జీన్స్ కొనేముందు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి!
ఇప్పటికాలం అమ్మాయిలు వస్త్రాధరణ విషయంలో అబ్భాయిలకు ఏమీ తీసిపోవడం లేదు. అబ్బాయిలతో సమానంగా చక్కగా జీన్స్ ధరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు రెగులర్ గా ధరించడానికి జీన్స్ నే ఎంచుకుంటున్నారు. అయితే జీన్స్ కొనేముందు చాలా సందేహాలు వస్తాయి. వాటిలో జీన్స్ నాణ్యత నుండి కంఫర్ఠ్, ఫ్యాషన్ వరకు బోలెడు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలివీ..
సైజ్..
జీన్స్ కొనుగోలు చేసినప్పుడు, సైజ్ ను బట్టి జీన్స్ ఎంచుకోవడానికి ముఖ్యం.అయితే ఈ సైజ్ జీన్స్ బ్రాండ్‌లు, శైలులను బట్టి మారుతుంటుంది, కాబట్టి మీ సైజ్ కొలవడానికి టేప్ కొలతను ఉపయోగించాలి. దీనికి అనుగుణంగా జీన్స్‌ని ఎంచుకోవాలి.
స్టైల్
స్టైల్ ఎప్పుడు ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే జీన్స్ వివిధ స్టైల్స్, కటింగ్స్‌లో లభిస్తున్నాయి. మీ స్టైల్ ను బట్టి జీన్స్ ను ఎంచుకోవడం మరచిపోకండి.
క్వాలిటీ..
జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు , దాని నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖరీదైన జీన్స్ ఎప్పుడూ మంచి నాణ్యతతో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే చవకగా దొరికే జీన్స్ ను తీసిపారేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డబ్బు, నాణ్యత రెండింటినీ గుర్తుంచుకోవాలి. క్వాలిటీ జీన్స్ ధరించడం ద్వారా మాత్రమే మీరు సౌకర్యాన్ని పొందవచ్చు.
కలర్స్ క్రష్..
మీరు జీన్స్ కు ఇచ్చే ప్రాధాన్యత, ఉపయోగించే విధానం ప్రకారం ముదురు నీలం, లేత నీలం, నలుపు, స్టోన్‌వాష్ వంటి జీన్స్ రంగులను ఎంచుకోవచ్చు.
వాషింగ్ విధానం..
ప్రతి రకం వస్త్రానికి ఒకో విధమైన వాషింగ్ స్టైల్ ఉంటుంది. జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు, వాటిని ఎలా వాష్ చేయాలో తెలుసుకోవాలి. కొన్ని జీన్స్‌ని చేతితో ఉతకవచ్చు, మరికొన్ని డ్రై క్లీన్ చెయ్యాల్సి ఉంటుంది. చాలా జీన్స్‌లో వాషింగ్ మెషీన్‌లో ఉతకడం సాధ్యం కాదు. కాబట్టి కొనుగోలు చేయబోయే జీన్స్ ఎలా వాష్ చేయాలో ముందే తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.
*నిశ్శబ్ద.