ఈ సీరమ్ ఇంట్లోనే తయారుచేసుకుని వాడండి.. ముఖం బంగారంలా మెరుస్తుంది..!

 


అందం కోసం ఆరాటపడని అమ్మాయి ఉండదు. ఉన్న వయసు కంటే చిన్నగా కనిపించాలని,  ముఖం మీద ఎటువంటి ముడతలు, మచ్చలు లేకుండా చర్మం క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.  దీనికోసం చాలా రకాల చిట్కాలు కూడా ఫాలో అవుతుంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే క్రీములు, సీరమ్ లు ఈ కాలం అమ్మాయిలు చాలా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల కలిగే  ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటాయి.  కానీ ఇంట్లోనే సీరమ్ ను తయారు చేసుకుని వాడితే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ అదేం సీరమ్.. దాన్ని ఎలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే..


టర్మరిక్ సీరమ్..


పసుపు చర్మానికి అద్బుతంగా పనిచేస్తుంది.  ప్రాచీన ఆయుర్వేదం నుండి నేటి కాలం శాస్త్రీయ వైద్యం వరకు పసుపు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు.  ముఖ్యంగా పచ్చి పసుపును సౌందర్య సాధనంగా ఎక్కువగా ఉపయోగిస్తారు.  పసుపులో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి చర్మానికి మేలు చేస్తాయి.  చర్మం బంగారంలాగా మెరవాలంటే టర్మరిక్ సీరమ్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు..


కావలసిన పదార్థాలు..


పసుపు సీరమ్ తయారు చేసుకోవడానికి..

ఒక చెంచా బాదం నూనె..

రెండు స్పూన్ల అలోవెరా జెల్..

గ్లిజరిన్.. ఒక చెంచా..

స్వచ్చమైన పసుపు.. అర చెంచా..

రోజ్ వాటర్.. కొద్దిగా

విటమిన్-ఇ క్యాప్సూల్.. ఒకటి


తయారీ విధానం..


పసుపు సీరమ్ ను తయారు చేయడానికి ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా బాదం నూనె వేయాలి.  అందులోనే రెండు స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి.  దీంట్లోనే స్వచ్చమైన పసుపు అర చెంచా వేయాలి. ఒక చెంచా  గ్లిజరిన్ కలపాలి. ఇందులో ఒక క్యూప్సూల్ విటమిన్-ఇ  నూనెను కలుపుకోవాలి.   వీటన్నింటిని మిక్స్ చేసి ఈ మిశ్రమం సీరమ్ లాగా ఉండేలా అందులో రోజ్ వాటర్ కొద్దిగా కలపాలి.   మిశ్రమం బాగా మిక్స్ చేశాక సీరమ్ రూపంలోకి వచ్చిందని అనిపించాక దీన్ని ఒక కంటైనర్ లో వేసుకుని భద్రపరుచుకోవాలి. పసుపు సీరమ్ వాడటానికి రెఢీగా ఉన్నట్టే..


ఎలా వాడాలి?

పసుపు సీరమ్ వాడటం చాలా సులభం.  రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  తరువాత ముఖాన్ని తడి లేకుండా పొడి టవల్ తో తుడుచుకోవాలి.  రెండు చుక్కల పసుపు సీరమ్ ను ముఖ చర్మం మీద డ్రాప్స్ లాగా వేసుకుని ముఖమంతా అప్లై చేసుకోవాలి.  రాత్రంతా దీన్ని అలాగే ఉంచుకుని ఉదయాన్నే సాధారణంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ప్రయోజనాలు..


పసుపు సీరమ్ ను రాత్రి సమయంలో ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటే  ముఖం మీద మచ్చలు, మొటిమలు, మంగు,  ముఖం మీద ఉన్న గుంటలు వంటివన్నీ మెల్లగా తగ్గిపోతాయి.   ముఖం కాంతివంతంగా బంగారం లాగా మెరుస్తుంది. ఎంత ఖరీదైన క్రీములు వాడినా ఇవ్వని ఫలితాలను ఇది ఇస్తుంది.


                                                  *రూపశ్రీ.