జుట్టుకు రంగు వేస్తుంటారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

 

 ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ అనేది ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. కొత్త లుక్ కోసం,   స్టైలిష్ గా కనిపించడానికి, చాలా మంది జుట్టుకు వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు. కొంతకాలం క్రితం వరకు తెల్ల జుట్టును కవర్ చేయడానికి జుట్టు రంగును ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అది కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది. కానీ పదే పదే జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టు బలహీనపడుతుందని  తెలుసా?. దీనితో పాటు  జుట్టుకు అనేక రకాల నష్టాన్ని కలిగిస్తాయి. జుట్టుకు అధికంగా రంగులు వేయడం వల్ల, జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. హెయిర్ కలర్ ని పదే పదే వాడటం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుంటే..

జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే నష్టాలు..

జుట్టు రాలడం, విరిగిపోవడం

హెయిర్ కలర్ ని పదే పదే వాడటం వల్ల, జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. ఎందుకంటే అమ్మోనియా,  హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు జుట్టు రంగులో ఉంటాయి. ఇవి జుట్టు నుండి సహజ తేమను తొలగిస్తాయి.

 చికాకు,  అలెర్జీలు..

పదే పదే జుట్టుకు రంగు వేయడం వల్ల తలపై చర్మం చికాకుకు లోనవుతుంది.  అలెర్జీలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పారాఫెనిలిన్ డైమైన్ (PPD) వంటి రసాయనాలు చికాకు, దురద,  దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తాయి.

జుట్టు పలుచన..

జుట్టుకు రంగు వేయడం వల్ల అది రాలిపోతుంది.  జుట్టు కూడా సన్నగా మారుతుంది. రసాయన రంగులు తల చర్మం  సహజ తేమ,  పోషణను తొలగిస్తుంది. దీని కారణంగా జుట్టు పలచబడుతుంది.

జుట్టు  స్వభావం..

జుట్టుకు పదే పదే రంగు వేసుకుంటే జుట్టు మునుపటిలా మృదువుగా,  మెరుస్తూ ఉండదు. జుట్టు రంగు జుట్టును గజిబిజిగా చేస్తుంది. దీని వల్ల జుట్టు స్వభావం కోల్పోతుంది.

                                 *రూపశ్రీ.