మహిళలు కుర్తా కొనడానికి కొన్ని లెక్కలున్నాయి!

ప్రస్తుత కాలంలో దుస్తుల ఎంపిక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళలు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు బోలెడు విషయాలు దృష్టిలో ఉంచుకుంటారు. మహిళలు ధరించే దుస్తులలో కుర్తాలు ప్రసిద్ధి చెందాయి. కుర్తాలు ధరించడం అటు ఫ్యాషన్ గానూ, మరోవైపు నిండుగానూ ఉంటుంది. అయితే కుర్తా కొనుగోలు చేసేటప్పుడు, కుర్తా గురించి అనేక విషయాలు అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా కుర్తాను కేవలం ప్యాంటుతో ధరించే కాలం కాదు ఇది. ఈ కారణంగా  ప్లాజో, జీన్స్, స్కర్టులు, ప్యాంటులలో దేనితో కుర్తాను ధరిస్తారు అనే విషయాన్ని బట్టి కుర్తాను ఎంపిక చేసుకోవాలి. . లేటెస్ట్ ట్రెండ్ లో ఎక్కువగా ఇష్టపడుతున్న కుర్తా ఏదైనా ఉందంటే అది A-లైన్ కుర్తా. ఇది చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది. అలాగే  మహిళలు చాలా సౌకర్యంగా ఉంటారు. 

కుర్తా కొనుగోలు చేసే ప్రతి మహిళ.. ఎలాంటి కుర్తా కొనాలని అనుకుంటుందో ముందే నిర్ణయించుకోవడం ముఖ్యం.  నిజానికి, పర్ఫెక్ట్ కుర్తా మహిళల రూపాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు, కుర్తా సరిగ్గా లేకుంటే అది మహిళల రూపాన్ని పాడు చేస్తుంది. కుర్తా సరైన విధంగా ఎంపిక చేసుకోవడానికి ఈ విషయాలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. 

ఫాబ్రిక్..

కుర్తాను కొనుగోలు చేసేటప్పుడు, దాని ఫాబ్రిక్‌పై విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  కుర్తా ఎల్లప్పుడూ వాతావరణానికి అనుగుణంగా కొనుగోలు చేయాలి. కుర్తా ఫాబ్రిక్ చాలా తేలికగా ఉంటే అది ఎక్కువ కాలం ఉండదు. అదే సమయంలో, అది చాలా మందంగా ఉంటే, అది వేడెక్కుతుంది.

స్టైల్..

కుర్తాల షేప్స్ చాలా విభిన్న రకాలు ఉన్నాయి. స్టేట్‌మెంట్ లుక్ కావాలంటే, సింపుల్ ఎ-లైన్ కుర్తా బెస్ట్. అయితే, ఎవర్ గ్రీన్ లుక్ కావాలనుకునే మహిళలు క్లాసిక్ అనార్కలీ లేదా అంగ్రాఖా స్టైల్‌ను ఎంచుకోవచ్చు. ఇవి చాలా క్లాస్ గా కనిపిస్తాయి.

పొడవు..

కుర్తాలు చూడటానికి వేసుకోవడానికి బానే అనిపించినా తీరా కుర్తా తో ధరించే ప్యాంట్, లేదా ప్లాజో మొదలైన వాటి కారణంగా దాని అందమంతా చెడిపోతుంది. కాబట్టి కుర్తా దేనికి సెట్ గా తీసుకుంటున్నారో ముందే దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. పొడవాటి కుర్తా ప్లాజో లేదా స్ట్రెయిట్ ప్యాంట్‌తో వెళ్తే, సల్వార్‌తో చాలా వింతగా కనిపిస్తుంది.

ఫిట్టింగ్‌ని నిర్లక్ష్యం చేయవద్దు

కుర్తా ఫిట్టింగ్‌ను లైట్ తీసుకుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టే. కుర్తా డిజైన్ ఎంత బాగున్నా, దాని ఫిట్టింగ్ బాలేకుంటే మాత్రం వింతగా కనిపిస్తుంది.

రంగు

 కుర్తా రంగు ఎప్పుడూ తటస్థంగా ఉండాలి.  ప్రకాశవంతమైన కుర్తా ధరించడం మేకప్, నగల రూపాన్ని డామినేషన్ చేస్తుంది.


                                     ◆నిశ్శబ్ద.