పండ్లను ఈ సమయాల్లో తింటే ఆరోగ్యాని చాలా మేలు...
ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్షును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. వీటిలో సహజసిద్దమైన విటమిన్లు, మినరల్స్, ఫైటో కెమికల్స్ ఉంటాయి. శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్ టాబ్లెట్లు వాడడం కన్నా పండ్లను తింటే సహజసిద్ధమైన విటమిన్లు లభిస్తాయి. ప్రతిరోజూ ఐదు పండ్ల ముక్కలను తినడం వల్ల సంపూర్ణారోగ్యంగా ఉంటారు. అయితే పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.
పండ్లు ఎపుడు తినాలి? సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు. పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల ఇది శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఈ సమయంలో తీసుకొనే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాంశాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ ను నిదానంగా పెంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం: మీరు ప్రతి రోజూ వ్యాయం చేస్తున్నట్లైతే పండ్లు ఫర్ ఫెక్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు. స్నాక్ అనే ఈ పండ్లను వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. పండ్లు మన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ ను నిర్వహిస్తుంది, కానీ ఇది కడుపు ఫుల్ గా లేదా ఉబ్బరంగా అనిపించదు . శరీరం కూడా ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ద చేసుకుంటుంది. వ్యాయామం చేయడానికి బాడీ సెల్స్ కు ఇన్సులిన్ స్థాయిలను పంపిస్తుంది.
భోజనానికి -భోజనానికి మద్య: భోజనానికి ఒక గంట ముందు పండ్లు తీసుకోవడం చాలా మంచి పద్దతి. అలాగే భోజన చేసిన రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది . ఇలా తీసుకోవడం వల్ల విటమిన్ సి, పెక్టిన్ మరియు ఫైబర్లు పూర్తిగా శరీరంలోని వ్యాప్తి చెందుతాయి. పండ్లను ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత: భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకోవడం వల్ల, శరీరంలో ఫ్రక్టోజ్ ద్వారా శోషణ నెమ్మదిగా ఉంటుంది. మిగిలిన ఫ్రక్టోజ్ జీర్ణవ్యవస్థలో ఉండి ఆర్గానిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది మరియు కడుపు ఉబ్బరం, అతిసారానికి దారితీస్తుంది. పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు.
పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు. మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.
పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది. సీజనల్ ఫ్రుట్స: మనకు ఏ సీజన్‌లో అయినా వివిధ రకాల పండ్లు లభిస్తాయి. కొన్ని పండ్లు మాత్రం సీజన్‌ను బట్టే లభిస్తాయి. అలాంటి పండ్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ప్రతి సీజన్‌లో దొరికే పండ్లను తినడం, జూస్‌లా తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాదు అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి