ప్రసవం తరువాత మహిళలు ఇవి తింటే అద్భుతమైన శక్తి సొంతమవుతుంది!
ప్రసవం తరువాత స్త్రీలలో శారీరక, భావోద్వేగ మార్పులు చాలా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్ల జరిగేవి.. ఈ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా జాగ్రత్త అవసరం. డెలివరీ తరువాత కూడా తల్లిబిడ్డలకు ఇద్దరికీ సరైన జాగ్రత్త, సరైన వైద్య సేవలు అవసరమవుతాయి. ఈ హార్మోన్స్ ను, శారీరక స్థితిని తిరిగి మాములు స్థాయికి తిరిగి తీసుకుని రావడానికి అవి మాత్రమే కాకుండా ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ప్రసవం తర్వాత శరీర మార్పులకు, స్థితికి తగ్గట్టు ఆహారాన్ని కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో పోషకాలు అవసరమైన ఆహారం కూడా పుష్కలంగా తీసుకోవాలి. లేకపోతే శరీరం తొందరగా అలసిపోతుంది. బిడ్డకు పాలు ఇవ్వవడంలో సమస్యలు ఏర్పడటం నుండి మహిళల్లో అలసట, రక్తహీనత, ఎముకలు బలహీనంగా మారడం వంటి ఎన్నో సమస్యలు చాప కింద నీరులా చుట్టుముడతాయి.
మీరు ప్రసవానంతరం తొందరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు డైట్ లో భాగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
పెసరపప్పు..
పెసరపప్పులో ఐరన్, పొటాషియం, కాపర్ మెగ్నీషియం, అలాగే ఫైబర్, విటమిన్ B6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి
బాదం..
బాదంపప్పులు నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి తీసుకునే ఆహారం శరీరంలో శక్తిగా మార్చడంలో సహాయపడతాయి.
వేయించిన గుమ్మడికాయ గింజలు
మెగ్నీషియం కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వేయించిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ కొద్దిగా తీసుకుంటే మంచిది.
బొప్పాయి
బొప్పాయిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా శోషించబడతాయి, త్వరగా శక్తిని అందిస్తాయి. అదనంగా, బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇది ఆహారం నుండి పోషకాలను బాగా ఉపయోగించుకోవడంలో శరీరానికి సహాయపడుతుంది, శరీరానికి కావల్సిన శక్తి స్థాయిలను పెంచుతుంది.
నెయ్యి
అలసట అనేది అంతర్లీన ఒమేగా-3 లోపం వల్ల ఏర్పడే సాధారణ లక్షణం, కాబట్టి నెయ్యి (ఒమేగా 3 గొప్ప మూలంగా నెయ్యిని పరిగణిస్తారు)ని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.
ప్రసవం అనంతరం పైన చెప్పుకున్నా ఆహారాలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగానూ, శారీరక, మానసిక స్థాయిలు సక్రమంగా నిర్వహించడంలోనూ సహాయపడుతాయి.
◆నిశ్శబ్ద.