వేసవిని బీట్ చేయాలంటే ఈ లిప్స్టిక్ రంగులు బెస్ట్ ఆప్షన్!
సమ్మర్ కాస్తా హమ్మర్ తో మోదుతున్నట్టు ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు తేలికగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవాడనికి ప్రయత్నం చేస్తారు. చాలామంది సమ్మర్ షాపింగ్ అంటూ కాటన్ దుస్తులు కొనుగోలు చేస్తారు. వేసవికి తగ్గట్టు ఫేస్ వాష్ దగ్గర నుండి ఎన్నెన్నో మార్పులు వస్తాయి. అమ్మయిలలో దుస్తులతో పాటు మేకప్ కూడా సీజన్‌కు అనుగుణంగా మారే ముఖ్యమైన అంశం. ఈ సీజన్‌లో మేకప్ ఎక్కువ కాలం నిలువదు. అందుకే ఛేంజెస్ చేసుకుంటారు. ఈ మేకప్ కిట్ లో ఏదున్నా లేకపోయినా లిప్స్టిక్ మాత్రం కచ్చితంగా వాడతారు అమ్మాయిలు. సింపుల్ గా ఉండాలి అనుకునేవారు కూడా లిప్స్టిక్, కాజల్ తో సరిపెట్టుకుంటారు.
అయితే వేసవి సీజన్లో ఏ కలర్ లిప్స్టిక్ బాగుంటుంది అనే విషయం మీకు తెలుసా?? అమ్మాయిలు అందంగా కనిపించాలి అని, వాతావరణం కు తగ్గట్టు మార్పులు కూడా చేసుకుంటారు. కానీ లిప్స్టిక్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోకపోతే ఎంత బాగా తయారైనా లుక్ మొత్తం పాడైపోతుంది. వేసవిని బీట్ చేయడానికి అద్భుతమైన లిప్స్టిక్ రంగులు ఏవో తెలుసుకుంటే..
పీచ్ కలర్
పీచ్ కలర్ దాదాపు ప్రతి అమ్మాయికి ఇష్టం. ఈ సమ్మర్ సీజన్‌లో ఈ కలర్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయడం వల్ల మీ ముఖం వెలిగిపోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు ముదురు రంగు దుస్తులు వేసుకునేట్టు అయితే తో పీచ్ కలర్ లిప్స్టిక్ను భలేగా ఉంటుంది.
న్యూడ్ కలర్
న్యూడ్ కలర్ ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉంది. మెటాలిక్ దుస్తులలో బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే, ఖచ్చితంగా న్యూడ్ కలర్ లిప్స్టిక్ ను అప్లై చేయండి. ఈ రంగు చాలా అందంగా, ఆకర్షణగా ఉంటూ సహజత్వంగా కూడా అనిపిస్తుంది.
బ్రౌన్ కలర్
ఈ కలర్ లిప్ స్టిక్ అన్ని రకాల స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలు అప్లై చేయవచ్చు. అయితే దీన్ని అప్లై చెయ్యడానికి కొందరు ఇష్టపడరు. కానీ సమ్మర్ లో ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అందుకే వేసవిలో ఈ రంగు బెస్టు.
ప్లం కలర్
ప్లం కలర్ నిజంగా అద్బుతమైనది. ఈ రంగు లిప్స్టిక్ ను విదేశీ దుస్తుల నుండి భారతీయ వస్త్రధారణ వరకు అన్నిటికీ అనువుగా అట్రాక్షన్ గా ఉంటుంది.
పింక్ షేడ్
కొన్ని లిప్స్టిక్ రంగులు చిన్నవారికి బాగుంటే, మరికొన్ని పెద్దవారికి నప్పుతాయి. అయితే పింక్ షేడ్ లిప్ స్టిక్ అన్ని వయసుల మహిళలు అప్లై చేయవచ్చు. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం గ్లో సాధారణం కంటే ఎక్కువ పెరుగుతుంది.
లిప్స్టిక్ అలవాటు ఉన్న వారు ఈ సమ్మర్ ను బీట్ చేయడానికి ఈ రంగులు ఎంచుకుంటే ఎండలో కూడా అదరహో అనిపిస్తారు.
◆నిశ్శబ్ద.