డార్క్ స్పాట్స్ ను ఇంట్లోనే ఇలా ఈజీగా తగ్గించేయండి..!
డార్క్ స్పాట్స్ అమ్మాయిల అందాన్ని చాలా పాడు చేస్తాయి. ముఖం మీద వృత్తాకారంలో నల్లగా కనిపించే ఈ డార్క్ స్పాట్స్ ను చాలావరకు మేకప్ తో కవర్ చేస్తుంటారు. అయితే ఇంటి పట్టునే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
అలోవెరా జెల్..
ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అలోవెరా జెల్‌ని డార్క్ స్పాట్స్‌కి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఒక వారం పాటు అప్లై చేస్తే తేడా కనిపిస్తుంది.
నిమ్మ, తేనె..
నిమ్మరసం, తేనె రెండూ హైపర్పిగ్మెంటేషన్‌కు సహజ నివారణలు. నిమ్మరసం, తేనె రెండూ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
సన్‌స్క్రీన్ ..
సూర్యరశ్మి వల్ల డార్క్ స్పాట్‌లు అధ్వాన్నంగా ఉంటాయి. సూర్యుని కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి తగిన సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అవసరం.
నీరు ..
చర్మాన్ని హైడ్రేటెడ్, ఆరోగ్యంగా ఉంచడానికి రోజంతా తగినంత నీరు త్రాగాలి.
మజ్జిగ..
మజ్జిగ చర్మంలోని మృతకణాలను తొలగించి నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్లటి మచ్చల మీద మజ్జిగ అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఆరెంజ్ పీల్ పౌడర్ మాస్క్..
ఆరెంజ్ పీల్ స్కిన్ టోన్ కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖానికి నారింజ మాస్క్‌ను అప్లై చేసి 10-12 నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు, పెరుగు..
పసుపు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు చర్మానికి ఓదార్పు ఇస్తుంది. 2 టేబుల్ స్పూన్ల పెరుగులో చిటికెడు పసుపు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి, చేతులకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగి మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి.
*రూపశ్రీ.