మహిళలు పిసి ఓఎస్ సమస్య నుండి బయట పడాలంటే ఈ ఆహారాలు తినాలి..!
పిసిఓయస్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది హార్మోన్ సమస్యల వల్ల వస్తుంది. దీనికి జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఒక నిర్ణీత వైద్యం అంటూ లేకపోవడం వల్ల మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. భారతదేశంలో సుమారు 20శాతం మంది మహిళలు పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. 70శాతం మంది మహిళలకు తాము పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని కానీ, పిసిఓఎస్ సమస్య గురించి కానీ తెలియదు.
పిసిఓఎస్..
పిసిఓఎస్ సమస్యలో మహిళలు పీరియడ్స్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. హార్మోన్ల స్థాయిలలో హెచ్చు థగ్గులు ఏర్పడటం వల్ల ఇది పిల్లలు కడగడంలో కూడా ఆటంకాలు కలిగిస్తుంది. పిసిఓఎస్ ఉన్న మహిళలు గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఉంటాయి. అందుకే చాలామంది సంతానలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో. ఈ పిసిఓఎస్ కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా మహిళలకు పెరుగుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ను తగ్గించుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇది కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు. శరీరంలో చక్కెరల శాతం హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తుంది.
పిసిఓఎస్ నుండి మహిళలు బయట పడాలి అంటే సీజన్ ను ఫాలో అవ్వాలి. ఇప్పట్లో సీజన్ కాకపోయినా అన్ని రకాల కూరగాయలు, పండ్లు దొరుకున్నాయి. చాలామంది వీటిని కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ వీటి వల్ల శరీరంలో హార్మోన్ సమస్యలు వస్తాయి. పిసిఓఎస్ తగ్గాలంటే సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
శరీరంలో హార్మోన్ల సమస్య తగ్గాలంటే ఒమేగా-3 రిచ్ ఫుడ్స్ లేదా ఒమేగా-3 సప్లిమెంట్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కేవలం ఇవి మాత్రమే మాత్రమే కాకుండా, కాల్షియం, విటమిన్-డి, విటమిన్-బి12 కూడా సమృద్దిగా తీసుకోవాలి.
వ్యాయామం చాలా సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ఎంత బిజీ లైఫ్ లో అయినా రోజులో గంటసేపు వ్యాయామానికి కేటాయించుకోవాలి. పిసిఓఎస్ పరిష్కారానికి తగిన వ్యాయామాల గురించి పలుచోట్ల చాలా వీడియోలు అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి వ్యాయామాలు కంటిన్యూ చేయవచ్చు. అనూకూలం, అవకాశం ఉన్నవారు నిపుణుల సలహా తో కూడా వ్యాయామాలు చేయవచ్చు.
చాలామంది మహిళలలో పిసిఓఎస్ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మధుమేహానికి దారితీయకూడదు అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఇది మధుమేహం రాకుండా ఉండటంలో, జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.