పొట్టిగా ఉన్న అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో చేసే తప్పులివే!
ఇప్పటికాలం అమ్మయిలలో పొట్టి వాళ్లకు ఉన్న కష్టాలు మరెవ్వరికీ ఉండవు. ట్రెండీగా, ఫాషన్ గా ఉండాలని అనుకుంటారా?? దుస్తుల దగ్గర నుండి ఎన్నో విషయాలు వారి పొట్టిదనాన్ని మరింత ఎత్తినట్టు చూపిస్తుంటాయి. ఇది అందరికీ జరుగుతుందా అంటే ఉహు లేదు. అవగాహన లేకపోవడం వల్ల కొందరి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు హీల్స్ వేసుకుంటే పొడుగ్గా కనిపించవచ్చు అనుకుంటారు. కానీ హీల్స్ వేసుకోవడమే పరిష్కారం కాదు. దుస్తుల సెలక్షన్ లో చేసే పొరపాట్లు గమనించుకోవాలి. పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొరపాటున కూడా ఈ కింద చెప్పే విధంగా దుస్తులు ధరించకూడదు.
చాలా వదులుగా ఉన్న దుస్తులు నేటి కాలం ఫ్యాషన్ లో భాగం. అయితే ఇలాంటి దుస్తులకు పొట్టిగా ఉన్న అమ్మాయిలు దూరంగా ఉండటమే మంచిది. బాగా వదులుగా ఉన్న దుస్తుల్లో అమ్మాయిలు చిన్న పిల్లల్లా కనబడతారు.
స్కర్టులు వేసుకోవడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. కానీ పొట్టిగా ఉన్న అమ్మాయిలు మోకాళ్ళ వరకు ఉన్న స్కర్టులు వేసుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు. కేవలం ఇవే కాదండోయ్ మోకాలి కంటే కాస్త పొడవునా దుస్తులను ధరించినా ఇదే సమస్య ఎదురవుతుంది.
పొట్టిగా ఉన్న అమ్మాయిలకు ఉన్న మరొక ముప్పు లోవెయిస్ట్ జీన్స్. ఇలాంటి జీన్స్ వేసుకుంటే ఎంత పొడవున్నారో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కారణంగా పొట్టిదనం ఎక్కువగా అప్పియర్ అవుతుంది.
కార్గో ప్యాంట్లు కూడా అమ్మాయిల పాలిట శత్రువులనే చెప్పవచ్చు. ఇవి వదులుగా ఉండటం వల్ల పొడవు తక్కువగా కనబడేలా చేస్తాయి.
పొడవుగా కనబడాలనే ఆలోచనతో హై హీల్స్ వేసుకున్నా పైన చెప్పిన దుస్తులను సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎంత ఎత్తు చెప్పులేసినా పొడవు కనబడకపోగా.. మరింత పొట్టిగా కనిపిస్తారు.
◆నిశ్శబ్ద.