గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి షాకింగ్ నిజాలు!

ఈమధ్య కాలంలో మహిళలు గర్భము ధరించిన తరువాత మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మధుమేహం గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం. సాధారణంగా రెండవ లేదా మూడవ నెలలో శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇది ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి మీద, దాని అది శరీరంలో ఎలా వినియోగం అవుతుంది అని దానిమీద ఆధారపడి ఉంటుంది.  ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. గర్భధారణ మధుమేహం ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఇంకా ప్రసవ సమయంలో ప్రీక్లాంప్సియా వంటి సమస్యలను ఫేస్ చేసే ప్రమాదం ఉంది. ఇది అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలకు హాని కలిగించే పరిస్థితి.  అలాగే మధుమేహం ఉన్న గర్భవతులలో నెలలు నిండకనే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 

గర్భధారణ మధుమేహం శిశువు అధిక బరువుతో పుట్టడానికి దారితీస్తుంది. ఇది షోల్డర్ డిస్టోసియా (డెలివరీ సమయంలో శిశువు భుజం ఇరుక్కున్నప్పుడు) లేదా సిజేరియన్ డెలివరీ వంటి డెలివరీ సమస్యలకు దారితీయవచ్చు.

ఈ సమస్య వల్ల పుట్టిన తర్వాత శిశువులో తక్కువ షుగర్ లెవల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మూర్ఛలు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. ప్రసవ తర్వాత స్త్రీలలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దీనిని పూర్తిగా నిరోధించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

గర్భధారణ సమయంలో వచ్చే  మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి తినవలసిన ఆహారాలు:

కార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు

పచ్చని ఆకు కూరలు, బ్రోకలీ, క్యారెట్లు బెల్ పెప్పర్స్ వంటి ఇతర పిండి లేని కూరగాయలలో ఫైబర్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

తృణధాన్యాలు

శుద్ధి చేసిన ధాన్యాల నుండి బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలకు మారడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు శక్తిని, మంచి ఫైబర్ ను కలిగి ఉంటాయి.  

ప్రోటీన్-రిచ్ ఫుడ్స్

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, బీన్స్ మరియు చిక్కుళ్ళలో మంచి ప్రోటీన్ లభిస్తుంది. 

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, చీజ్ వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్లకు మంచి మూలం. అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

పండ్లు

పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి, కానీ వాటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు పండ్ల రసాలు లేదా ప్రాసెస్ చేసిన పండ్ల స్నాక్స్ కంటే తాజా పండ్లను ఎంచుకోవాలి, ప్రాసెస్ చేసిన వాటిలో  చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.

గింజలు మరియు విత్తనాలు

గింజలు, విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ లను కలిగి ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు ఇవి  మంచి స్నాక్ లా ఉపయోగపడతాయి. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు ఆహారంలో చేర్చుకోవడానికి కొన్ని మంచి ఎంపికలు.

 ఆరోగ్యకరమైన కొవ్వులు

అవోకాడో, ఆలివ్ నూనె వంటి వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు గర్భధారణ మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలకు కడుపు నిండుగా సంతృప్తిగా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి.

గర్భధారణ మధుమేహానికి వ్యతిరేకంగా 

మహిళలు నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ మధుమేహం అధిక ప్రమాదం ఉన్న మహిళలు,  కుటుంబంలో ఎవరికైనా మధుమేహం సమస్య ఉన్నవారు, గర్భధారణ సమయంలో రెగ్యులర్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా జాగ్రత్త పడచ్చు. 


                                 ◆నిశ్శబ్ద.