ఈ పువ్వు ఒక్కటి చాలు.. చర్మ సమస్యలు అన్నీ పరార్..!
ఔషధ గుణాలతో నిండిన పూలు మన చుట్టూ ఎన్నో ఉన్నా వాటి అందాన్ని చూసి సంతోషపడుతూ వాటి సువాసన ఆస్వాదిస్తూ గడిపేస్తుంటారు చాలా మంది. అయితే పువ్వులు చర్మానికి వరం కంటే తక్కువ కాదు. ముఖ్యంగా కొన్ని పువ్వులు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పట్లో అందరికీ అందుబాటులో ఉంటూ సౌందర్య రక్షణలో విరివిిగా ఉపపయోగిస్తున్న పువ్వులలో గులాబీ ప్రథమ స్థానంలో ఉంది. గులాబీ పువ్వును రోజ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. అంతే కాదు.. గులాబీ పువ్వుల నుండి చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇంట్లోనే రోజ్ మాయిశ్చరైజర్ తయారు చేసి వాడితే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
కావలసిన పదార్థాలు..
గులాబీ - 1
నీరు - 5 మి.లీ
అలోవెరా - 30 గ్రా
అర్గాన్ ఆయిల్ - 4 మి.లీ
తయారీ విధానం..
మిక్సర్ జార్‌లో గులాబీ రేకులు, 5 ml నీరు, 30 గ్రాముల కలబంద, 4 ml ఆర్గాన్ ఆయిల్ వేయాలి. అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన తర్వాత, గులాబీ సరిగ్గా గ్రైండ్ చేయబడిందో లేదో చెక్ చేయండి. అవసరమైతే, మరొకసారి గ్రైండ్ చేయాలి.
బాగా గ్రైండ్ అయిన తరువాత అద్భుతమైన మాయిశ్చరైజర్ సిద్ధంగా ఉన్నట్టే.
దీన్ని నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు, కానీ స్నానం చేయడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
ఒకవేళ ఇంట్లో ఆర్గాన్ ఆయిల్ లేకపోతే బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.
గులాబీ ఎందుకంటే..
గులాబీ రేకుల సారంలో అధిక ఆంథోసైనిన్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటాయి. గులాబీ రేకుల సారం కూడా యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలకు గురైనప్పుడు ఎపిడెర్మల్ సెల్ లైన్లలో సైటోకిన్ లను అణిచివేయడం ద్వారా మన చర్మంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మొత్తంమీద గులాబీ చర్మానికి ఔషధంలా పనిచేస్తుంది.
*రూపశ్రీ.
