస్సలు బెరకకుండా ఆయన చెప్పే డైలాగులు థియేటర్లో ఈలలు వేయించేలా ఉన్నాయి. "ప్రజల కోసం పోరాడేవాడికి చావు ఒక లెక్క కాదు" అనే అర్థం వచ్చేలా సాగే సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా కోర్టు హాల్లోనూ, జైలులో ఉరి కంబం ఎక్కే ముందు అధికారులతో ఆయన సాగించే వాదనలు నేటి రాజకీయ పరిస్థితులకు కూడా అద్దం పట్టేలా ఉన్నాయి. "మీ చట్టాలు, మీ సెక్షన్లు సామాన్యుడిని అణచివేయడానికే తప్ప, న్యాయం చేయడానికి కాదు" అంటూ ఆయన గర్జించే తీరు హరికృష్ణలోని అసలైన నటుడిని పరిచయం చేస్తుంది. ఆ గొంతులో ఉండే ఆవేశం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సీన్‌లో హరికృష్ణ నటన కేవలం డైలాగులకే పరిమితం కాలేదు. ఆయన కళ్లలో కనిపించే తీక్షణత, శరీర భాష ఒక నిఖార్సైన విప్లవ నాయకుడిని తలపిస్తాయి. పక్కనే ఉన్న తోటి నటులు కూడా ఆయన నటనకు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "నందమూరి సింహం అంటే ఇలా ఉండాలి" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, హరికృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నేటి తరం హీరోలకు కూడా ఇలాంటి మాస్ డైలాగ్స్ చెప్పడం ఒక సవాల్ లాంటిదే. విప్లవాత్మక పాత్రలకైనా నందమూరి రక్తం పెట్టింది పేరు అని ఈ వీడియో నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. హరికృష్ణ అభిమానులు ఈ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆయన నటనా ప్రతిభను కొనియాడుతున్నారు. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే ఈ సీన్, తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాగా మిగిలిపోతుంది. ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగులతో కూడిన మరిన్ని వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
Riding high on the success of Karthikeya 2 and Thandel, director Chandoo Mondeti is ready to take things to the next level. He is currently developing an ambitious, large-scale thriller set against the ancient and culturally rich backdrop of Ujjain.  The script is said to be a highly atmospheric drama that perfectly blends historical elements with gripping mythological suspense. To match the grand vision of the story, a massive cross-industry collaboration is taking shape. Bollywood powerhouse Karan Johar will be producing this visual spectacle under his Dharma Productions banner.  On the casting front, Rana Daggubati is expected to play the lead, making him a perfect fit for this intense historical setup. Bollywood superstar Akshay Kumar has also been locked in for a highly significant role, elevating the project's scale even further.  Adding to the hype, the makers are currently in advanced talks to cast a third major hero. Designed as a true pan-India experience, this lavishly mounted project aims to combine the authentic storytelling of South Indian cinema with the massive commercial appeal of Bollywood.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. టాబ్లెట్ల మీద గీత.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట. గీతలు లేని టాబ్లెట్లు.. మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు. డిజైన్ మాత్రం కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.                                 *రూపశ్రీ.
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన  పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే  కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా,  రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే.. ఇది గుర్తుపెట్టుకోవాలి.. మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క  కలపాలి. పరిశుభ్రత.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు  రుచిని,  ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.. పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం  ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.  వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. తీపి పెరుగు.. కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు.  తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు,  ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం,  సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.                               *రూపశ్రీ.
తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం  పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా?  అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.  విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే..  ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు.  ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ..  రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.  తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది.  మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు.   మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో  వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై   పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది.   గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.   విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో  పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత  స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.    శ్రీకాకుళం జిల్లాలో  వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో  పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.    ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏ రకంగా చూసినా  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది.   తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  నాదెండ్ల భాస్కరరావు  1935 జూన్ 23న  పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో రాణించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగిన భాస్కరరావుపై చదువుకునే రోజులలోనే రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు. హైదరాబాద్‌లో బీఏ పూర్తిచేసి, అక్కడే ఈవెనింగ్ లా కాలేజీలో బి.ఎల్. (LLB) పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1959లో  లలితని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంచి పేరు సంపాదించిన ఆయన, అదే సమయంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనంతరం ఇందిరా కాంగ్రెస్‌లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుండి 1989 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మర్రి చెన్నారెడ్డి,  టి. అంజయ్య మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించగా, 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భాస్కరరావుకి ఇద్దరు కుమారులు నాదెండ్ల మురళీ,  నాదెండ్ల మనోహర్. చిన్న కుమారుడు నాదెండ్ల మనోహర్ 2004లో తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా, 2011 నుండి 2014 వరకు చివరి శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తరువాత 2018లో కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి, పార్టీ పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. 2024లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున గెలిచి, ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏలూరు జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నారు.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని  వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.  ముఖ్య అంశాలు: శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.  బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది. మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు,  ఆరోగ్యం,  రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ  అర్థమవుతుంది. ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం.. ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏఐ బలహీనత.. జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట.  ఈ ఏఐ ప్లాట్పామ్ లలో  ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట. తప్పుడు సమాధానాలు.. ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల  మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని,  సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు. గమనిక.. పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.                             *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.