అలసిపోయినపుడు అందరు కూడా ఏదో ఒక జూస్, లస్సీ, లేదా చెరుకురసం లాంటివి తాగుతుంటారు. కానీ చెరుకు రసం తాగకుండా దానితో ఫేషియల్ చేసుకుంటే అలసట అనేది తగ్గుతుంది తెలుసా?
చెరకు రసంలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమవుతాయి. అయితే గ్లైకోలిక్ యాసిడ్‌తో ఎలాంటి హాని కలగబోదని వైద్యులు అంటున్నారు.
ఇది ఎలా పని చేస్తుందంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది.