టి-జోన్ అంటే 

 


టి-జోన్ గురించి, అక్కడ వచ్చే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన తప్పనిసరి అంటున్నారు కస్మెటాలజిస్ట్టులు. నుదురు, ముక్కు, గడ్డం మధ్య భాగం కలిస్తే అంగ్ల అక్షరం 'టి' లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని టి-జోన్ అంటారు. ఈ ప్రాంతం చాలా సున్నితంగా వుంటుంది. ముఖ్యంగా చర్మం జిడ్డుతత్వం కలవారు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే 

* బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, స్కిన్ పగుళ్ళు, పిగ్మేంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే 

* రోజు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. క్లేన్సర్, టోనర్ లతో కడిగితే మంచి ఫలితం వుంటుంది.

* బ్లాక్ హెడ్స్ పోవటానికి వారానికి రెండు సార్లయినా నలుగు పెట్టుకోవాలి. సున్నితంగా బ్లాక్ హెడ్స్ పోయేలా రుద్దాలి.

* వాటర్ బెసేడ్ మయిశ్చరైజర్ కానీ, నైట్ క్రీమ్ కానీ వాడితే మంచిది.

* ముఖ చర్మం మీది మృతకణాలు పోయేలా నెలకోసారన్నా స్కిన్ పాలిషింగ్ చేయించుకుంటే మంచిది.

* టి-జోన్ ఆరోగ్యంగా అందంగా  ఉండాలంటే సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సన్ స్కిన్ లోషన్ వాడాలి.  
-రమ