పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో కలిగే ఇబ్బందులకు భలే పరిష్కారాలు!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిజం చెప్పాలి అంటే పెళ్లిళ్లలో సందడి అంతా ఎక్కువ భాగం అమ్మాయిలదే.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మాయిలు దగ్గరి బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు తప్పనిసరిగా వెళతారు. ఇక పెళ్లిలో అట్రాక్షన్ గా కనబడటానికి చేయని ప్రయత్నాలు ఉండవు. పెళ్లికూతురుని తలదన్నేలా తయారయ్యే అతివలు ఎందరో.. ఇందుకోసం ముందుగానే దుస్తుల నుండి నెయిల్ పాలిష్ వరకు ప్రతిదీ కొనిపెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు డిజప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. దుస్తులకున్న జిప్పులు ఇరుక్కుపోవడం, బట్టలు మీద ఏదైనా పడటం, వేసుకునే చెప్పుల వల్ల అసౌకర్యం ఏర్పడటం జరుగుతాయి. దీనివల్ల మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అయితే కొన్ని టిప్స్ ఉపయోగించడం వల్ల ఈ టెన్సన్స్ ను సులువుగా అధిగమించవచ్చు.
దుస్తుల జిప్ లు ఇరుక్కుపోయినప్పుడు..
పెళ్లి సమయంలో చివరిగా డ్రస్సప్ అయ్యేటప్పుడు ఒక్కోసారి దుస్తులకున్న జిప్పులు ఇరుక్కుపోతుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో జిప్పును పదేపదే గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా చేస్తే జిప్ ఊడొచ్చే ప్రమాదం ఉంది. ఆ తరువాత ఏమీ చేయలేము. అందుకే అలాంటి సమయాల్లో జిప్ లాగకుండా కొవ్వొత్తి తీసుకుని జిప్ మీద రుద్దాలి. దీనివల్ల జిప్ స్మూత్ గా అవుతుంది. దీంతో జిప్ మూవ్ అవుతుంది.
బట్టలపై నూనె చిమ్మితే..
బట్టలపై నూనె చిమ్మితే వచ్చే సావు అంతా ఇంతా కాదు. జిడ్డు తగిలిన దుస్తులు వేసుకుని తిరగడం చాలా ఇబ్బంది. నూనె పడగానే దాన్ని రబ్ చేసి, సోప్ వేసి వాష్ చేయడానికి ప్రయత్నించకూడదు. నూనె పడగానే దానిమీద టాల్కమ్ పౌడర్ చల్లి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పౌడర్ పొడి బట్టల నుండి నూనెను పీల్చుకుంటుంది. ఆరిన తర్వాత దులిపేస్తే పౌడర్ తో పాటు జిడ్డు పోతుంది.
జుట్టు పలుచగా ఉందని బెంగా..
కొంతమందికి జుట్టు మరీ పలుచగా ఉంటుంది. తలమీద పాపిడి, మాడు ఎత్తినట్టు కనిపిస్తుంటాయి. నిజం చెప్పాలంటే దీన్ని మహిళల్లో బట్టతల సమస్యగా చెప్పొచ్చు. దీనికోసం మాట్ ఐషాడో బాగా పనిచేస్తుంది. జుట్టుకు దీన్ని అప్లై చేయడం వల్ల . జుట్టు ఒత్తుగా కనబడుతుంది.
హైహీల్స్ తో తంటాలా..
హైహీల్స్ అంటే అమ్మయిలకు ఇష్టం. అవి వేసుకుని హొయలు పోతుంటే పెళ్లి వేడుక అంతా హైలైట్ అవుతుంది. కానీ అటు ఇటు బాగా తిరుగుతున్నప్పుడు మడమలు లాగేస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కాలి వేళ్లపై స్ప్రేని చల్లుకోవచ్చు. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.
పాదాలకు ఎక్కువగా చెమట పట్టినట్లయితే
ఇప్పట్లో ఉన్న ఫ్యాషన్ చెప్పులు బోలెడు. వీటిలో పాదాలు కవర్ అయ్యేలా ఉన్నవి ఉంటయై. ఇవి వేసుకున్నప్పుడు వేళ్ళ మధ్య చెమట పడుతుంది. దీనివల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి చెప్పులుధరించే ముందు కాలి వేళ్లపై పౌడర్‌ను చల్లుకోవాలి. ఇలా చేస్తే సమస్య తొలగిపోతుంది.
◆నిశ్శబ్ద.