చీమలు తినేస్తున్నాయా ...

 

 

స్వీట్ బాక్స్ కి చీమలు పడితే బుజ్జి బాబుకి ఏడుపొస్తుంది. అవి పొమ్మంటే పోవు. అమ్మ కర్రతో బెదిరించినా  పారిపోవు. ఇది అందరి ఇళ్ళల్లో ఉండే సమస్యే. ఇంట్లో వాడే పంచాదారకి,చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి    చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ  ఉంటే   కొన్ని మ్యాజిక్లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి. 


* పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.


* నల్ల చీమలు ఎక్కువగా ఉన్న చోట మెత్తని సాల్ట్ చల్లితే అవి వెంటనే పోతాయి.

 

* ఇంట్లో ఒక్కొక్క చోట చీమలు ఎక్కువగా ఉంటాయి,అలాంటి ప్లేస్ లో కిరోసిన్ చల్లితే ఫలితం ఉంటుంది.


* ఇంకో విచిత్రం ఏంటంటే దోసకాయ తొక్కల్ని చీమలు ఉన్న చోట పెడితే అవి అక్కడ నుంచి పారిపోతాయి.


* పంచదార,బెల్లం తో చేసిన వంటకాల డబ్బాలకి చీమలు పట్టకుండా ఉండాలంటే కంటైనర్ చుట్టూ ఆముదం రాస్తే మంచిది.


* తేనె  సీసాకి చీమలు పట్టకూడదు అనుకుంటే ఆ సీసాలో నాలుగు మిరియాలు వేసి చూడండి.

 

ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చీమల బెడద మటుమాయం అవుతుంది.

----కళ్యాణి