మీ ఇంట్లో సీసాలు ఎక్కువగా వాడనివి ఓ పక్కన పెట్టేసారా? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే అలాంటి వాటిని బయటకు తియ్యండి. వాటితోనే మీ ఇంటికి వాతావరణాన్ని మార్చే విధంగా తయారుచేసుకోవచ్చు.

 

మనం మాములుగా మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. దీనివల్ల మన ఇంటికి కాస్త అందం వస్తుంది. కానీ ఈ సీసా గాజుపాత్రలలో మొక్కలను పెంచడం వల్ల మన ఇంటికి మరింత అందం వస్తుంది. అయితే ఈ గాజు పాత్రలకు చిన్న ఇటుక ముక్కలు, బొగ్గు పొడి , మట్టి తీసుకొని, వీటిని ఒకదాని తర్వాత ఒకటిగా పొరల్లాగా వెయ్యాలి. తర్వాత మనం ఎంచుకున్న మొక్కలను పెట్టుకోవాలి. అదనపు ఆకర్షణ కోసం ఈ గాజుపాత్రలో రంగుల గులక రాళ్ళు, గావ్వల్లాంటివి అలంకరించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన మన ఇంటి అందం మరింత రెట్టింపు అవుతుంది. అదే విధంగా గాజు పాత్రలు కూడా వృధా కాకుండా పోతున్నాయి.