గుండె సమస్య ఉండి డాక్టర్ చెబితే తప్ప మీరు ప్రతిరోజూ బరువును చూసుకోవలసిన అవసరం లేదు .
తిన్న తర్వాత మన శరీరంలో ఫ్లూయిడ్ ఎక్కువవుతుంది . తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటామనుకుందాం. పనీ చేయకూడదను కుందాం ! అప్పుడేమౌ తుందో మీకు తెలుసా? ఫ్యాట్ పెరిగి పోతుంది. నీరు బరువును ఎక్కువ చేస్తుంది. కొవ్వు బరువును పెంచుతుంది. కండరాల్ని బలంగా చేసుకుంటామని అంటారేమో ! లాభం లేదు. అయినా బరువు పెరుగుతుంది. అందుకని మీరు ఏమి తింటే సరిపోతుందో ముందు అది ఆలోచించండి.
మీరు హౌస్ వైఫా ? ఇంటి పనులు చేసుకుంటున్నారు కదా ! లేదా పనిమనుషులతో చేయిస్తున్నారా ? మీరు ఏం చేస్తారో గానీ, మీ కాలరీస్ బర్న్ అయ్యే మీ పనులు మాత్రం మీరు చేసుకోవలసిందే ! త్వరత్వరగా కూర్చొని లేచే పనులు చేసుకుంటూ ఉండాలి. బద్ధశత్రువుగా చూడండి.
దీర్ఘశ్వాస పీల్చుకునే విధంగా ఇంటి పనులను ఎంచుకుని చేయండి. చెమట వచ్చేట్టు ఉండాలి. మీ బరువును నియంత్రించటానికి డైటింగ్ ఒక్కటే మార్గమని అనుకోకూడదు. ఎంత తిన్నామన్నది ముఖ్యంకాదు. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ? ఎంత చెమటపడుతుందో ముఖ్యం.