మీకు ముత్యాలంటే ఇష్టమా? అయితే ఇవి మీతో ఉండాల్సిందే..!

ఆడవాళ్లు అందంగా కనబడటానికి బోలెడు అలంకారాలున్నాయి. దుస్తులు, ఆభరణాల దగ్గర నుండి చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఇలా చాలా ఆడవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆభరణాలలో తప్పకుండా నవరత్నాలలో ఏదో ఒకటి పొదిగి ఉంటుంది. అయితే సముద్రపు అట్టడుగున ఏళ్ల తరబడి ఏర్పడే ముత్యాలకు మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఉంది. చాలామంది ఆడవారికి ముత్యాలంటే చాలా ఇష్టం. సాధారణం బంగారు, ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలకు బదులు ముత్యాలతో చేసిన ఆభరణాలు వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే ముత్యాలంటే ఇష్టపడే మగువలు ఈ కింది నాలుగు రకాల ముత్యాల ఆభరణాలు తప్పనిసరిగా తమ ఆభరణాల లిస్ట్ ఉంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఈ నాలుగు ఉంటే చాలు.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ప్రత్యేకవేడుక అయినా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అవేంటో ఓ లుక్కేస్తే..

ముత్యాల చెవి రింగులు..

అమ్మాయిలు చెవికి పెట్టుకునే రింగుల విషయంలో చాలా తర్జభర్జన పడతారు. ముత్యాలు పొదిగిన చెవి రింగులు ధరిస్తే చాలా అందంగా కనబడతారు. ఈ లిస్ట్ లో ముత్యాల డ్రాప్, స్టడ్ లు, హోప్స్ ఇలా.. చాలా రకాల మోడల్స్ మార్కెట్లో  విరివిగా దొరుకుతాయి. ఇవి ప్రత్యేక సందర్భాలలో అయినా, డైలీ ధరించడానికి అయినా ఏ విధంగా అయినా బాగుంటాయి. ఇక ఫ్యాషన్ దుస్తులు అయినా, సంప్రదాయ దుస్తులైన చీర, పట్టు పరికిణి వంటి వాటిలోకి అయినా చాలా బాగా నప్పుతాయి.

ఉంగరం..

ముత్యాల మీద ఇష్టం ఉన్నవారు ముత్యం పొదిగిన ఉంగరం ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ముత్యాలు ధరిస్తే హుందాతనం ఉట్టిపడుతుంది.ఈ ముత్యాల ఉంగరాలు ఇప్పటి కాలం ఫ్యాషన్ దుస్తులకే కాకుండా అమ్మమ్మల కాలం నాటి దుస్తులు, అప్పటి సంప్రదాయ వస్త్రధారణకు కూడా బాగా సెట్ అవుతాయి. ఇక ఈ ముత్యపు ఉంగరాలు డార్క్ కలర్ ఉన్న దుస్తులతోనూ,  సింపుల్ గా ఉన్న బ్యాగ్ లు, వాలెట్లతోనూ చాలా అట్రాక్షన్ గా కనిపిస్తాయి.

బ్రెస్లెట్..

సాధారణంగా బంగారు, వెండి బ్రెస్లెట్లు అబ్బాయిలకే ఎక్కువగా నప్పుతుంటాయి. అమ్మాయిలు సింవుల్ గా ఉంటూనే గ్రాండ్ లుక్ లో కనిపించాలంటే ముత్యాల బ్రెస్లెట్ చాలా బాగా సెట్ అవుతుంది. దీని వల్ల ధరించిన డ్రస్ మరింత ఆకర్షణగా మారుతుంది. సాంప్రదాయ దుస్తులలోనూ, ఆఫీసుకు వెళ్లే ఔట్ ఫిట్ లోనూ, సాధారణ దుస్తులలోనూ క్లాసీ లుక్ ఇస్తుంది ముత్యాల బ్రెస్లెట్.

ముత్యాల లాకెట్..

ఇప్పట్లో చాలా రకాల నెక్ డాలర్స్ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిల సింపుల్ లుక్ తో అందరి మతి పోగాట్టాలంటే మాత్రం ముత్యాల లాకెట్ లు భలే సెట్ అవుతాయి. ఎంత బాగా తయారైనా సరే.. మేకప్, డ్రస్సింగ్ కు మరింత అదనపు లుక్ ఇవ్వడానికి ముత్యాల లాకెట్ హెల్ప్ చేస్తుంది. అయితే ముత్యాలు ధరించేటప్పుడు కెమికల్స్ లేని స్ప్రేలు, పౌడర్లు వాడటం మంచిది.

                                               *నిశ్శబ్ద.