వంటసోడాతో నమ్మలేని ఉపయోగాలు...!

మాములుగా మనం వంటసోడాను వంటల్లో వాడుతుంటాం. కానీ వంట సోడా వలన అసలు ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా? మరింకెందుకు ఆలస్యం వంటసోడా ఉపయోగాలు ఒకసారి చూద్దామా...!

* ఆమ్లెట్ ఉబ్బినట్లుగా రావాలంటే గుడ్డుసొనలో చిటికెడు వంటసోడా కలపాలి. అలాగే కేక్ తయారీలోనూ ఉపయోగించవచ్చు.

* బజ్జీలు,పకోడీలు లాంటివి కరకరలాడాలంటే, వాటి తయారీలో చిటికెడు వంటసోడా కలిపితే సరిపోతుంది.

* స్నానాల గదిలో అద్దాలపైన పడిన నీటి మరకలను తొలగించాలంటే... వంటసోడా సోడాలో నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి దూదితో అద్దాన్ని తుడవాలి. తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.

* బకెట్ నీళ్ళలో చెంచా వంటసోడా వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి.

* ఫ్లవర్ వాజ్ లో పూలు ఎక్కువ రోజులు తాజాగా వుండాలంటే నీళ్ళల్లో చిటికెడు వంటసోడా కలపాలి.

* సాక్సుల దుర్వాసన దూరం చెయ్యాలంటే వంటసోడా కలిపిన నీటితో వాటిని నానబెటట్టి, వాటిని ఉతకాలి.

* చెక్క ఫర్నిచర్ పై పడిన పదార్దాల మరకలు పోగొట్టాలంటే ... ఒక మగ్గు నీటిలో చెంచా వంటసోడా వేసి, మరకలు పడిన చోట ఈ నీటితో తుడిస్తే సరిపోతుంది.

* చెమట వాసన దూరం కావాలంటే.. కొన్ని నీటిలో పావు చెంచా వంటసోడా కలిపి చల్లుకోండి. చెమట దుర్వాసన దూరమవుతుంది.

* దంతాలు పచ్చగా ఉంటే టూత్ పేస్ట్ పై చిటికెడు వంటసోడా వేసుకుని తోముకోండి. దంతాలు మిలమిలా మెరుస్తాయి.

* నోటి దుర్వాసన ఇబ్బంది పెడితే... గ్లాసు నీటిలో రెండు చెంచాల వంటసోడా కలిపి పుక్కిలించాలి. దీనివల్ల నోరు రోజంతా తాజాగా వుంటుంది.

*వస్త్రాలను శుభ్రం చేయడానికి వంటసోడా బాగా ఉపయోగపడుతుంది. గ్రీజు మరకలైతే ఆ ప్రాంతంలో వంటసోడా చల్లి రుద్ది చూడండి. క్షణాల్లో మరక మాయం.