శీతాకాలంలో కూడా స్ట్రైలిష్ గా కనిపించాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..!
.webp)
చలికాలం వచ్చేసింది. చలి అనగానే అమ్మాయిలు చర్మం గురించి చాలా భయపడతారు. ఒకవైపు చర్మాన్ని సంరక్షించుకుంటూనే మరొకవైపు స్టైలిష్ గా కూడా కనిపించాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా కాలేజ్, ఆఫీస్ లకు వెళ్లే అమ్మాయిలు, మహిళలు, వ్యాపారం చేసే మహిళలు చాలా అందంగా కనిపించడం కూడా చాలా ముఖ్యం. ఈ శీతాకాలంలో అటు చర్మాన్ని కాపాడుకుంటూ ఇటు ఫ్యాషన్ గా, స్టైల్ గా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..
స్మార్ట్ లేయరింగ్..
శీతాకాలంలో స్టైలిష్ గా కనిపించడానికి మంచి మార్గం స్మార్ట్ లేయరింగ్. బాగా మందంగా ఉన్న దుస్తులకు బదులుగా తేలికైన, ఫిట్టెడ్ లేయర్‌లను ఎంచుకోవాలి. కింద చొక్కా లేదా టర్టిల్‌నెక్ ధరించి, దానిపై బ్లేజర్ లేదా లాంగ్ కోటు వేసుకోవాలి. ఇది సూపర్ లుక్ క్రియేట్ చేస్తుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
రంగులు..
ఆఫీసులో ప్రొఫెషనల్ లుక్ కంటిన్యూ కావాలంటే లేత గోధుమరంగు, బూడిద రంగు, గోధుమ రంగు, నలుపు వంటి టోన్‌లను ఎంచుకోవాలి. ఈ రంగులు హైలేట్ గా కనిపించడమే కాకుండా ఇతర ఏ కాంబినేషన్ రంగుకైనా సులభంగా సరిపోతాయి. ముఖ్యంగా బ్లేజర్ కొంటుంటే పైన చెప్పుకున్న రంగులను ఎంచుకోవడం మేలు.
స్కార్ఫ్ లు, శాలువాలు..
స్కార్ఫ్‌లు, శాలువాలు శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి మాత్రమే కాదు.. మొత్తం లుక్‌కి సెంటరాఫ్ అట్రాక్షన్ గా కూడా ఉంటాయి. దుస్తులకు స్టైల్ జోడించడానికి సిల్క్ లేదా ఉన్ని ఫాబ్రిక్‌తో ప్రింటెడ్ స్కార్ఫ్‌ను ఎంచుకోవాలి. శాలువాను మంచి ఫ్యాషన్ స్టైల్స్ లో ధరించడం వల్ల మార్గాల్లో ఫ్యాషన్ సెన్స్ పెరుగుతుంది.
క్లాసిక్ పుట్ వేర్..
ఆఫీసు లుక్‌లో ఫుట్‌వేర్ ఒక ముఖ్యమైన భాగం. శీతాకాలంలో లెదర్ బూట్లు, లోఫర్‌లు లేదా క్లోజ్డ్ హీల్స్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా ట్రెండీగా కూడా ఉంటాయి. నలుపు లేదా లేత గోధుమ రంగు ఫుట్‌వేర్ ప్రతి దుస్తులకు సరిపోతుంది. లుక్ కంప్లీట్ గా సూపర్ గా కనిపించడానికి బూట్లు శుభ్రంగా, పాలిష్ చేసుకుని ధరిస్తే సూపర్ గా కంప్లీట్ లుక్ సొంతమవుతుంది.
మేకప్, జ్యువెలరీ..
ఆఫీసులో భారీ మేకప్ లేదా అతిగా జ్యువెలరీ వేసుకోకూడదు. అతిగా వెళ్లే బదులు లైట్ గా ఫౌండేషన్, న్యూడ్ లిప్‌స్టిక్, కొద్దిగా మస్కారా సరిపోతుంది. జ్యువెలరీ అయితే చిన్న స్టడ్‌లు, వాచ్ లేదా సన్నని గొలుసును ఎంచుకోవాలి. ఇది లుక్‌ను ప్రొఫెషనల్‌గా, అట్రాక్షన్ గా ఉంచుతుంది.
*రూపశ్రీ.


.webp)
