గాజుంగరం.. పేరు విన్నారా..?

 

సాధారణంగా మగవారి కంటే ఆడవారికే ఎక్కువ ఫ్యాషన్ ఐటమ్స్ కావాలి. చెవి రింగులు, ముక్కు పుడకలు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు.. ఇలా అన్నీ పెట్టుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ముంజేతిని మాత్రం అలా ఖాళీగా ఎందుకు వదిలేయాలి అనుకున్నారేమో కాని.. మన డిజైనర్లు వాటికి కూడా ఆభరణాలు కనిపెట్టేశారు. వాటినే మార్కెట్లో పామ్ బ్రేస్ లెట్ల పేరుతో అమ్ముతున్నారు. అయితే ఈ పామ్ బ్రేస్ లెట్లు జారిపోకుండా కూడా చాలా తెలివిగా వేళ్లను చుట్టుకుని ఉండేలా మరో కొత్త మోడల్ ని తీసుకొచ్చారు. దీంతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న టైప్ లో అటు పామ్ తో పాటు.. వేలికి ఉంగరాలు పెట్టుకునే పని కూడా ఉండదు. మంచి పార్టీలకు వెళ్లినప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి. మీరూ ఒకసారి ట్రై చేయండి..