గులాబీ రంగు పెదాలు.. ఒత్తైన కనురెప్పలు.. ఇదిగో ఈ చిట్కాలతో మీ సొంతం..!
అందంగా కనిపించడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం వందల నుండి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ చిన్న చిన్న ఇంటి చిట్కాల సహాయంతో అందాన్ని పెంచుకోగలిగినప్పుడు డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి? కనురెప్పలు మందంగా ఉండాలన్నా లేదా పెదాలను గులాబీ రంగులోకి మార్చాలన్నా. చాలా రకాల ఆయిల్స్, సీరమ్ లు, లిప్ బామ్ లు, లిప్ స్క్రబ్ లు వాడుతుంటారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తో గులాబీ పెదాలను, ఒత్తైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు.
బొద్దుగా, లేతగా ఉండే పెదాల కోసం..
ప్రతి అమ్మాయి తన పెదవులు చిన్నపిల్లల లాగా మృదువుగా, గులాబీ రంగులోకి మారాలని కోరుకుంటుంది. ఇందుకోసం పెదవులకు వివిధ రకాల లిప్ బామ్‌లను అప్లై చేస్తుంటారు. ఇలా చేసిన తర్వాత కూడా నల్లగా, పగుళ్లతో ఉంటే పెదవులకు కింద ఇవ్వబడిన స్ర్కబ్ ను ఉపయోగించాలి.
కొద్దిగా పెట్రోలియం జెల్లీ, విటమిన్ ఇ ఆయిల్, కొబ్బరి నూనె, బేబీ ఆయిల్‌ను చిన్న సీసాలో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు దీన్ని రోజూ మీ పెదాలపై అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఇది పెదాలను మృదువుగా, బొద్దుగా మార్చుతుంది.
మందంపాటి కనుబొమ్మలు, కనురెప్పలు..
మందపాటి కనురెప్పలు, కనుబొమ్మలు కావాలని కోరుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇవి ముఖ సౌందర్యానని మరింత ద్విగుణీకృతం చేస్తాయి. కనుబొమ్మలు, కనురెప్పలు పలుచగా ఉంటే వాటిని మందంగా మార్చడానికి ఒక మ్యాజిక్ టిప్ ఉంది.
పెట్రోలియం జెల్లీ, ఆలివ్ నూనెను ఒక కంటైనర్‌లో కలపాలి. మీ దగ్గర ఖాళీ మాస్కరా బాటిల్ ఉంటే ఆయిల్ మిశ్రమాన్ని బాలిల్ లో నింపాలి. ఆ తరువాత దాన్ని ఉపయోగించాలి.
పొడవాటి గోర్లు..
గోర్లు పొడవుగా మంచి ఆకారంలో ఉంటే చేతి వేళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. వీటికి గోరింట లేదా నెయిల్ పాలిష్ వంటివి పెడితే ఆ చేతి అందం అంతా ఇంతా కాదు. కానీ చాలా మందికి గోర్లు పదే పదే విరిగిపోతుంటాయి. గోర్లు పొడవుగా, మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే రెండు వస్తువులు ఉపయోగించి మంచి నెయిల్ మసాజ్ జెల్ తయారు చేయవచ్చు. ఇందుకోసం పెట్రోలియం జెల్లీ, బేబీ ఆయిల్ రెండూ మిక్స్ చేయాలి. దీన్ని ఒక కంటైనర్ లో నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని గోర్ల మీద రాసి రోజూ సున్నితంగా మసాజ్ చేయాలి. గోర్లు బలంగా మారతాయి. పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
క్లియర్ స్కిన్ కోసం..
ప్రతి ఒక్కరూ శుభ్రమైన మచ్చలు లేని మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. మార్కెట్ ఉత్పత్తులు క్లియర్ స్కిన్ ను చేకూరుస్తాయని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే.. వీటిలో రసాయనాలు కాలక్రమంలో చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి. అందుకో ఇంటి చిట్కాలు ఉత్తమం.
ఒక గిన్నెలో పసుపు, తేనె, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. సమయం ముగిసిన తర్వాత ముఖం కడిగేయాలి. ఈ టిప్ చాలా బాగా సహాయపడుతుంది. చర్మానికి మెరుపు ఇస్తుంది. చర్మం మీద మచ్చలు, మొటిమలు పోగొడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ మాత్రమే కాకుండా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కగా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖం క్లిస్టర్ క్లియర్ గా మారుతుంది.
*రూపశ్రీ.